S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/24/2016 - 03:11

హైదరాబాద్, జూన్ 23: ద్రావిడ విశ్వవిద్యాలయం 8వేల మందికి ఎం.్ఫల్, పిహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశాలు ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం సిఐడి దర్యాప్తు నిర్వహించడం సబబేనని హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడటాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బి బోసలే, జస్టిస్ పి నవీన్ కుమార్‌లతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది.

06/24/2016 - 02:53

న్యూఢిల్లీ, జూన్ 23: కృష్ణాబోర్డు పరిధిని త్వరలోనే నోటిఫై చేస్తామని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు తనకు హామీ ఇచ్చారని ఏపి నీటిపారుదల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు చెప్పారు.

06/24/2016 - 02:51

న్యూఢిల్లీ, జూన్ 23: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండిగా, నిరంకుశత్వంతో వ్యవహరించటం వల్లనే గురువారం జరిగిన సమావేశంలో కూడా ఎలాంటి స్పష్టత రాలేదని హరీశ్‌రావు చెప్పారు. వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం చేస్తున్న సూచనలను కూడా పట్టించుకోవటం లేదని ఆరోపించారు.

06/24/2016 - 02:49

హైదరాబాద్, జూన్ 23: విద్యుత్ పంపిణీ సంస్థలను (డిస్కామ్) నష్టాల ఊబి నుంచి బయట పడేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉదయ్ పథకంలో తెలంగాణ రాష్ట్రం భాగస్వామ్యం అవుతుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. డిస్కాలకు ఉన్న అప్పులను తీర్చడం ద్వారా వాటిపై ఆర్థిక భారానాన్ని తగ్గిస్తామని ముఖ్యమంత్రి అన్నారు.

,
06/24/2016 - 02:47

హైదరాబాద్, జూన్ 23: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలు హైదరాబాద్ నుండి అమరావతికి తరలించే ప్రక్రియ వేగాన్ని పుంజుకుంది. 27వ తేదీ నుండి అమరావతి నుండే కార్యకలాపాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ ప్రభుత్వ శాఖల అధిపతుల కార్యాలయాల తరలింపు మొదలైంది. కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న సహకార సంఘాలు, అనుబంధ కార్యాలయాలు తరలింపు మొదలైంది.

06/24/2016 - 02:36

చిత్తూరు, జూన్ 23: ఒక యువకుని కడుపులో గర్భసంచి ఉండడాన్ని వైద్యులు గుర్తించారు. ఇది సృష్టికి విరుద్ధమైనా, జన్యుపరమైన లోపంతో ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. తమిళనాడు రాష్ట్రం హోసూరుకు చెందిన అమరనాథ్ (22) గత కొంత కాలంగా హెర్నియా వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆపరేషన్ కోసం కుప్పంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించాడు.

06/24/2016 - 02:36

ధర్మవరం రూరల్, జూన్ 23: చేనేత వ్యాపారులకు కోట్ల రూపాయలు బకాయి ఉన్న కళానికేతన్ టెక్స్‌టైల్స్ అండ్ జ్యుయలరీస్ సంస్థ ఎండి లీలాకుమార్‌ను 14 రోజుల రిమాండ్‌కు ఆదేశిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. లీలాకుమార్‌ను ధర్మవరం పోలీసులు బుధవారం కర్నూలులో అరెస్టు చేశారు.

06/24/2016 - 02:34

విజయవాడ, జూన్ 23: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బ్రిటన్ సంపూర్ణ సహకారం అందజేస్తుందని భారత్‌లో బ్రిటిష్ హైకమిషనర్ డొమినిక్ అస్‌క్వత్ హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో గురువారం ఆయన ఏపి సిఎం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు.

06/24/2016 - 02:31

మదనపల్లె, జూన్ 23: ‘నవ మాసాలు మోసి కన్నబిడ్డకు అంతుపట్టని రోగం సోకింది. తల్లిదండ్రులుగా మాకున్న సర్వశక్తులు ఒడబోసి వైద్యచికిత్సలు చేయించాం. రెండునెలల గడువుకు నెలరోజులుగా అభంశుభం ఎరుగని 8నెలల చిన్నారి నోరు విప్పి చెప్పలేక పడుతున్న బాధను కళ్ళెదుట చూడలేకున్నాం. ఎంత వ్యయప్రయాసలు చేసినా ఫలితం ఉండబోదని వైద్యులు చెబుతున్నారు.

06/23/2016 - 08:55

హైదరాబాద్, జూన్ 22: ప్రముఖ రంగస్థల నటుడు జెవి రమణమూర్తి (84) కన్నుమూశారు. బంజారాహిల్స్‌లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. జెవి రమణమూర్తి, ప్రముఖ సినీనటుడు జెవి సోమయాజులు సోదరుడు. ఆయన పూర్తి పేరు జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం లుకులాం గ్రామంలో జెవి జన్మించారు. 1957లో ఎమ్మెల్యే సినిమాతో 24వ ఏట సినీరంగ ప్రవేశం చేశారు.

Pages