S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/15/2017 - 01:08

విజయవాడ, మార్చి 14: ఆంధ్రప్రదేశ్ సొంతగడ్డపై నిర్మించిన అసెంబ్లీలో తొలి బడ్జెట్‌ను ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టబోతోంది. 2017-18 సంవత్సరానికి సంబంధించి దాదాపు 1.55 లక్షల కోట్ల రూపాయల అంచనాలతో బడ్జెట్‌ను రూపొందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే ఇది దాదాపు 19 వేల కోట్ల రూపాయలు ఎక్కువ. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ఈనెల 13న ప్రవేశపెట్టాల్సి ఉంది.

03/15/2017 - 00:45

ఖమ్మం, మార్చి 14: తెలంగాణ ప్రభుత్వం శాసన సభ్యుల హక్కులను కాలరాస్తున్నదని, ప్రశ్నించే వారందరిపై ఎదురుదాడికి దిగుతూ విమర్శలు గుప్పిస్తున్నదని తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ పక్షనేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

03/15/2017 - 00:44

కొత్తగూడెం, మార్చి 14: సింగరేణి వ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు పోరుబాట పట్టారు. తెలంగాణ లోని ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి కాంట్రాక్టు కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి) ఆధ్వర్యంలో బుధవారం నుంచి నిరవధిక సమ్మె చేయనున్నారు.

03/14/2017 - 03:41

భద్రాచలం, మార్చి 13: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 11 వరకు నిర్వహించే సీతారాముల కల్యాణ బ్రహ్మోత్సవాలకు సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాలను దేవస్థానం ఇఓ తాళ్లూరి రమేశ్‌బాబు ప్రారంభించారు.

03/14/2017 - 02:14

హైదరాబాద్, మార్చి 13: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశెట్టిన బడ్జెట్ పేదల బడ్జెట్ కాదని, పెట్టుబడి దారుల బడ్జెట్ అని టిడిపి శాసనసభాపక్ష నాయకుడు ఎ. రేవంత్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌కు గురైన రేవంత్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సోమవారం మంత్రి ఈటల బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో అసెంబ్లీ గేట్ ఎదుట మండుటెండలో నిలబడి తమ నిరసన వ్యక్తం చేశారు.

03/14/2017 - 02:02

హైదరాబాద్, మార్చి 13: ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ ఐసెట్‌ను మే 18న నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి దరఖాస్తులను మార్చి 14 నుండి స్వీకరిస్తామని కన్వీనర్ ప్రొఫెసర్ కె ఓంప్రకాష్ తెలిపారు. అభ్యర్ధులు కేవలం రిజిస్ట్రేషన్ రుసుంతో మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకూ స్వీకరిస్తామని, ఇతరులు 350 రూపాయిలు, ఎస్సీ-ఎస్టీలు 250 రూపాయిలు చెల్లించాలని చెప్పారు.

03/14/2017 - 02:01

హైదరాబాద్, మార్చి 13: వైద్య విద్యాసంస్థల్లో యుజి కోర్సులో చేరేందుకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశపరీక్ష (నీట్) నియమనిబంధనల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. ప్రధానంగా వయస్సుకు సంబంధించి ఉన్న ఆంక్షలను సడలించనున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 17 నుండి 24 ఏళ్లలోపు వారు మాత్రమే నీట్ రాసేందుకు అర్హులు, అలాగే ప్రతి అభ్యర్ధికి మూడు సార్లు మాత్రమే పరీక్ష రాసే అవకాశం కల్పించారు.

03/14/2017 - 01:52

హైదరాబాద్, మార్చి 13: సంప్రదాయ బడ్జెట్‌కు భిన్నంగా వాస్తవిక కోణంలో తెలంగాణ రాష్ట్రానికి అతికినట్టు ఉందని సిఎం కె చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్ పేదల సంక్షేమానికి ఉపయోగపడేలా, ఆర్థిక ప్రగతికి దోహదపడేలా ఉందన్నారు.

03/14/2017 - 01:50

హైదరాబాద్, మార్చి 13: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2017-18) రూ.1,49,646 కోట్లతో బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రతిపాదించిన బడ్జెట్‌కంటే రూ.19వేల 230 కోట్లు ఎక్కువ. కేంద్రం మార్గదర్శనం మేరకు ఈసారి బడ్జెట్‌లో ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల్లో మార్పులు చేశారు. వాటి స్థానంలో నిర్వహణ, ప్రగతి పద్దులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

03/14/2017 - 02:04

కర్నూలు/నంద్యాల, మార్చి 13: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు సోమవారం అంతిమ వీడ్కోలు పలికారు. ప్రభుత్వ లాంఛనాలతో భూమా అంత్యక్రియలు నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆళ్లగడ్డలోని భూమా స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది.

Pages