S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/25/2016 - 05:34

హైదరాబాద్, జూన్ 24: అమరావతిలోని సదావర్తి భూముల కొనుగోలు వ్యవహారంలో తమ పార్టీ నేతల తప్పేమీలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో సదావర్తి భూముల కొనుగోలుపై వస్తున్న ఆరోపణలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

06/25/2016 - 06:35

హైదరాబాద్, జూన్ 24: కృష్ణా జలాల పంపిణీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వివాదం సమసిపోక ముందే కొత్త సమస్య వచ్చిపడింది. సహాయ పునరావాస చర్యలు పూర్తయ్యేంత వరకూ పులిచింతల ప్రాజెక్టు నింపవద్దని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శుక్రవారం లేఖ రాసింది. ఆంధ్రలో నిర్మించే పులిచింతల ప్రాజెక్టు వల్ల తెలంగాణలో పలు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి.

06/24/2016 - 05:33

హైదరాబాద్, జూన్ 23: దేశవ్యాప్తంగా 92 అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐఐటి జెఇఇ మెయిన్ ర్యాంకులను సిబిఎస్‌ఇ, జెఇఇ మెయిన్స్ అపెక్స్ అథారిటీ ప్రకటించింది. మెయిన్ ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు విజయఢంకా మోగించారు. జాతీయ స్థాయిలోని తొలి 20 ర్యాంకుల్లో తెలంగాణలో చదివిన ఆరుగురు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒకరు స్థానం సంపాదించారు.

06/24/2016 - 05:03

విజయవాడ, జూన్ 23: పుష్కర పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు నిర్ణీత వ్యవధిలో పూర్తిచెయ్యాలని అలా కాని పక్షంలో తీవ్రమైన చర్యలు వుంటాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా హెచ్చరించారు. విజయవాడ నగర పరిధిలో పుష్కర ఘాట్ల నిర్మాణం, 4లైన్ల రోడ్ల పనులు, దుర్గగుడి పైన చేపడుతున్న విస్తరణ పనులను గురువారం ముఖ్యమంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు.

06/24/2016 - 04:00

హైదరాబాద్, జూన్ 23: తెలంగాణలో రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఆర్టీసీ) చార్జీలను పెంచింది. గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, రోడ్డు రవాణశాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి, ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఆర్టీసి జాయింట్ డైరెక్టర్ జెవి రమణరావు ధరల పెంపు ప్రతిపాదనలను సమీక్షించారు. ఆర్టీసి చార్జీల పెంపుపై ముఖ్యమంత్రి అంగీకరించారు.

06/24/2016 - 03:59

హైదరాబాద్, జూన్ 23: తెలంగాణ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాదీ వినియోగదారులకు విద్యుత్‌షాక్ ఇచ్చింది. నిరుడు రూ.816కోట్ల భారాన్ని మోపిన సర్కారు ఈసారి ఏకంగా జనంపై రెట్టింపు భారం మోపింది. మొత్తం రూ. 1527 కోట్ల మేర విద్యుత్ చార్జీలను పెంచారు. గృహ వినియోగదారులపై రూ. 510 కోట్ల భారాన్ని విధించారు.

,
06/24/2016 - 03:31

హైదరాబాద్, జూన్ 23: వారంతా దశాబ్దాలపాటు కలసి మెలిసి పనిచేశారు. ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలుపంచుకున్నారు. కులాలు, ప్రాంతాలు వారి అనుబంధానికి ఎప్పుడూ అడ్డుగోడలు కాలేదు. కానీ, రాష్ట్ర విభజన వారిని విడదీసింది. విడిపోవడం, తరలిపోవడం అనివార్యమయింది. హైదరాబాద్‌తో దశాబ్దాలపాటు పెనవేసుకున్న అనుబంధం నేటితో ముగిసిపోయింది. ‘ఇక మనం ఇలాగే రోజూ కలవబోమ’న్న భావన వారి గుండె కలుక్కుమనేలా చేసింది. ఫలితం..

06/24/2016 - 03:22

విజయవాడ, జూన్ 23: బాబా రాందేవ్, జగ్గీ వాసుదేవ్‌ల సహకారంతో రాష్ట్రంలో ఓషధీ మొక్కల పెంపకం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం నాడిక్కడ ఆయన మొక్కల పెంపకంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా రాష్ట్రంలోని రహదారులు, రైల్వేలేన్లకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు.

06/24/2016 - 03:19

హైదరాబాద్, జూన్ 23: న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్ ఆధీనంలో ఉన్న స్థలాన్ని తెలంగాణకు అప్పగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఆయన గురువారం ఓ లేఖ రాశారు. ఎపి భవన్ ఆధీనంలో ఉన్న స్థలం హైదరాబాద్ రాష్ట్రానికి చెందిందని దానిపై పూర్తి హక్కు తెలంగాణకే ఉంటుందని ముఖ్యమంత్రి తన లేఖలో పేర్కొన్నారు.

06/24/2016 - 03:17

గుంటూరు, జూన్ 23: గుంటూరు జిల్లా వెలగపూడిలోని ఏపి తాత్కాలిక సచివాలయంలో కలకలం చెలరేగింది. సచివాలయ భవనాల నిర్మాణాలు పూర్తి కావచ్చిన నేపథ్యంలో రెండవ బ్లాక్‌లో ఓ భవనం ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కుంగింది. రెండురోజుల క్రితం భారీ వర్షం కురిసింది. దీంతో సచివాలయ ప్రాంగణమంతా బురదమయమైంది. లోపలకు ప్రవేశించే వీలు కూడా లేదు.

Pages