S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/06/2016 - 07:04

హైదరాబాద్, ఆగస్టు 5: కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతాలు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో వారం రోజులుగా భారీ వర్షాలు కురవడంతో దిగువనున్న జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల జలాశయాలు ఇప్పటికే పూర్తి మట్టానికి చేరుకోవడంతో దిగువకు 2.47 లక్షల క్యూసెక్కుల నీటిని గత రెండు రోజుల నుంచి వదులుతున్నారు.

08/06/2016 - 07:03

హైదరాబాద్, ఆగస్టు 5: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ షెడ్యూలు కులాల మధ్య చిచ్చు పెడుతోంది. ఇప్పటికే పలుసార్లు మాల, మాదిగా సామాజికవర్గాలకు చెందిన నేతలు బాహాబాహీగా దిగగా, తాజాగా శుక్రవారం ఎస్సీ వర్గీకరణ ప్రజాస్వామికం అన్న అంశంపై శుక్రవారం బషీర్‌బాగ్‌లో ని అంబేద్కర్ లా కాలేజీలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం రసాభసాగా మారి ఉద్రిక్తతకు దారి తీసింది.

08/06/2016 - 06:33

హైదరాబాద్, ఆగస్టు 5:కీలకమైన రెండు అంశాలలో ఏపి ప్రభుత్వానికి చుక్కెదురయింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు అంశాల్లో కేంద్ర ప్రభుత్వ వివరణలకు ఏపి ప్రభుత్వంలో ఎలాంటి స్పందన కనిపించలేదు. దీనితో పోలవరం పర్యావరణ అనుమతుల పొడిగింపు, రాజధానికి అటవీభూముల కేటాయింపు చిక్కుల్లో పడనున్నాయి.

08/05/2016 - 06:29

హైదరాబాద్, ఆగస్టు 4: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఇజిపి) కింద పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనంలో 30 శాతం పెంచాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.

08/05/2016 - 05:04

ఖమ్మం, ఆగస్టు 4: మద్యాన్ని దుకాణాలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్టవ్య్రాప్తంగా కొత్తగా ఐదు మద్యం డిపోలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని పది జిల్లాల పరిధిలో ఇప్పటికే 17మద్యం డిపోలు ఉండగా, కొత్తగా మరో 5ఏర్పాటు కానున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతున్న నేపథ్యంలో ఆయా జిల్లాల పరిధిలోనే కొత్త డిపోలు ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది.

08/05/2016 - 04:15

దుమ్ముగూడెం, ఆగస్టు 4: గిరిజన ప్రాంతానికి చెందిన ఓ నిండు గర్భిణిని కాపాడేందుకు భర్త, స్థానికులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగుతో పోరాడి గెలిచిన సంఘటన ఇది. ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం పైడాగులమడుగు గ్రామానికి చెందిన గొంది లక్ష్మి అనే గర్భిణికి బుధవారం అర్థరాత్రి పురిటినొప్పులు ఎక్కువ కావడంతో ఆశావర్కర్లు, కుటుంబ సభ్యులు కలిసి ఆటోలో పర్ణశాల పిహెచ్‌సీకి బయలుదేరారు.

08/05/2016 - 03:58

హైదరాబాద్, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాష్ట్రంలోని వివిధ బార్ అసోసియేషన్లు ఇచ్చిన పిలుపు మేరకు 5వ తేదీ శుక్రవారం హైకోర్టు విధులకు హాజరు కాకూడదని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యాయవాదులు నిర్ణయించారు. ఏపి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సి నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఉల్లంఘించి ఆంధ్రప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని తెలిపారు.

08/05/2016 - 03:57

హైదరాబాద్, ఆగస్టు 4: సికింద్రాబాద్‌లోని సదరన్ రీజియన్ ఎన్టీపిసి సంస్థ చేపట్టిన జూనియర్ మజ్దూర్ ఉద్యోగాల భర్తీపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ ఏ రామలింగేశ్వరరావు గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉద్యోగాల భర్తీకి నిరుడు డిసెంబర్‌లో ఎన్టీపిసి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ సి అరవిందరావు పిటిషన్ దాఖలు చేశారు.

08/05/2016 - 03:18

ప్రత్తిపాడు, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్ సమస్యగా మారిన ప్రత్యేక హోదాపై కేంద్రానికి వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ సిద్ధం కావాలని మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. ఆమరణ దీక్షకు సిద్ధపడితే వారితోపాటుగా వారి ఇంట్లో దీక్షకు చోటు కల్పిస్తే తాను కూడా దీక్షలో కూర్చుంటానన్నారు.

,
08/05/2016 - 03:12

హైదరాబాద్, ఆగస్టు 4: తెలంగాణ ఆవిర్భావం తరువాత తొలిసారిగా ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ ఈనెల ఏడవ తేదీన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆగస్టు 7 ప్రపంచ స్నేహితుల దినోత్సవం. అదే రోజు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గజ్వేల్‌లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం.

Pages