S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/07/2016 - 02:14

హైదరాబాద్, ఆగస్టు 6: పంద్రాగస్టు నేపథ్యంలో ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉండటం వల్ల శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు శనివారం హై అలర్ట్ ప్రకటించారు. ఈ నెల 25 వరకు సందర్శకుల పాసుల జారీని నిలిపివేశారు. ఉగ్రదాడులు జరగొచ్చని కేంద్ర నిఘా సంస్థల నుంచి అందిన సమాచారం మేరకు ఎయిర్‌పోర్ట్‌లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.

08/07/2016 - 02:50

కర్నూలు, ఆగస్టు 6: కర్నూలు జిల్లాలోని సప్తనదీ సంగమేశ్వరుడు జలాధివాసంలోకి వెళ్లిపోయారు. గత ఎనిమిది నెలలుగా భక్తుల పూజలతో కళకళలాడిన ఆలయం శనివారం కృష్ణాజలాల్లో మునిగిపోయింది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 840 అడుగులకు చేరుకోగానే ఆలయంలోకి నీరు ప్రవేశించింది. శనివారం ఉదయానికి ఆలయం మొత్తం నీట మునిగి శిఖరం మాత్రమే దర్శనమిస్తోంది. మరో 10 అడుగుల మేర నీటిమట్టం పెరిగితే శిఖరం కూడా మునిగిపోతుంది.

08/07/2016 - 02:13

హైదరాబాద్, ఆగస్టు 6: మిషన్ భగీరథ ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ రక్షిత మంచినీటితో పాటు ఇంటర్నెట్‌ను కూడా అందించనున్నట్లు రాష్ట్ర ఐటి మంత్రి కె.తారక రామారావు ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్‌కు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో మంత్రి కెటిఆర్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు పథకాల గురించి ఇస్రో చైర్మన్‌కు వివరించారు.

08/07/2016 - 02:11

హైదరాబాద్, ఆగస్టు 6: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం
తెలంగాణలో జరుపనున్న పర్యటన వివరాలు ఇవే.
* మధ్యాహ్నం 2.20కి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
గవర్నర్, ముఖ్యమంత్రి స్వాగతం పలుకుతారు.
* 2.25కు హెలికాఫ్టర్‌లో బేగం పేట నుంచి గజ్వేల్‌కు
* 3.01కి ‘మిషన్ భగీరథ’ పైలాన్ ఆవిష్కరణ
* 3.03 గ్రామాలకు నీటి సరఫరా పంపు ప్రారంభం

08/07/2016 - 02:10

చార్మినార్/హైదరాబాద్, ఆగస్టు 6: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమంజసమేనని తెలంగాణ పొలిటికల్ జెఎసి చైర్మన్ ప్రొ.కోదండరాం అభిప్రాయపడ్డారు. దీనిపై నిర్ణయం తీసుకోవల్సింది కేంద్ర ప్రభుత్వమేనని, ఇందుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.

08/07/2016 - 02:10

హైదరాబాద్, ఆగస్టు 6: ఈ నెల 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరిగే కృష్ణా పుష్కరాలకు వెళ్లేందుకు వీలు లేని వారి కోసం ఆడ్రోబ్.ఇన్ అనే ఇ కామర్స్ సంస్థ వినూత్న ప్రయోగానికి పూనుకుంది. కృష్ణా జలాలను సేకరించి శుద్ధిచేసి వాటిని ఒక లీటర్ బాటిల్‌లో నింపి, హోం డెలివరీ చేయనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. దీనికి కృష్ణా జల్ అని నామకరణం చేసింది.

08/07/2016 - 02:09

హైదరాబాద్, ఆగస్టు 6: మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశానికి ఎమ్సెట్ -3ని సెప్టెంబర్ 11న నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి వెల్లడించారు. జెఎన్‌టియు విసి ఎ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్, జెఎన్‌టియు హెచ్ రెక్టార్ ఎన్ యాదయ్య, కో-కన్వీనర్ ఎ గోవర్ధన్, కమిటీ సభ్యులతో చైర్మన్ పాపిరెడ్డి సమావేశమై ఎమ్సెట్-3 నిర్వహణను సమీక్షించారు.

08/07/2016 - 02:08

హైదరాబాద్, ఆగస్టు 6: దేశంలోని వివిధ యూనివర్శిటీలకు చెందిన నకిలీ ఎడ్యుకేషనల్ సర్ట్ఫికెట్లు తయారుచేసి అమ్ముతున్న ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను హైదరాబాద్ ఈస్ట్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 24 డిగ్రీ, బి టెక్, ఎంఎస్సీ సర్ట్ఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు.

08/06/2016 - 08:30

హైదరాబాద్, ఆగస్టు 5: ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభకు బిజెపి చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 7న మోదీ రాష్ట్రానికి మొదటి సారి వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆహ్వానం మేరకు ప్రధాని పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్నారు.

08/06/2016 - 07:05

హైదరాబాద్, ఆగస్టు 5: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటి జెఇఇ ప్రవేశ పరీక్షను కొత్తగా మరో 9 దేశాల్లో కూడా నిర్వహించాలని అపెక్స్ అథారిటీ నిర్ణయించింది. కొత్తగా విదేశాల నుండి వచ్చి చేరే విద్యార్థుల కారణంగా దేశంలో విద్యార్థులకు సీట్ల కొరత లేకుండా విదేశీయులు ఏ మేరకు ఉత్తీర్ణులయితే ఆ మేరకు అదనపు సీట్లు కేటాయించాలని కూడా నిర్ణయించారు.

Pages