S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/17/2017 - 01:53

అమరావతి, సెప్టెంబర్ 16: విదేశాల్లోనూ వెంకన్న ఆలయాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రవాసాంధ్రుల ప్రయోజనాల కోసం ఏపి నాన్ రెసిడెంట్ తెలుగు (ఎపిఎన్‌ఆర్‌టి) పాలక మండలి ‘ప్రవాసాంధ్రుల సంక్షేమం- అభివృద్ధి పాలసీ’ని ప్రకటించింది. ప్రవాసాంధ్ర హెల్ప్‌లైన్, ప్రవాసాంధ్ర భరోసా, ప్రవాసాంధ్ర సహాయ నిధి వంటి పథకాల ప్రారంభానికి సిఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.

09/17/2017 - 01:49

గుంటూరు, సెప్టెంబర్ 16: తమిళనాడులో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. తిరునల్వేలి జిల్లా పాల్యంకొట్టి పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది.

09/17/2017 - 01:46

విశాఖపట్నం, సెప్టెంబర్ 16: పర్యావరణానికి చేటు కలిగిస్తున్న మనిషే పర్యావరణ పరిరక్షణకు సంకల్పించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ అభిప్రాయపడ్డారు. విశాఖలో రెండు రోజుల పాటు జరగనున్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) ప్రాంతీయ సదస్సును శనివారం ప్రారంభించారు. మానవుడు తన అవసరాల కోసం చేపడుతున్న కార్యకలాపాలు, పర్యావరణానికి తీరని విఘాతం కలిగిస్తున్నాయన్నారు.

09/17/2017 - 01:42

హైదరాబాద్/ గద్వాల/ శ్రీశైలం, సెప్టెంబర్ 16: కృష్ణవేణి పరవళ్లతో తెలంగాణ కృష్ణా బేసిన్ కదం తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి శనివారం భారీ వరద వచ్చి చేరింది. సుమారు 1.89 లక్షల క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి చేరుకుంది. ఈ సీజన్‌లో ఇదే భారీ ఇన్‌ఫ్లో కావడం గమనార్హం. దీంతో జలాశయం నీటిమట్టం 840 అడుగులకు చేరుకుంది.

09/16/2017 - 04:03

ఆదోని, సెప్టెంబర్ 15: ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులోని రాజోలిబండ ఆనకట్ట జలకళ సంతరించుకుంది. సుమారు 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో 62 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. దీంతో మూడు గేట్లు తెరిచి దిగువ తుంగభద్ర నదిలోకి విడుదల చేశారు. శనివారం మరో 30 వేల క్యూసెక్కుల నీరు వస్తుందని అంచనా వేస్తున్నారు.

09/16/2017 - 04:00

శ్రీశైలం, సెప్టెంబర్ 15: శ్రీశైల మహాక్షేత్రంలో శరన్నవరాత్రోత్సవాలు ఈనెల 21 నుంచి 30 తేదీ వరకు నిర్వహించనున్నారు. దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు విస్తృత సౌకర్యాలు కల్పిస్తున్నారు. సేవా సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లతోపాటు 9 రోజులపాటు ఆలయ సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించనున్నారు.

09/16/2017 - 04:08

హైదరాబాద్, సెప్టెంబర్ 15: మహేష్‌బాబును చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని, సినిమా సినిమాకీ అతడు ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నాడని ప్రముఖ నటుడు, అలనాటి సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. మహేష్‌బాబు హీరోగా మురగదాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న స్పై థ్రిల్లర్ మూవీ ‘స్పైడర్’ ప్రీ రిలీజ్ వేడుక శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో అభిమానులు, చిత్ర ప్రముఖుల మధ్య అట్టహాసంగా జరిగింది.

09/16/2017 - 01:46

హైదరాబాద్, సెప్టెంబర్ 15: రైతు బాగుంటేనే అంతా బాగుంటారని, సమాజమూ బాగుంటుందని సిఎం చంద్రశేఖరరావు అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో సంచార పశువైద్య శాలను ప్రారంభించిన సందర్భంలో మాట్లాడుతూ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. 84 లక్షల గొర్రెలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చామని, అందుకనుగుణంగా పంపిణీ ప్రక్రియ చేపట్టామన్నారు.

09/16/2017 - 03:11

హైదరాబాద్, సెప్టెంబర్ 15: జంతువుల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ పేర్కొన్నారు. మనుషులకు హక్కులు ఉన్నట్టే జంతువులకు కూడా ఉంటాయని గుర్తించాలని, ఈ విషయంలో యువత చైతన్యం కావాలని అన్నారు. జంతుజాలాన్ని పరిరక్షించినపుడే మనిషి మనుగడ సాధ్యమవుతుందని, జీవావరణమే ఆర్ధిక వనరుగా గుర్తించాలని ఆమె పేర్కొన్నారు.

09/16/2017 - 01:41

హైదరాబాద్, సెప్టెంబర్ 15: తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్‌కు చీఫ్ కమిషనర్‌గా రాష్ట్ర శాసనసభ పూర్వ కార్యదర్శి రాజా సదారామ్‌ను, కమిషనర్‌గా పాత్రికేయుడు బుద్దా మురళిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేసింది. వీరి పదవీ కాలం ఐదేళ్లుంటుంది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ప్రతిష్టాకరమైన రాష్ట్ర సమాచార కమిషన్‌కు తొలి చీఫ్ కమిషనర్‌గా రాజా సదారామ్‌ను నియమించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Pages