S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/22/2016 - 05:26

న్యూఢిల్లీ, జూన్ 21: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 10లో పేర్కొన్న ఉమ్మడి సంస్థల విభజనపై ఎటువంటి నిర్ణయం లేకుండానే సమావేశం ముగిసింది. మంగళవారం ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్‌కుమార్ నేతృత్వంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అధికారులు సమావేశమయ్యారు.

06/22/2016 - 05:20

రాజమహేంద్రవరం, జూన్ 21: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్ష విరమణలో ప్రతిష్టంభన తలెత్తింది. దీక్ష విరమించే క్రమంలో ప్రభుత్వం వ్యహరించిన తీరుతో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. దీక్ష కొనసాగుతున్న సమయంలో నిత్యం చర్చలకు, పరిస్థితి సమీక్షకు ప్రభుత్వాసుపత్రి వద్దకు వచ్చిన జిల్లా కలెక్టర్, ఎస్పీ దీక్ష విరమణ సమయానికి రాకపోవడంతో సమస్య మొదటికొచ్చినట్టయింది.

06/22/2016 - 05:17

హైదరాబాద్, జూన్ 21:అమరావతిలో స్విస్ చాలెంజ్ విధానంలో చేపట్టనున్న నిర్మాణాలపై ప్రభుత్వ ఉన్నతాధికారుల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. దీనిపై స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా వ్యతిరేకత వ్యక్తం చేసి, సంతకం చేయడానికి నిరాకరించినట్లు ప్రభుత్వ వర్గాల కథనం.

06/22/2016 - 01:48

చిత్రం అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా మంగళవారం విశాఖపట్నంలో యుద్ధ నౌక జలాశ్వపై యోగ సాధన చేస్తున్న నౌకాదళ సిబ్బంది

06/22/2016 - 01:42

హైదరాబాద్, జూన్ 21: మానవుల్లోని అన్ని రకాల శారీరక, మానసిక రుగ్మతలకు యోగ ఆసనాలు అద్భుతమైన నివారిణి అని, ఆరోగ్యకరమైన జీవితం కావాలంటే ప్రతి వ్యక్తి ప్రతి రోజూ కొంతసేపుయోగ ఆసనాలు, ధ్యానం చేయాలని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. మానసిక ఒత్తిళ్లు, ఆందోళన లక్షణాల నుంచి విముక్తి పొందేందుకు యువకులు తప్పనిసరిగా యోగ ఆసనాలు చేయాలన్నారు.

06/22/2016 - 01:38

హైదరాబాద్, జూన్ 21: నిజామాబాద్-మల్కాజ్‌గిరి, విజయవాడ-రాజమండ్రిల మధ్య 154 డెమో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. జూన్ 22 నుంచి జూలై 9 వరకు అదేవిధంగా ఆగస్టు 9 వరకు ఈ డెమో రైళ్లు నడుస్తాయని దక్షిణ మద్య రైల్వే పేర్కొంది.

06/22/2016 - 01:37

హైదరాబాద్, జూన్ 21: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు సహా 13 మందితో కూడిన జంబో బృందం ఈ నెల 26 నుండి చైనాలో పర్యటించనుంది. ఇందుకు షెడ్యూలును, చంద్రబాబు వెంట వెళ్లే అధికారుల జాబితాను మంగళవారం ఖరారు చేశారు. ప్రధానంగా వౌలిక సదుపాయాల కల్పన, భవన నిర్మాణం, రోడ్లు, ట్రాఫిక్ , వ్యర్థ పదార్థాల యాజమాన్య పద్ధతులు పరిశీలించడంతో పాటు పారిశ్రామికవేత్తలతోనూ ఈ బృందం సమావేశం అవుతుంది.

06/22/2016 - 01:34

హైదరాబాద్, జూన్ 21: ఇంజనీరింగ్‌లో చేరేందుకు ఏ బ్రాంచి అన్నది కంటే అభ్యర్ధుల కౌశలం, నైపుణ్యం, ఆసక్తి చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 22 నుండి తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కౌనె్సలింగ్ జరగనున్న నేపథ్యంలో విద్యార్ధులు ఏ బ్రాంచిలో చేరాలనే మీమాంసపై నిపుణులు డిమాండ్ బ్రాంచి అనే ఆలోచన కంటే వ్యక్తిగత సామర్ధ్యాలను, నైపుణ్యాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.

06/22/2016 - 01:33

రాజమహేంద్రవరం, జూన్ 21: గోదావరి మహా పుష్కరాల తొలి రోజున రాజమహేంద్రవరంలోని పుష్కరాల రేవులో జరిగిన తొక్కిసలాటకు ఎవరు బాధ్యులన్న విషయాన్ని తేల్చాలని పలువురు కోరారు. రానున్న కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా జస్టిస్ సోమయాజులు కమిషన్ ప్రభుత్వాలకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.

06/22/2016 - 01:31

హైదరాబాద్, జూన్ 21: దేశంలో పేరుకుపోతున్న అప్పుల కన్నా ఎఫ్‌డిఐలు మేలని, కేంద్రం ప్రత్యక్ష పెట్టుబడులపై ఆలస్యంగానైనా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు, జాతీయ నేత డాక్టర్ జయప్రకాష్‌నారాయణ్ అన్నారు.

Pages