S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/01/2017 - 01:45

అమలాపురం, ఏప్రిల్ 30: రాష్ట్రంలో పోలీసు సిబ్బంది కొరతను అధిగ మించేందుకు మరో 800 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినట్లు డిజిపి ఎన్ సాంబశివరావు తెలిపారు. ఆదివారం అమలాపురంలో విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఇప్పటికే ఆరు వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరిగిందన్నారు.

05/01/2017 - 01:44

అమరావతి, ఏప్రిల్ 30: రైతు సమస్యలపై వైసిపి అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గుంటూరు నల్లపాడు రోడ్డులో నేడు, రేపు నిరాహార దీక్ష చేయనున్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు, రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి మాట తప్పడాన్ని నిరసిస్తూ ఆయన ఈ దీక్ష చేపడుతున్నారు. దీక్షకు గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి రైతులను సమీకరించేందుకు వైసిపి నేతలు ఏర్పాట్లు చేశారు.

05/01/2017 - 01:51

విజయవాడ, ఏప్రిల్ 30:పవిత్ర కృష్ణానది విజయవాడ నగరంలో వ్యర్థాలతో వెలువడే కలుషిత నీటితో కలసి మూసీ నదిలా మారుతోంది. ప్రకాశం బ్యారేజీ దిగువ నుంచి నగరం నడిబొడ్డులో వేర్వేరు ప్రాంతాలకు ప్రవహించే రైవస్, ఏలూరు, బందరు కాలువలు కాలుష్య కాసారాలుగా మారిపోయాయి. మంచినీటి కోసం ఈ కాలువలపై ఆధారపడ్డ దాదాపు 420 గ్రామాలకు చెందిన లక్షలాది మంది అనారోగ్యం పాలవుతున్నారు.

04/30/2017 - 06:19

నక్సల్స్ గాలింపునకు దళాలను పంపలేం
వ్యూహం చెబుతాం.. అమలు చేయండి
హోంశాఖకు తెగేసి చెప్పిన ఆంధ్ర, తెలంగాణ

04/30/2017 - 06:18

నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగరియా

04/29/2017 - 02:22

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఉన్నత విద్యాసంస్థల పునర్వికాసానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చాల్సిందేనని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్శిటీస్ (ఎఐయు) సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ ఫుర్కన్ కమర్ పేర్కొన్నారు. ఆంధ్రభూమి ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎఐయు అత్యంత పురాతనమైన అతి పెద్ద నెట్‌వర్క్ అని పేర్కొన్నారు.

04/29/2017 - 02:00

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల తొలి అంకం శుక్రవారం ముగిసింది. ప్రారంభ కార్యక్రమాన్ని అట్టహాసంతో ప్రారంభించగా, ముగింపు కార్యక్రమం మాత్రం ఘోరంగా, పేలవంగా నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి.

04/29/2017 - 01:57

వరంగల్, ఏప్రిల్ 28: ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు తెలంగాణ చరిత్ర, సంస్కృతిని మరుగున పడేశారని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. చివరకు తేట తెనుగు కవిత్వాన్ని అందించిన బమ్మెర పోతన కూడా మనవాడేనని, కడప జిల్లా ఒంటిమిట్ట నివాసిగా తప్పుడు ప్రచారానికి దిగారని విమర్శించారు. పోతన నివసించిన బమ్మెర గ్రామంతోపాటు పాలకుర్తి, వల్మిడి గ్రామాలను 40 కోట్లతో పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామన్నారు.

04/29/2017 - 01:54

హైదరాబాద్, ఏప్రిల్ 28: వివాదస్పద ఆస్తి కేసులో నిరభ్యంతర పత్రాన్ని నిర్లక్ష్యంతో జారీచేసిన ఉదంతంపై హైదరాబాద్ పూర్వ కలెక్టర్, ప్రస్తుత మున్సిపల్ శాఖ కార్యదర్శి, సమాచారశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్‌పై క్రమశిక్షణా చర్య తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది.

04/29/2017 - 03:04

ఖమ్మం, ఏప్రిల్ 28: గిట్టుబాటు ధర కోసం రైతన్న కనె్నర్ర చేశాడు. కనీస ధర చెల్లించకున్నా ప్రభుత్వం స్పందించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలోని ఫర్నిచర్, కాంటాలను ధ్వంసం చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చరిత్రలో అధికంగా శుక్రవారం రెండున్నర లక్షల మిర్చి బస్తాలు మార్కెట్‌కు వచ్చాయి.

Pages