S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/05/2016 - 03:09

హైదరాబాద్, ఆగస్టు 4: ఎమ్సెట్-2 ప్రశ్నపత్రం లీకేజి కేసులో సిఐడి మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది అరెస్టయ్యారు. మెదక్ జిల్లా జోగిపేటకు చెందిన గుడిపల్లి చంద్రశేఖర్ రెడ్డి (37) హైదరాబాద్ మోతినగర్‌కు చెందిన షేక్ షాకీరా (29)ను సిఐడి అధికారులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు.

08/05/2016 - 03:35

గుంటూరు, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి మరో మూడు కీలక విభాగాలను తరలించారు. ఇప్పటి వరకు ఐదు ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. గురువారం రెండో బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో పురపాలకశాఖ మంత్రి పి నారాయణ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి ఎంపి కన్నబాబు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, హోంశాఖ ముఖ్యకార్యదర్శి అనూరాధ తమ చాంబర్లను ప్రారంభించారు.

08/05/2016 - 03:05

గుంటూరు, ఆగస్టు 4: పుష్కర స్నానం.. ఓ పవిత్రమైనదిగా ప్రజలు భావించాలని విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ ఉద్ఘాటించారు. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ ఆలపించిన కృష్ణా పుష్కర స్వాగత గీతం సీడీని గురువారం గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురూజీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భక్తుల నుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు.

08/05/2016 - 03:02

విశాఖపట్నం, ఆగస్టు 4: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా అక్కడే కొనసాగుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు. ఉత్తర ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

08/05/2016 - 02:59

హైదరాబాద్, ఆగస్టు 4: హైదరాబాద్‌లో విద్యార్థులకు డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి 32 ఎల్‌ఎస్‌డి బ్లాట్స్, రూ. 11వేల నగదుతోపాటు మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

08/05/2016 - 00:51

హైదరాబాద్, ఆగస్టు 4:గనుల శాఖ ప్రక్షాళనకు ప్రభుత్వం నడుం బిగించింది. సంవత్సరాల తరబడి ఒకేచోట పాతుకుపోయిన అధికారులు, సిబ్బంది వల్ల ఇసుక అక్రమ రవాణాతోపాటు ఇతరత్రా జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టడానికి సంబంధిత శాఖ మంత్రి కెటిఆర్ నడుం బిగించారు. ఒకేరోజు 93 మంది అధికారులను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

08/05/2016 - 00:48

హైదరాబాద్, ఆగస్టు 4:దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఎమ్సెట్-2 లీకేజి కేసులో రెండవ నిందితుడు రాజ్‌గోపాల్ రెడ్డి సిఐడి విచారణలో విస్తుగొలిపే అంశాలు వెల్లడించాడు. ఢిల్లీ కర్నాటక భవన్, బెంగళూరు హోటల్ వౌర్యాలో ఎమ్సెట్-2 లీక్‌పై తాము ‘వ్యూహ రచన’ చేసినట్టు రాజ్‌గోపాల్‌రెడ్డి పోలీసులకు తెలిపాడు.

08/05/2016 - 00:39

విజయవాడ, ఆగస్టు 4: రాజధాని అమరావతికి సమీపంలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ఏర్పాటుకు ముందడుగు పడింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు సమీపంలోని ముక్త్యాల వద్ద 310 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఇంటిగ్రేటెడ్ మెగా టౌన్‌షిప్.. అమరావతికి ప్రత్యేక ఆకర్షణ కానుంది.

08/05/2016 - 00:37

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ప్రతిపాదనలపై చర్చించారు. తెలుగు దేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, లోక్‌సభలో పార్టీ పక్షం నాయకుడు తోట నరసింహం, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

08/05/2016 - 00:33

హైదరాబాద్, ఆగస్టు 4: కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో జలకళ ఉట్టిపడుతోంది. నిన్నమొన్నటి వరకు కృష్ణా నదిలో పుష్కర స్నానాలు ఆచరించడానికి నీటి లభ్యత లేని పరిస్థితి నుంచి నది గట్లు వరద తాకిడికి తట్టుకోలేనంతగా వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తుంది.

Pages