S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/18/2017 - 00:55

హైదరాబాద్, సెప్టెంబర్ 17: రాష్ట్రంలో కెసిఆర్ పాలన రజాకార్లను మించిపోయిందని టిటిడిపి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బోడ జనార్థన్, టిఎన్‌టియూసి అధ్యక్షుడు బిఎన్ రెడ్డి ఆరోపించారు. విలీన దినోత్సవం ముందు రోజు శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండల పరిధిలో 36 మంది గిరిజనులను, మహిళలను చెట్టుకు కట్టేసి కొట్టి చిత్ర హింసలు పెట్టి, వారి గుడిసెలను అటవీశాఖ అధికారులు కూల్చివేశారని అన్నారు.

09/18/2017 - 02:54

హైదరాబాద్, సెప్టెంబర్ 17: ఫార్మా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రంగారెడ్డి జిల్లా మేడిపల్లి ప్రాంతంలో ఫార్మా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుపై వచ్చే నెల 11న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నది. ఫార్మా పార్కు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది.

09/18/2017 - 00:47

హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణలో గత రెండురోజుల నుండి ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగర్‌కర్నూలు జిల్లాలోని అచ్చంపేట ప్రాంతంలో గత 24 గంటల్లో భారీ వర్షం కురిసింది. ఈ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కొద్దిపాటి వర్షాలు కురిశాయి. వాస్తవంగా నాగర్‌కర్నూలు జిల్లాలో ఈ సీజన్‌లో అతితక్కువ వర్షపాతం నమోదైంది.

09/17/2017 - 04:34

హైదరాబాద్, సెప్టెంబర్ 16: షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్‌కు పాల్పడుతుండటం దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసే జాడ్యాలలో ఒకటని, ఈ తరహా కంపెనీలు, షెల్ ఎన్‌జిఓల వల్ల కలిగే దుష్పరిణామాలపై దేశంలో అవగాహన పెరగాలని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. దేశంలో జిఎస్‌టి అమలులో ఎదురయ్యే సవాళ్లను కంపెనీ సెక్రటరీలే పరిష్కరించగలగాలని పేర్కొన్నారు.

09/17/2017 - 04:22

హైదరాబాద్, సెప్టెంబర్ 16: వినియోగదారుల ఫోరంలో దాదాపు 10 వేల కేసులు గత 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని సుప్రీంకోర్టు అపాయింటెడ్ కమిటి (ఎస్‌సిఎసి) చైర్మన్ జస్టిస్ అర్జిత్ పశాయత్ పేర్కొన్నారు. వినియోగదారుల ఫోరంల రెండురోజుల ప్రాంతీయ సమావేశాన్ని శనివారం హైదరాబాద్‌లోని మెర్క్యూరీ హోటల్‌లో ఆయన ప్రారంభించారు.

09/17/2017 - 02:15

హైదరాబాద్, సెప్టెంబర్ 16: హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్న ఐసిస్ ఉగ్రవాద ఖైదీలు హల్‌చల్ చేశారు. ఇబ్రాహీం యజ్ఞాని, మహమ్మద్ ఇలియాస్ యజ్దాని, అతవుల్లా రహ్మాన్‌లను ఏడాది క్రితం కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వీరిని అరెస్టు చేసి జైలులో ఉంచింది. నాటి నుంచి అండర్ ట్రయల్ ఖైదీలుగా చంచల్‌గూడ జైల్లోనే విచారణ ఖైదీలుగా ఉంటున్నారు.

09/17/2017 - 02:20

హైదరాబాద్, సెప్టెంబర్ 16: ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే ప్రసక్తిలేదని, బీసీలను మభ్యపెట్టకుండా ఈ వర్గాల కుటుంబాల్లో వెలుగు నింపేందుకు ప్రభుత్వ పథకాలు రూపొందించి అమలు చేయాలని సిఎం కె. చంద్రశేఖరరావు ఆదేశించారు. బీసీల అభ్యున్నతికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రగతిభవన్‌లో శనివారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

09/17/2017 - 02:10

హైదరాబాద్, సెప్టెంబర్ 16: సరళతర వాణిజ్యంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ఐటి మంత్రి కె.తారకరామారావు అన్నారు. దీంతో పాటు వ్యాపార ఖర్చు తగ్గించడం, నాణ్యత పెంచడం ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. శనివారం బేగంపేటలోని హరిత ప్లాజాలో సరళతర వాణిజ్య విధానంపై పరిశ్రమల శాఖ అవగాహన సదస్సు నిర్వహించింది.

09/17/2017 - 02:08

హైదరాబాద్, సెప్టెంబర్ 16: దేశం మరింతగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం అవసరం ఎంతైనా ఉందని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం ఉప్పల్‌లోని అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ప్రాంతీయ శిక్షణ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై సంస్థ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

09/17/2017 - 01:59

కాకినాడ, సెప్టెంబర్ 16: కాకినాడ నగర పాలక సంస్థ మేయర్‌గా సుంకర పావని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా కాళా భీమశంకర సుబ్రహ్మణ్యేశ్వర సత్తిబాబు ఎన్నికయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగర పాలక సంస్థ కౌన్సిల్ హాలులో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ మేరకు శనివారం ఉదయం కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

Pages