S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/09/2016 - 03:44

హైదరాబాద్, ఆగస్టు 8 : దేవాలయాల పరిపాలనకు సంబంధించిన ధార్మిక పరిషత్ ఏర్పాటు, చట్టంలోని ఇతర అంశాలను అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తెలియచేయాలంటూ సుప్రీంకోర్టు సోమవారం నోటీసు జారీ చేసింది. కౌంటర్ ఫైల్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇచ్చారు.

08/09/2016 - 03:43

హైదరాబాద్, ఆగస్టు 8: భూసేకరణకు సమగ్ర విధానాన్ని అనుసరిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం సోమవారం హైకోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేసింది. రైతుల నుంచి నేరుగా భూములు కొనుగోలు చేసేందుకు ఉద్దేశిస్తూ సర్కరు జారీ చేసిన జీవో 123ను కొట్టివేస్తూ హైకోర్టు బుధవారం తీర్పు ఇచ్చిన దరిమిలా ప్రభుత్వం రైతుల పునరావాసానికి సంబంధించి తీసుకున్న చర్యలను సోమవారం హైకోర్టుకు వివరించింది.

08/09/2016 - 03:33

హైదరాబాద్, ఆగస్టు 8: స్థానికతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 2017 జూన్ 2వ తేదీలోగా ఎపికి వచ్చిన వారికి స్థానికత వర్తింప చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. కేవలం తెలంగాణ నుండి ఎపికి వచ్చిన వారికి మాత్రమే స్థానికత వర్తిస్తుందని కూడా స్పష్టం చేసింది. స్థానికత ధ్రువీకరణ పత్రాలు కావలసినవారు మూడు ఫారాలతో దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించింది.

08/09/2016 - 03:26

చిత్తూరు, ఆగస్టు 8: ప్రత్యేక హోదా విషయంలో రాజీలేని పోరాటం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సోమవారం తన సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదని, దానివల్ల అనేక అనర్థాలు తలెత్తాయని చెప్పారు. విభజన అనంతరం రాష్ట్రం ఆర్థికంగా చితికిపోవడంతోపాటు రాజధాని లేని రాష్ట్రంగా నిలిచిందన్నారు.

08/09/2016 - 03:21

విజయవాడ, ఆగస్టు 8: కృష్ణా పుష్కరాల ప్రారంభానికి కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. పనులు మాత్రం ఇప్పటికీ సా...గుతూనే ఉన్నాయి. ఈ నెల 4 నాటికి పుష్కర పనులన్నీ పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినా, పనులు మాత్రం నత్తనడకనే సాగుతున్నాయి. పుష్కరాలను వేదికగా చేసుకుని కృష్ణా - గోదావరి నదీ సంగమ ఘట్టాన్ని పెద్దఎత్తున ప్రచారంలోకి తేవాలని చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారు.

08/09/2016 - 03:08

అనంతపురం, ఆగస్టు 8: టమోటా ధర ఒక్కసారిగా పడిపోయింది. కిలో టమోటా ధర రూ.2కు పడిపోవడంతో సోమవారం అనంతపురంలో రైతులు ఆందోళనకు దిగారు. జాతీయరహదారిపై టమోటాలు పారబోసి నిరసన తెలిపారు. నగరంలోని కక్కలపల్లి వద్ద ఉన్న టమోటా మార్కెట్‌కు సోమవారం పది టన్నుల టమోటా వచ్చింది. దీంతో ధర అమాంతం పడిపోయింది. 15 కేజీల ట్రే ధర రూ.30 లోపే పలికింది. అంతకు మించి కొనడానికి వ్యాపారులు విముఖత వ్యక్తం చేశారు.

08/09/2016 - 03:06

కలిగిరి, ఆగస్టు 8: సారా ఉద్యమాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లి రాష్ట్రంలో సంపూర్ణంగా మద్యాన్ని నిషేధించేలా చేసిన ఉద్యమ నేత వర్దినేని రోశమ్మ అంతిమయాత్ర అశ్రునయనాలతో స్వగ్రామమైన దూబగుంటలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. బంధువులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తుల నడుమ అంతిమయాత్రను నిర్వహించారు.

08/09/2016 - 03:04

ఆదిలాబాద్, ఆగస్టు 8: తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని ప్రాణహిత నదిపై తుమ్మడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తున నిర్మించే బ్యారేజీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధమవుతోంది.

,
08/09/2016 - 03:01

హైదరాబాద్, ఆగస్టు 8: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర పర్యటన అధికార పక్షం టిఆర్‌ఎస్‌కు ఉత్సాహాన్ని కలిగించగా, మోదీ సభపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బిజెపిని విచిత్రమైన పరిస్థితిలోకి నెట్టేసింది.

08/09/2016 - 02:53

హైదరాబాద్, ఆగస్టు 8: ఎమ్సెట్-2 పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరు బ్రోకర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే 8 మంది దళారులను సిఐడి అరెస్టు చేసింది. తాజాగా ప్రశ్నాపత్రాన్ని క్షేత్రస్థాయి దళారులకు అందజేసిన వారిని అరెస్టు చేయడంతో ఇంత వరకూ ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 10కి పెరిగింది. ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన సునీల్ సింగ్, ఖలీల్‌తో పాటు మరో ముగ్గుర్ని సిఐడి ఇప్పటికే అదుపులోకి తీసుకుంది.

Pages