S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/02/2016 - 03:59

హైదరాబాద్, ఆగస్టు 1: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఉపరితలద్రోణితో కలవడంతో పాటు, వచ్చే రెండురోజుల్లో అల్పపీడనం మరింత బలపడి తీవ్రమైన అల్పపీడనంగా మారుతుండంతో కోస్తా, తెలంగాణల్లో వచ్చే రెండు, మూడురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇదే సమయంలో ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, విదర్భలలో భారీనుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

08/02/2016 - 03:55

న్యూఢిల్లీ, ఆగస్టు 1:దేశ వ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి వైద్య, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించి ఒకే పరీక్షా విధానం నీట్ అమలులోకి వస్తుంది.

08/02/2016 - 03:55

హైదరాబాద్, ఆగస్టు 1: ఆర్థిక రంగంలో నిష్ణాతులు, ఉభయ తెలుగు రాష్ట్రాల హైదరాబాద్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథ్‌ను ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ నియమించింది. ఈ మేరకు న్యాయ శాఖ సంయుక్త కార్యదర్శి రాజేందర్ కశ్యప్ ప్రత్యేక గెజిట్ ప్రకటన విడుదల చేశారు.

08/02/2016 - 03:51

విజయవాడ, ఆగస్టు 1: ఆసియాలోనే అత్యంత అధునాతన వైద్య పరికరాల తయారీ, పరీక్షా కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్ (ఎఎంటిజెడ్) పేరుతో ఏర్పాటవుతున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు ఈ నెల 19న శంకుస్థాపన చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

,
08/02/2016 - 03:47

నూజివీడు, ఆగస్టు 1: కృష్ణానది వైపుకి గోదావరి జలాలు గలగలాపారిస్తున్న పోలవరం కుడికాల్వకు సోమవారం తెల్లవారుఝామున గండిపడింది. కృష్ణాజిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామ సమీపంలోని 122.100 కిలోమీటరు వద్ద రామిలేరు అండర్ టనె్నల్ పక్కనే గండి పడటంతో నీరంతా వృథాగా కొల్లేరులోకి పోతోంది.

08/02/2016 - 03:44

హైదరాబాద్, ఆగస్టు 1: మెడికల్ ఎమ్సెట్-2 పరీక్ష మరోమారు తిరిగి నిర్వహించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. శనివారం నుంచి మూడు రోజులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులు, వివిధ విభాగాల అధిపతులతో తర్జనబర్జన కొనసాగుతోంది. మెడికల్ ఎమ్సెట్ నిర్వహిస్తామని ప్రకటించింది మొదలు ప్రభుత్వానికి కష్టాలు మొదలయ్యాయి.

08/02/2016 - 03:30

హైదరాబాద్, ఆగస్టు 1: ఎమ్సెట్-2 పేపర్ లీక్ కుంభకోణంపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐ చేత విచారణ జరిపించాలని ఎబివిపి రాష్టక్రార్యదర్శి అయ్యప్ప డిమాండ్ చేశారు. సోమవారం నాడు ఆయన రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఎమ్సెట్ లీక్ కాదని, ఇది టిఆర్‌ఎస్ ప్రభుత్వ పెద్దల హయాంలో జరిగిన అతి పెద్ద స్కాం అని ఆరోపించారు.

08/02/2016 - 03:27

హైదరాబాద్, ఆగస్టు1: ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు వస్తున్నందున ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ఆవిర్భవించి, టిఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే మిషన్ భగీరథ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టారు. వచ్చే ఎన్నికల నాటికి ఇంటింటికి మంచినీటిని ఇవ్వలేకపోతే ఓట్లు అడగమని ప్రకటించి ముఖ్యమంత్రి సంచలనం సృష్టించారు.

08/02/2016 - 03:25

హైదరాబాద్, ఆగస్టు 1: బిజెపికి విడాకులు ఇవ్వాలంటూ గళమెత్తుతున్న తెదేపా నేతల తీరుపై ఆ పార్టీలో చర్చ మొదలయింది. తాము కూడా అదే కోరుకుంటున్నామని, అది ఎంత త్వరగా జరిగితే పార్టీకి అంత మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెదేపాతో విడిపోవాలని మెజారిటీ నేతలు కోరుకుంటుండగా, మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు మాత్రం కలసి ఉండాలని కోరుకోవడం పార్టీ నేతలను విస్మయానికి గురిచేస్తోంది.

08/02/2016 - 03:21

హైదరాబాద్, ఆగస్టు 1: రాజస్థాన్‌లో 2016 నవంబర్ 9 నుండి 11 వరకు ‘అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు’ (గ్లోబల్ రాజస్థాన్ అగ్రిటెక్ మీట్-2016..గ్రామ్) నిర్వహిస్తున్నట్టు రాజస్థాన్ సేద్యం మంత్రి ప్రభులాల్ సయానీ ప్రకటించారు. తెలంగాణ, ఎపి రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులతో హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో సోమవారం ఆయన సమావేశమయ్యారు.

Pages