S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

కృష్ణగిరి, సెప్టెంబర్ 22: మండల పరిదిలోని అలంకొండ గ్రామానికి చెందిన పుండుకూర లవన్న (25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గురువారం లవన్న తన గ్రామం నుండి స్వంత పని మీద ఆటోలో డోన్‌కు బయలు దేరాడు. కటారుకొండ గ్రామం దాటిన తర్వాత ఆటో డ్రైవరు సడన్‌గా బ్రేక్ వేయడంతో లవన్న ఆటో నుంచి జారీ కింద పడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన లవన్నను ఆదే ఆటోలో చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మిదేవి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలసి ఎస్సై సోమ్లానాయక్ ప్రభుత్వా ఆసుపత్రికి చేరుకొని మృత దేహాన్ని పరిశీలించారు.

ఒకవైపు వర్షాలు

కడప, సెప్టెంబర్ 22:గత మూడురోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలు కొన్ని మండలాలకే పరిమితం కాగా మరికొన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులు యధాతథంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కడప డివిజన్‌లోని అనేక మండలాల్లో గత మూడురోజులుగా పడుతున్న వర్షాలు రైతులను ఆనందింపచేస్తున్నాయి. కడప , వల్లూరు, పెండ్లిమర్రి, సికెదినె్న, చెన్నూరు, ఖాజీపేట, కమలాపురం, ఎర్రగుంట్ల తదితర మండలాల్లో గత మూడురోజులుగా మంచి వర్షాలు కురిశాయి. ఇదే డివిజన్‌లో రాయచోటి, చిన్నమండెం, సంబేపల్లె, సుండుపల్లి, గాలివీడు మండలాల్లో అరకొర వర్షాలు పడగా ఎల్‌ఆర్ పల్లి, చక్రాయపేట, రామాపురం మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది.

రాజంపేటలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్..!

రాజంపేట, సెప్టెంబర్ 22:రాష్ట్రంలో వాయిదా పడ్డ రాజంపేట మున్సిపాలిటీ ఎన్నిక త్వరలో జరగనున్న నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా ప్రజలకు చేరువ అయ్యేందుకు కార్యాచరణ ప్రణాళికతో ముందడుగు వేస్తుంది. తాజాగా రాష్ట్ర మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ రాజంపేట మున్సిపాలిటీలోని 20 వార్డులలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా మున్సిపల్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు పట్టణ వీధులలో పర్యటించిన సందర్భంగా శానిటేషన్ ఆధ్వాన్న స్థితిలో ఉందని అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

గ్రామాల్లో పడకేసిన పారిశుద్ధ్యం!

కడప, సెప్టెంబర్ 22:గతనెలరోజులుగా అడప దడప కురుస్తున్న వర్షాలకు వాతావరణంలో వచ్చిన మార్పులకు గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్యం పడకేసింది. గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, నిధులుంటే పారిశుద్ధ్యం పనులు చేపడతామని నిధులులేక గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని పక్కనపెడితే అభివృద్ధే అభివృద్ధి జరగడం లేదని, తమకొచ్చేఅరకొర నిధులతో గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేయలేకపోతున్నామని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు తమకు నెలసరి జీతాలు వస్తే చాలనే ఉద్దేశ్యంతో వారు అంటీ అంటనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

ధర్మసంస్థాపనకే భగవంతుడి అవతారాలు

కడప(కల్చరల్), సెప్టెంబర్ 22: ఆయా యుగాల్లో ధర్మాన్ని స్థాపించేందుకు భగవంతుడు వివిధ అవతారాలు దాల్చారని జ్ఞాన బ్రహ్మస్వామి స్వామి సుందరచైతన్యానంద అన్నా రు. 290వ జ్ఞాన యజ్ఞంలో భాగంగా గురువారం సాయంత్రం స్థానిక మున్సిపల్ మైదానంలో సభనుద్దేశించి ఆయన ప్రసంగించారు.

జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ

సిద్దవటం, సెప్టెంబర్ 22:ప్రభుత్వం కడప జిల్లాను మలేరియా హెల్త్ ఏమర్జెన్సీగా ప్రకటించినట్లు కలెక్టర్ సత్యనారాయణ వెల్లడించారని జాతీయ కీటక జనిత నిర్మూలన అధికారి త్యాగరాజు తెలిపారు. మండల కేంద్రమైన సిద్దవటం సబ్ యూనిట్ కార్యాలయాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలో 2012లో 668 మలేరియా కేసులు నమోదుకాగా, 2013 లో 247, 2014లో 407, 2015లో 353, ఈ ఏడాది ఇప్పటి వరకు 589 కేసులు మలేరియా కేసులు నమోదయ్యాయన్నారు. అందులో వివిధ రకాల జబ్బులకు సంబంధించిన కేసులున్నాయన్నారు. ప్రపంచంలో 2800 రకాల దోమలు ఉండగా అందులో ఆడ ఎనాఫిస్ దోమ వల్ల మలేరియా జ్వరం సోకుతోందన్నారు.

వరిసాగుకు ఉరి పడినట్లేనా!

కడప, సెప్టెంబర్ 22:ప్రభుత్వమేమో ఆహార ఉత్పత్తులకు అధిక ప్రాముఖ్యత కల్పించాలంటూ జిల్లాలో వేరుశెనగ తర్వాత ప్రధాన పంట అయిన ఈ ఏడాది వరిసాగుకు ఉరి పడి రైతులు ఆందోళన చెందుతున్నారు. కేవలం వరిసాగుకు కొన్ని ప్రాంతాలకే వర్షాలు పరిమితమయ్యాయి. అన్ని ప్రాంతా ల్లో అరకొర సాగుచేశారు. జిల్లా వ్యాప్తంగా వరికి తెగుళ్లు సోకి వేలాది ఎకరాల పంటలు ఎండుతున్నాయి. జిల్లాలో ఈ ఏడాది జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, బద్వేలు ప్రాంతాలకే వర్షాలు పరిమితమయ్యా యి. మిగిలిన ప్రాంతాల్లో ఖరీఫ్‌సీజన్‌కు అవసరమైనంత వర్షం కురవలేదు. గతంలో సలహాలు సూచనలు ఇచ్చే వ్యవసాయ అధికారులు, సిబ్బం ది కొరత తీవ్రంగా ఉండేది.

గురు నిలయం ప్రారంభించిన శ్రీదత్త

కడప(కల్చరల్), సెప్టెంబర్ 22:కడప నగరం విశ్వనాథపురంలో వెలసివున్న మైసూరుకు చెందిన శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమంలో గురువారం ఉదయం కొత్తగురు నిలయాన్ని శ్రీదత్తవిజయానంద తీర్థస్వామిజి ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత స్వామిజీ శ్రీచక్రపూజ, రుద్రహోం నిర్వహించారు. పైకార్యక్రమాల్లో నగరంతోపాటు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పూజలు అనంతరం భక్తులనుద్దేశించి శ్రీదత్తవిజయానందతీర్థస్వామి ప్రసంగించారు.

వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తిచేయాలి

కడప(కల్చరల్),సెప్టెంబర్ 22:వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యం మేరకు 182 గ్రామాల్లో 42వేలు అక్టోబర్ 31లోగా పూర్తి చేయాలని ఎంపిడిఓలను కలెక్టర్ కెవి సత్యనారాయణ ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌లో ఆర్డీఓలు, మండల అభివృద్ధి అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. నీరు-చెట్టు, డ్రిప్ ఇరిగేషన్, మండల పరిస్థితి, సీజనల్ వ్యాధులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

26న జస్టిస్ మంజునాథ్ కమిషన్ రాక

కడప(కలెక్టరేట్), సెప్టెంబర్ 22:కాపులతో సహా 11 కులాలను బిసి జాబితాలో చేర్చాలన్న వినతులపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన జస్టిస్ మంజునాథ్ కమిషన్ ఈనెల 26న కడపకు రానుంది. జడ్పీ సమావేశ మందిరంలో మూడురోజులపాటు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. జిల్లాలోని వివిధ సంఘాల తరపున వినతులు స్వీకరిస్తారు.

Pages