S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/12/2016 - 06:36

హైదరాబాద్, ఏప్రిల్ 11: ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీని ప్రాసిక్యూట్ చేసేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు ఆమోదం తెలిపింది. తాత్కాలిక ప్రధానన్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బి బోసలే, జస్టిస్ పి నవీన్‌రావులతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్‌కు హోంశాఖ కౌన్సిల్ వేణుగోపాల్ ఈ విషయాన్ని సోమవారం వివరించారు.

04/12/2016 - 06:08

కాకినాడ, ఏప్రిల్ 11: దేశ వ్యాప్తంగా అసంఘటిత రంగ కార్మికులందరికీ ఒకే విధమైన కనీస వేతన చట్టాన్ని అమలుచేయడానికి పార్లమెంటు సమావేశాల్లో చట్టాన్ని తీసుకురానున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించారు. దేశంలోని అసంఘటిత రంగ కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.

04/12/2016 - 04:20

సూళ్లూరుపేట, ఏప్రిల్ 11: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో నావిగేషన్ సేవలకు సంబంధించిన ఉపగ్రహ ప్రయోగానికి సన్నాహం చేస్తోంది. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం నుండి ఈ నెల 28న పిఎస్‌ఎల్‌వి-సి 33 రాకెట్ ప్రయోగం జరగనుంది.

04/12/2016 - 04:12

హైదరాబాద్, ఏప్రిల్ 11: యూనివర్సిటీలో ప్రొఫెసర్లు గంట పాటు పాఠం చెబుతారు, పాఠశాలల్లో పంతుళ్లు 40-50 నిమిషాల పాటు క్లాస్ తీసుకుంటారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దాదాపు మూడు గంటల పాటు రాజకీయాలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలు, ప్రజల సమస్యలు, ఆ సమస్యలను తీర్చడానికి ప్రజాప్రతినిధులు వ్యవహరించాల్సిన తీరు, ప్రపంచ వ్యాప్తంగా సుందరమైన నగరాలు..

04/12/2016 - 04:10

విశాఖపట్నం, ఏప్రిల్ 11: తెల్లదొరల దాష్టీకానికి బలైన భగత్‌సింగ్ ఉరికంబం ఎక్కే ముందు భారత్ మాతాకీ జై అంటూ నినదించారని, దీనికి లౌకికవాదులుగా చెప్పుకుంటున్న కొంతమంది వక్రభాష్యం చెపుతున్నారని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు విమర్శించారు.

04/12/2016 - 04:07

జగదాంబ, ఏప్రిల్ 11: తన మాటతీరుతో అందిరినీ ఆకట్టుకునే కేంద్రమంత్రి వెంకయ్య చలోక్తులు విసరడంలోనూ నేర్పరి అని చెప్పాలి. సందర్భోచితంగా మాట్లాడుతూనే నవ్వులు పండిస్తుంటారు. అలాంటి ఘటన విశాఖలో సోమవారం చోటుచేసుకుంది. విశాఖలో సోమవారం విమ్స్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధిగా హాజరైన వెంకయ్య వైద్యులను ఉద్దేశించి ప్రసంగిస్తూ రోగులకు సకాలంలో వైద్య సేవలందించి త్వరగా పంపాలన్నారు. పంపడం అంటే పైకి కాదు..

04/12/2016 - 04:06

హైదరాబాద్, ఏప్రిల్ 11: హైదరాబాద్‌లోని గ్రాండ్ కాకతీయ హోటల్‌లో మంగళవారం ఉదయం పది గంటలకు నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను అధ్యయనం చేసేందుకు నీతి ఆయోగ్ ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ రెండు పథకాల పట్ల దేశ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తం అవుతోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇంకా మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది.

04/12/2016 - 04:05

పొన్నూరు, ఏప్రిల్ 11: కాపులకు రిజర్వేషన్ల సాధన కోసం జూన్ తర్వాత భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చెప్పారు. మార్చి నుండి మే వరకు విద్యార్థులకు పరీక్షలు జరిగే సమయం కాబట్టి వారి చదువులకు ఆటంకం కలిగించకూడదనే అభిప్రాయంతో రెండోసారి ఉద్యమాన్ని వాయిదా వేశామని అన్నారు.

04/12/2016 - 04:03

హైదరాబాద్/ రాజేంద్రనగర్, ఏప్రిల్ 11: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ కోర్టు ఆవరణలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. కోర్టు ప్రాంగణంలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి తన భార్య గొంతు కోసి పరారయ్యాడు. దీంతో కోర్టు ప్రాంగణంలో వున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. బాధితురాలిని స్థానికులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.

04/12/2016 - 04:00

హైదరాబాద్, ఏప్రిల్ 11: హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కొత్తగా ఐదు మున్సిపాలిటీల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. గ్రామ పంచాయతీలను డి నోటిఫై చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డి నోటిఫై అయిన గ్రామాలు మున్సిపాలిటీలుగా మారేందుకు మార్గం సుగమం అయింది. కొత్తగా బోడుప్పల్, పీర్జాదిగూడ, మీర్‌పేట, జిల్లెలగూడ, జల్‌పల్లి మున్సిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి.

Pages