S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/09/2017 - 08:33

రాజమహేంద్రవరం, మే 8: జలకళతో తొణికిసలాడే గోదావరి జిల్లాల్లోని జలాశయాలు ఇపుడు నిండుకున్నాయి. డెడ్ స్టోరేజికి చేరుకున్నాయి. ఖరీఫ్‌లో కూడా నీటి గండం ఉండేలా పరిస్థితి కనిపిస్తోంది. ఖరీఫ్‌లో సాగునీటిని సరఫరా చేసే రిజర్వాయర్లలో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయి. ఖరీఫ్ నాటికైనా జల కళ సంతరించుకుంటుందా అనే అనుమానాలు వెంటాడుతున్నాయి.

05/08/2017 - 07:24

హైదరాబాద్, మే 7: ఉద్యోగుల భవిష్య నిధి (ఇపిఎఫ్) చెల్లింపులు, ఇతరత్రా సమస్యలను ఒక్క రోజులోనే పరిష్కరించాలని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సంబంధిత అధికారులనును కోరారు. ఇటీవల పిఎఫ్ కార్యాలయంలో పదోన్నతి పొందిన 1999 సంవత్సరం బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు ఆదివారం నగరంలోని ఒక హోటల్‌లో కేంద్ర మంత్రి దత్తాత్రేయను ఘనంగా సన్మానించారు.

05/06/2017 - 05:32

ఎంసెట్ ఫలితాలు విడుదల 12 నుంచి ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్
జూన్ 19 నుంచి తరగతులు

05/06/2017 - 05:29

దూసుకెళ్లిన ‘సాస్’ ఉపగ్రహం
కమ్యూనికేషన్ రంగంలో దక్షిణాసియా
దేశాలకు మరింత బలం
క్రయోజనిక్ ప్రయోగాల్లో మరో రికార్డు
జిఎస్‌ఎల్‌వి-ఎఫ్ 09 ప్రయోగం దిగ్విజయం

05/05/2017 - 09:20

సూళ్లూరుపేట, మే 4: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక కీలక ప్రయోగం చేపట్టింది. సార్క్ దేశాలన్నీ ఉపయోగించేకొనేందుకు వీలుగా జీశాట్-9 (సాస్) ఉపగ్రహాన్ని సిద్ధం చేశారు. 2,230కిలోల బరువుగల ఈ ఉపగ్రహాన్ని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జిఎస్‌ఎల్‌వి-ఎఫ్ 09 వాహక నౌక ద్వారా శుక్రవారం రోదసీలోకి పంపనున్నారు.

05/04/2017 - 09:08

రామచంద్రాపురం, మే 3 : అత్యంత అరుదుగా వికసించే మే ఫ్లవర్ బుధవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో వికసించింది. పట్టణ పరిధిలోని మల్లికార్జునగర్ కాలనీలో భద్రయ్య నివాసంలో ఈ అరుదైన పుష్పం పూసింది. ఏడాదిలో మే నెలలో మాత్రమే అది కూడా కేవలం 20 రోజులు మాత్రమే ఈ పుష్పం వికసిస్తుందని భద్రయ్య తెలిపారు.

05/03/2017 - 03:50

ఖమ్మం, మే 2: గిట్టుబాటు ధర కోసం ఆందోళనలు చేసిన రైతులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం నగర దిగ్బంధం కార్యక్రమం జరిగింది. అరెస్టు చేసిన రైతులను బేషరతుగా విడుదల చేయాలని, మిర్చి క్వింటాకు 15వేలు రూపాయలను చెల్లించాలని ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు.

05/03/2017 - 01:54

హైదరాబాద్, మే 2: ఒంటరి మహిళకు నెలకు వెయ్యి రూపాయల ఫించను ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మే 8నుంచి వారంపాటు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 2న ఫించన్ చెల్లిస్తారు. ఏప్రిల్, మే నెలల ఫించన్ జూన్ 2న ఒకేసారి చెల్లిస్తారు. రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల మంది ఒంటరి మహిళలు పథకం వల్ల ప్రయోజనం పొందుతారు.

05/03/2017 - 01:53

హైదరాబాద్, మే 2: హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీలో భారీ నిధుల గోల్‌మాల్ కేసును సిసిఎస్ పోలీసులు ఛేదించారు. సుమారు రూ.6.03కోట్లు కాజేసిన బ్యాంక్, సెక్యూరిటీ ఏజెన్సీ సిబ్బందితో సహా 13మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక సూత్రధారి శంకర్‌నాయక్, ఆడిటర్ సహ మరో వ్యక్తిని నిరుడు మార్చిలో అరెస్టు చేశారు.

05/03/2017 - 01:51

హైదరాబాద్, మే 2: సర్కారు వైద్యానికి పట్టిన నిర్లక్ష్యపు రోగం వదిలినట్టు లేదు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల సేవలు ఆధునీకరించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా, పరిస్థితులో మార్పు రావటం లేదు. దేశంలోనే అతిపెద్ద రిఫరెల్ ఆసుపత్రిగా పేరుగాంచిన నిలోఫర్ ఆసుపత్రి తీరు ఇందుకు భిన్నంగా లేదు.

Pages