S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/29/2017 - 01:42

గుంటూరు, ఏప్రిల్ 28: మిర్చి మద్దతు ధర చెల్లింపులో రైతులు అడుగడుగునా దగాపడుతున్నారు. పదిరోజుల క్రితం ప్రభుత్వం క్వింటాల్‌కు 15 వందల మద్దతు ధర ప్రకటించటంతోపాటు తొలివిడతగా రూ. 50 కోట్లు మంజూరు చేసింది. అయితే రైతులకు చెల్లించే పరిహారంలో అడుగడుగునా అవినీతి చోటు చేసుకుంటోంది. దళారుల చేతివాటంతో మద్దతు ధర రైతు చేతికందే పరిస్థితి లేదు.

04/29/2017 - 01:41

అమరావతి, ఏప్రిల్ 28:ప్రజల్లో సంతృప్తిస్థాయి పెంచడమే పరమావధిగా పనితీరు ఉండాలని జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శనం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలపై 80 శాతం మంది సంతృప్తి చెందాలని, ఇందుకోసం అత్యవసర, స్వల్పకాల, దీర్ఘకాల విధానాలను అనుసరించాలని సూచించారు. ఈ రెండేళ్లు ప్రభుత్వానికి చాలా కీలకమని పేర్కొన్న ముఖ్యమంత్రి..

04/29/2017 - 01:38

హైదరాబాద్, ఏప్రిల్ 28: ప్రతిపక్ష నేత, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు సిబిఐ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సిబిఐ కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. అలాగే కుటుంబ సభ్యులతో కలసి న్యూజీలాండ్ వెళ్లేందుకు జగన్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది.

04/29/2017 - 01:35

గుంతకల్లు, ఏప్రిల్ 28: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. గుంతకల్లు మండలం వైటిచెరువు గ్రామ శివారులోని చెరువులో విహారానికి వెళ్లిన 13మంది ప్రమాదవశాత్తూ నీళ్లలో మునిగి మరణించారు. మరో బాలుడు గల్లంతయ్యాడు. ఈ దుర్ఘటనలో కేవలం ఒకే ఒక్క బాలిక ప్రాణాలతో బయటపడింది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు బాలికలు, ఐదుగురు బాలురు ఉన్నారు. వీరిలో ఇద్దరు మినహా మిగిలిన వారంతా ఇరవయ్యేళ్ల లోపు వారే కావడం గమనార్హం.

04/29/2017 - 01:20

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీలపై నిషేధం కొనసాగుతుందని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి.సింగ్ స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య బదిలీలపై మార్గదర్శకాలు రూపొందించడానికి కమిటీ ఏర్పాటు చేశామని, ఈ కమిటీ నివేదిక వచ్చే వరకు బదిలీలపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని శుక్రవారం ఆయన శాఖాధిపతులకు ఉత్తర్వులు జారీ చేశారు.

04/29/2017 - 01:15

హైదరాబాద్, ఏప్రిల్ 28: దేశంలో 800 విశ్వవిద్యాలయాలున్నా ఎక్కువ శాతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని , వాటిని ఆదుకుని నిలబెట్టాలనుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని వైస్ చాన్సలర్లు అభిప్రాయపడ్డారు. నిధుల కొరతతో పాటు ఫ్యాకల్టీ కొరత పెద్ద ఎత్తున తీర్చాల్సి ఉందని, దాంతో పాటు స్వేచ్ఛ కొరవడుతోందని, పెద్ద ఎత్తున ఆంక్షలు ఉండటం వల్ల ఉన్నత విద్యాసంస్థల మనుగడ ఇరకాటంలో పడిందని వారు పేర్కొన్నారు.

04/29/2017 - 01:14

హైదరాబాద్, ఏప్రిల్ 28: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పదవీ కాలం మరో పది రోజుల్లో ముగుస్తుంది. కొత్త గవర్నర్ వస్తారా? మరోసారి ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తారా? అనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. దేశంలో మరే గవర్నర్‌కు లేని విధంగా నరసింహన్ అనేక ప్రత్యేకతలు చాటు కున్నారు. ఈ గవర్నర్ తొలుత రాష్ట్రానికి తాత్కాలిక గవర్నర్‌గా వచ్చారు.

04/28/2017 - 03:59

విజయవాడ, ఏప్రిల్ 27: ఉద్యోగ - ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకునేలా యువతలో ఆంగ్ల భాష ప్రావీణ్యం పెంపొందించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం, బ్రిటీష్ కౌన్సిల్ భాగస్వామ్యంతో శ్రీకారం చుట్టింది. ‘ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాజెక్టు’ కింద రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లో చదువుకుంటున్న వారిలో లక్ష మంది విద్యార్థులకు ఆంగ్లాన్ని సులభంగా అభ్యసించేలా శిక్షణ ఇవ్వనుంది.

04/28/2017 - 02:10

హైదరాబాద్, ఏప్రిల్ 27: జెఇఇ మెయిన్ ఫలితాలను సిబిఎస్‌ఇ గురువారం విడుదల చేసింది. పరీక్షలో సాధించిన మార్కులను, ఆల్ ఇండియా ర్యాంకుల వివరాలను సిబిఎస్‌ఇ వెబ్‌సైట్‌లో ఉంచింది. తాజా గణాంకాల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల నుండి 20వేల మంది జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించారు.

04/28/2017 - 01:52

హైదరాబాద్, ఏప్రిల్ 27: అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ ఆస్తుల వేలానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ రెండు కంపెనీలకు చెందిన 17 ఆస్తులను ఇ-పోర్టల్ ద్వారా వేలం వేయాలని హైకోర్టు ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ వి రామసుబ్రహ్మణియన్, జస్టిస్ ఎస్‌వి భట్‌తో కూడిన ధర్మాసన ఈ కేసును విచారించింది.

Pages