S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/12/2016 - 02:43

హైదరాబాద్, ఆగస్టు 11: కృష్ణా నది పుష్కరాల సందర్భంగా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు డిజిపి అనురాగ్ శర్మ ప్రకటించారు. మొత్తం 81 స్నానఘట్టాలను పర్యవేక్షించే బాధ్యతను 8 మంది సీనియర్ ఐపిఎస్ అధికారులకు అప్పగించామని చెప్పారు. దాదాపు 13,474 మంది పోలీసులు భద్రతకు వినియోగించుకోనున్నట్లు చెప్పారు.

08/12/2016 - 02:46

రాజమహేంద్రవరం, ఆగస్టు 11: గోదావరి తీరం వేద ఘోషతో హోరెత్తింది. ఏడాది పాటు గోదావరిలో కొలువున్న పుష్కరుడు గురువారం అంత్య పుష్కరాల ముగింపుతో తన యాత్రను ముగించుకుని కృష్ణానదిలో ప్రవేశించడానికి బయలుదేరివెళ్లాడు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో వైభవంగా అంత్య పుష్కరాలకు ముగింపు పలికారు.

08/12/2016 - 02:38

హైదరాబాద్, ఆగస్టు 11: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధికారిక ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. కొత్త జిల్లాల ప్రతిపాదనపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి మార్గదర్శకం చేయడానికి నియమించిన మంత్రివర్గ ఉప సంఘం శుక్రవారం ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల ప్రజా ప్రతినిధులతో సమావేశం కానుంది.

08/12/2016 - 02:36

హైదరాబాద్, ఆగస్టు 11: వైద్య విద్యలో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ అర్హత , ప్రవేశపరీక్ష (నీట్) ఫలితాలను 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అండర్ సెక్రటరీ అమిత్ బిశ్వాస్ ఒక ప్రకటన చేశారు. సెప్టెంబర్ 3 నుండి కౌనె్సలింగ్ నిర్వహించాలని సూచించారు. నీట్-1ని మే 1వ తేదీన నిర్వహించగా, నీట్-2ను జూలై 24న నిర్వహించారు.

08/12/2016 - 02:35

హైదరాబాద్, ఆగస్టు 11: గ్యాంగ్‌స్టర్ నరుూం డైరీలో సంచలన నిజాలు వెలుగుచూశాయి. గోవాలో నరుూం ప్రధాన అనుచరుడు తాజుద్దీన్‌ను అరెస్టు చేసినట్టు సైబరాబాద్ పశ్చిమ కమిషనర్ నవీన్‌చంద్ తెలిపారు. గోవాలోని నరుూం నివాసానికి తాజుద్దీన్ కేర్‌టేకర్‌గా వ్యవహరించాడని, గోవాలో ఫర్హానా పేరుతో ఉన్న ఇల్లును సీజ్ చేశామన్నారు.

08/12/2016 - 02:27

హైదరాబాద్, ఆగస్టు 11: గ్యాంగ్‌స్టర్ నరుూమొద్దీన్ అలియాస్ నరుూమ్ ఎన్‌కౌంటర్, మృతి కేసులో ఇప్పటి వరకు 12 కేసులు నమోదు చేశామని, నరుూమ్ భార్య సాజిద సహ 19మందిని అరెస్టు చేసినట్టు సిట్ చీఫ్, హైదరాబాద్ ఐజి నాగిరెడ్డి వెల్లడించారు. కేసులో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తిలేదని, డిజిపి ఆదేశిస్తే ఇతర రాష్ట్రాలకూ విస్తరించిన నరుూమ్ కార్యకలాపాలపైనా దర్యాప్తు చేస్తామని నాగిరెడ్డి పేర్కొన్నారు.

08/12/2016 - 02:25

ఇంద్రకీలాద్రి, ఆగస్టు 11: పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు ఇంద్రీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను చాలా తేలికగా దర్శించుకోవచ్చు.

08/12/2016 - 02:13

హైదరాబాద్, ఆగస్టు 11: ఆలంపూర్‌లోని పష్కర ఘాట్‌లో ముఖ్యమంత్రి దంపతులు ఉదయం 5.58కి పుణ్యస్నాన మాచరించి అధికారికంగా పుష్కరాలను ప్రారంభించనున్నారు. ఇందుకోసం గురువారం మధ్యహ్నమే హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌కు ప్రత్యేక బస్సులో కెసిఆర్ చేరుకున్నారు. ఆలంపూర్‌లోని పర్యాటక శాఖ అతిథి గృహం హరితలో సిఎం దంపతులు బస చేశారు.

08/12/2016 - 02:11

హైదరాబాద్, ఆగస్టు 11: తెలంగాణ రాష్ట్రం కృష్ణా మహా పుష్కర శోభ సంతరించుకుంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత వచ్చిన కృష్ణా పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసింది. బృహస్పతి కన్యారాశిలో ప్రవేశిస్తున్న సందర్భంలో కృష్ణా పుష్కరాలు శుక్రవారం తెల్లవారుజామున 5.58కు ప్రారంభమవుతాయని పండితులు ప్రకటించారు.

08/12/2016 - 02:06

ఇబ్రహీంపట్నం/జి.కొండూరు, ఆగస్టు 11: కృష్ణాపుష్కరాల ఆరంభం రోజున శోభాయాత్రను కన్నుల పండుగగా నిర్వహించారు. గురువారం సాయంత్రం ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ నుంచి సంగమం ఘాట్ మీదుగా ఇబ్రహీంపట్నం రింగు సెంటరు నుంచి మళ్ళీ ఫెర్రీ ఘాట్ వద్ద శోభాయాత్ర శోభాయమానంగా చేరుకుంది.

Pages