S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/26/2016 - 05:05

హైదరాబాద్, జూన్ 25: రాష్ట్భ్రావృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకవైపు అహర్నిశలు కష్టపడుతుంటే, మరోవైపు సీఎం పేషీ అధికారుల తీరుతో బాబు కష్టం వృథా అవుతోందన్న ఆవేదన మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్లలో వ్యక్తమవుతోంది. కొంతమంది అధికారులు బాబును తప్పుదోవపట్టిస్తున్నారని, సీఎంఓలో ఉన్నామన్న ధీమాతో లెక్కలేకుండా వ్యవహరిస్తున్నారని మంత్రులు కూడా అసంతృప్తితో ఉన్నారు.

06/26/2016 - 05:03

గుంటూరు, జూన్ 25: రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికీ ఆహార భద్రతలో భాగంగా అన్న క్యాంటిన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. హరేకృష్ణ సమాజం సహకారంతో వెలగపూడిలో అన్న క్యాంటిన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ప్రారంభించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో మూడు క్యాంటిన్లను త్వరలో ఏర్పాటు చేస్తామని, ఆపై రాష్టమ్రంతటా విస్తరింపజేస్తామన్నారు.

06/26/2016 - 04:43

హైదరాబాద్, జూన్ 25: వ్యవసాయ రుణ మాఫీ కింద మూడవ విడతగా ప్రభుత్వం 2,190 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. మొదటి రెండు విడతలతో కలిసి ఇప్పటి వరకు 10,626 కోట్లు విడుదల చేశారు. మొత్తం 16వేల కోట్ల వరకు రుణ మాఫీ అమలు చేయాల్సి ఉంది. మూడవ విడతలో నాలుగు వేల కోట్లు విడుదల చేయాల్సి ఉండగా, సగమే శనివారం విడుదల చేశారు. త్వరలోనే మిగిలిన సగం విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

06/26/2016 - 04:43

హైదరాబాద్, జూన్ 25: షహదత్ ఆఫ్ హజరత్ అలీ (ఎఎస్) సందర్భంగా 27న ఐచ్చిక సెలవును ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు సిఎస్ రాజీవ్ శర్మ పేరిట శనివారం జీవో విడుదలైంది. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సెలవుల పట్టికలో ఎఎస్ ఆదివారం ఉంటుందని పేర్కొంది. అయతే, చంద్రుడి గమనం ప్రకారం ఐచ్చిక సెలవును 27కి మార్చారు. రాష్ట్ర వక్ఫ్‌బోర్డు సిఇఓ రాసిన లేఖను పరిగణనలోకి తీసుకుని సెలవులో మార్పు చేసింది.

06/26/2016 - 04:40

హైదరాబాద్/ సంగారెడ్డి, జూన్ 25: మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులకు న్యాయం చేయాలని ఒకవైపు విపక్షాలు ఆందోళనలు, దీక్షలు చేస్తుంటే, రైతులు కోరుకున్నట్టే పరిహారం చెల్లిస్తామంటూ సిఎం కెసిఆర్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. మల్లన్నసాగర్ భూనిర్వాసితుల సమస్యపై సిఎం కెసిఆర్ తొలిసారి స్పందించారు.

06/26/2016 - 04:37

హైదరాబాద్, జూన్ 25 : బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ద్రోణి వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, దాంతో కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో వచ్చే మూడు రోజుల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. ఈ మేరకు శనివారం ఐఎండి శాస్తవ్రేత్త చరణ్ సింగ్ ఒక ప్రకటన జారీ చేశారు.

06/26/2016 - 04:35

హైదరాబాద్, జూన్ 25: మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో భూనిర్వాసితులకు చెల్లించాల్సిన నష్టపరిహారం వ్యవహారం కొత్తమలుపు తిరిగింది. రైతాంగం నష్టపోకూడదన్న ఉద్దేశంతో 123 జీవో తీసుకొచ్చామని చెబుతున్న సర్కారు, రైతులు కోరుకుంటే 2013 కేంద్ర చట్టం ప్రకారమైనా చెల్లించేందుకు సిద్ధమేనంటూ ప్రకటించింది. వాస్తవానికి మార్కెట్ ధరకంటే మూడింతలు పరిహారం చెల్లించాలనేది 2013 భూసేకరణ చట్టంలోని ప్రధాన అంశం.

06/26/2016 - 04:34

రాజేంద్రనగర్, జూన్ 25: వర్శిటీల స్వయంప్రతిపత్తిపై ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం మంచిపద్ధతి కాదని తెలంగాణ జేఏసీ చైర్మెన్ కోదండరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ కళాశాలలో వర్శిటీ స్వయంప్రతిపత్తిపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

06/25/2016 - 07:43

ధర్మపురి, జూన్ 24: కరీంనగర్ జిల్లా ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో, ప్రధాన ద్వారం ఎదురుగా ప్రసన్నాంజనేయ ఆలయాన్ని ఆనుకుని, అంజనీసుతుని రూపుతో ఏపుగా నింగికెదిగిన అశోక వృక్షం చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్నది.

06/25/2016 - 07:28

హైదరాబాద్, జూన్ 24: రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ముస్లిం సోదరులకు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుతో పాటు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ తదితరులు హాజరయ్యారు.

Pages