S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/18/2017 - 01:52

హైదరాబాద్, మార్చి 17: తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయితే ఉచిత విద్యుత్ అమలు చేయాల్సిన అవసరం ఉండదని సిఎం కె చంద్రశేఖరరావు అన్నారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చలో భాగంగా శుక్రవారం సిఎం కె చంద్రశేఖరరావు శాసనసభలో మాట్లాడారు.

03/18/2017 - 01:51

ఉద్యోగులకు చెల్లించాల్సిన పిఆర్‌సి బకాయలు బడ్జెట్‌లో చూపించి చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మాట తప్పటంతో, తెరాస వర్గాల్లో గుబులు కనిపిస్తోంది. అధికార పార్టీ అభ్యర్థిని ఎక్కడికక్కడ నిలదీస్తున్న టీచర్లు పోలింగ్ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆందోళన తెరాసలో కనిపిస్తోంది.
**

03/18/2017 - 01:49

హైదరాబాద్, మార్చి 17: కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీని కలుస్తామని సిఎం చంద్రశేఖరరావు చెప్పారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చలో భాగంగా శుక్రవారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శాసనసభలో మాట్లాడారు.

03/18/2017 - 01:48

హైదరాబాద్, మార్చి 17: ‘వచ్చే ఎన్నికల్లో మాకు ఇంకా ఎక్కువ స్థానాలు వస్తాయి’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తెరాస ఎమ్మెల్యేల హర్షధ్వానాల మధ్య అసెంబ్లీలో ప్రకటించారు. ఈ విషయాన్ని వివిధ సర్వేలు సైతం ధ్రువీకరిస్తున్నాయని స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సమాధానమిచ్చారు.

03/18/2017 - 01:42

గుంటూరు/ గురజాల, మార్చి 17: గుంటూరు జిల్లాలో శుక్రవారం రహదారులు రక్తమోడాయి. జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మరణించగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. గురజాల మండలం జంగమహేశ్వరపురం సమీపంలో జరిగిన ప్రమాదంలో 31 మంది ప్రయాణికులతో వస్తున్న బొలేరో ప్రైవేటు వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి పల్టీ కొట్టింది.

03/18/2017 - 01:38

విజయవాడ, మార్చి 17:నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. కడప జిల్లాలో హోరాహోరీగా ప్రచారం సాగటంతో ముందుజాగ్రత్త చర్యగా అసాధారణ పోలీస్ బందోబస్తు ఏర్పాటైంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో సిసి కెమెరాలు, వెబ్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు.

03/18/2017 - 01:35

విజయవాడ, మార్చి 17: రాష్ట్రంలో అపారంగా ఉన్న ఖనిజ వనరులను వెలికితీసే ఇంజనీరింగ్ వ్యవస్థను నెలకొల్పడంతోపాటు నిపుణుల కొరతను అధిగమించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో మైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఇందుకోసం ఆస్ట్రేలియా ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

03/18/2017 - 01:31

విజయవాడ, మార్చి 17: రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటులో సహకరించేందుకు మలేసియా ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందులోభాగంగా తొలుత అమరావతిలో వంద ఎకరాల విస్తీర్ణంలో ఫోర్త్ జనరేషన్ టెక్నాలజీ పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్కులో తొలిదశలో 30, 40 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.350 కోట్ల పెట్టుబడులు రానున్నాయి.

03/18/2017 - 01:27

విజయవాడ, మార్చి 17: నిరంతర సంప్రదింపులతో కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. ముగిసే ఆర్థిక సంవత్సరానికి వివిధ శాఖలకు కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఎంతెంత జరిగాయో కచ్చితమైన వివరాలు తెలుసుకోవాలన్నారు. రావలసిన నిధుల కోసం నెలాఖరులోగా అన్ని ప్రయత్నాలు చేయాలన్నారు.

03/17/2017 - 03:41

హైదరాబాద్, మార్చి 16: జర్నలిస్టులపై సమాజానికి ఉన్న విశ్వసనీయత పోతే దేశానికి చీకటిరోజులు వచ్చినట్టేనని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ సికె ప్రసాద్ పేర్కొన్నారు. ‘సమకాలీన జర్నలిజంలో నైతిక విలువలు’ అంశంపై హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన సదస్సులో కీలకోపన్యాసం చేస్తూ, జర్నలిజం విలువలు కాపాడుకోవాల్సిన బాధ్యత మీడియా ప్రతినిధులు, మీడియా యాజమాన్యాలపై ఉందన్నారు.

Pages