S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/03/2017 - 02:17

హైదరాబాద్, మే 2: తెలంగాణ ఎమ్సెట్‌కు 2,20,070 మంది దరఖాస్తు చేశారు. 12న ఎమ్సెట్ నిర్వహించేందుకు ఎమ్సెట్ కమిటీ సర్వం సన్నద్ధం అయింది. 9వ తేదీలోగా అభ్యర్థులు తమ హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య పేర్కొన్నారు. ఇంత వరకూ 70వేల మంది తమ హాల్‌టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారని ఆయన చెప్పారు.

05/03/2017 - 02:18

హైదరాబాద్, మే 2: కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాలతో హైదరాబాద్‌లోని ఉమ్మడి రాష్ట్రంలో పదవ షెడ్యూల్‌లో ఉన్న భవనాలను స్వాధీనం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఎక్కడి ఆస్తులు అక్కడే అన్న సూత్రంపై కేంద్ర హోంశాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం హైదరాబాద్‌లో పదవ షెడ్యూల్ పరిధిలో దాదాపు 100కు పైగా సంస్ధల భవనాలు ఉన్నాయి.

05/02/2017 - 04:02

ఖమ్మం, మే 1: ప్రభుత్వ విధానాల వల్లే ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సమస్యలు నెలకొన్నాయని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభపక్ష నేత జానారెడ్డి ఆరోపించారు. గత వారంరోజులుగా ఖమ్మం మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితిని పరిశీలించేందుకు సోమవారం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ఖమ్మం మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతోనూ, మార్కెట్ కమిటీతోనూ, ఉద్యోగులతోనూ సమావేశమయ్యారు.

05/02/2017 - 02:55

హైదరాబాద్, మే 1: దేశంలో కొత్త చట్టాలు అక్కర్లేదని, ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, హక్కులూ లభిస్తాయని ఉభయ తెలుగు రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఉస్మానియా పిజి లా కాలేజీలో మూడు రోజుల పాటు జరిగే తొలి జాతీయ న్యాయవిద్యా సమ్మేళనం, ప్రదర్శన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

05/02/2017 - 01:54

హైదరాబాద్, మే 1: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వేములపల్లి వినీల ఆత్మహత్యకు గల కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. స్టాక్ బ్రోకర్ అయిన భర్త విక్రమ్ విజయసింహ పెట్టిన వేధింపులు, అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో వినీత ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.

05/02/2017 - 01:42

హైదరాబాద్, మే 1: అక్రమ నిర్మాణదారులతో కుమ్మక్కై, కోర్టు ఆదేశాలను అమలుచేయకపోవడం, కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడంపై గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సెల్వరాజన్ నాగలక్ష్మిపై ఉమ్మడి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకుగానూ ఆమెకు నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రెండు వేల జరిమానాను విధించింది.

05/02/2017 - 01:38

హైదరాబాద్, మే 1: హైదరాబాద్- వరంగల్, హైదరాబాద్- విజయవాడ, హైదరాబాద్- మహబూబ్‌నగర్ మూడు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు వెల్లడించారు.

05/02/2017 - 01:34

హైదరాబాద్, మే 1: ‘రోడ్లపై గుంతలు ఉండకూడదు. ఎప్పటికప్పుడు పూడ్చేయాలని గతంలో అనేకమార్లు చెప్పాను. అయినా అధికారులు సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఇది మంచి పద్ధతి కాదు. నెల సమయం ఇస్తున్నా. మే నెలాఖరుకు రోడ్లపై గుంతలు పూడ్చాలి. జూన్‌లో రాష్టవ్య్రాప్తంగా పర్యటిస్తా. అప్పుడు ఎక్కడైనా గుంతలు కనిపిస్తే సంబంధిత అధికారిని అక్కడిక్కడే సస్పెండ్ చేస్తాం’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు.

05/02/2017 - 01:27

విజయవాడ, మే 1: తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. ఇప్పటివరకూ ఆయన న్యూఢిల్లీలో ఏపి భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేశారు. టిటిడి ఇఓ పదవిని ఉత్తరాదికి చెందిన సింఘాల్‌కు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దానిపై తెలుగు ఐఏఎస్‌లతోపాటు దక్షిణాదికి చెందిన ఐఏఎస్‌లు కూడా అసంతృప్తితో ఉన్నారంటూ గతనెల 28న ఆంధ్రభూమి దినపత్రిక పేర్కొన్న విషయం తెలిసిందే.

05/02/2017 - 01:24

నల్లగొండ/ నాగార్జున సాగర్, మే 1: నాగార్జునసాగర్ కృష్ణా జలాల నీటి వినియోగంలో ఆంధ్ర- తెలంగాణ రాష్ట్రాల మధ్య ఘర్షణలు, వాగ్వాదాలు సర్వసాధారణమయ్యాయి. ప్రతిసారి ఆంధ్రకు నీటి విడుదల, నిలిపివేతల ప్రక్రియ సందర్భంగా రెండు రాష్ట్రాల అధికారుల మధ్య పేచీలు తలెత్తి, ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి.

Pages