S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/23/2016 - 02:27

హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్య పిజి సీట్ల అడ్మిషన్లకు కౌనె్సలింగ్ షెడ్యూలును శుక్రవారం ప్రకటించారు. పిజి అడ్మిషన్లకు తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి కౌనె్సలింగ్ నిర్వహిస్తున్నట్టు కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నాడు ఆయన సచివాలయంలో పిజి కోర్సుల వెబ్ కౌనె్సలింగ్‌పై మీడియాతో మాట్లాడారు.

04/23/2016 - 06:55

హైదరాబాద్, ఏప్రిల్ 22:హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, ఖమ్మం పట్టణాల్లో నిర్మించే ఐదు పెద్దాస్పత్రుల నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించేందుకు నెదర్లాండ్స్‌కు చెందిన రాబో బ్యాంకు ముందుకు వచ్చింది. శ్రీలంకతో పాటు పలు ప్రాంతాల్లో పెద్దస్పత్రులు నిర్మించిన అనుభవం ఈ బ్యాంకు ఉంది. తెలంగాణలో అస్పత్రుల నిర్మాణ వ్యయంలో, నిర్మాణంలో భాగం పంచుకుంటామని రాబో ప్రతినిధులు తెలిపారు.

04/23/2016 - 02:18

హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలుగువారి ఖ్యాతిని దశదిశలా చాటిన నటుడు, నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. ఎన్టీఆర్ అన్నా, ఆయన కుటుంబమన్నా తనకెంతో అభిమానమన్నారు. ఆ మహానటుడు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఉంటాడని కెసిఆర్ నివాళి ప్రకటించారు.

04/23/2016 - 02:12

విజయవాడ, ఏప్రిల్ 22: ఇజ్రాయిల్ తరహాలో రాష్ట్రంలో వ్యవసాయరంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్లాస్టిక్‌కు మానవ జీవితంతో విడదీయరాని బంధం ఉందని, ప్రధానంగా వ్యవసాయ రంగంలో డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ పరికరాల తయారీలో ప్లాస్టిక్‌కు తగిన ప్రాధాన్యం ఉందని అన్నారు.

04/23/2016 - 02:03

మచిలీపట్నం, ఏప్రిల్ 22: కృష్ణా జిల్లా కోడూరు మండలం విశ్వనాథపల్లి అమ్మవారి నెల సంబరానికి వచ్చిన నలుగురు యువకులు కృష్ణానదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్ధపల్లి గ్రామానికి చెందిన మైలా జయకృష్ణ(19), ఆరుగుల శ్రీకాంత్(18), మట్టుపల్లి పవన్ కుమార్(16), తలుచూరి నాగరాజు(15) ఈ ఘటనలో మృతి చెందారు.

04/23/2016 - 02:01

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు శాసనసభ స్పీకర్‌కు వదిలిపెట్టింది. ఈ వివాదంపై రోజా రాసిన లేఖను పరిగణనలోకి తీసుకొని సస్పెన్షన్‌పై నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్‌కు ధర్మాసనం సూచించింది. అదే సమయంలో రోజా సస్పెన్షన్‌పై హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం వద్ద విచారణలో ఉన్న పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది.

04/23/2016 - 02:00

హైదరాబాద్, ఏప్రిల్ 22: దేశ చరిత్రలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ డిస్కాంలు ఒక గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్‌ను కొనుగోలు చేసి రికార్డు సృష్టించాయి. తూర్పుగోదావరి జిల్లా జేగురుపాడులో ఉన్న 216 మెగావాట్ల జివికె గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్‌ను రూ. 261.27 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఏపి ట్రాన్స్‌కో, జెన్కో సిఎండి కె విజయానంద్ ప్రకటించారు.

04/23/2016 - 01:59

గుంటూరు, ఏప్రిల్ 22: గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవనాలను ముందుగానే ఈ నెల 25న లాంఛనంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీ ప్లస్-1గా 6 లక్షల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్న ఈ కార్యాలయ పనులు జూన్ 15లోగా ఎల్‌అండ్ టి, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు పూర్తిచేయాల్సి ఉంది.

04/22/2016 - 08:40

హైదరాబాద్, ఏప్రిల్ 21: దేశానికి త్రిభాషా సూత్రమే ఆధారం కావాలని, అందరూ ఇంగ్లీషు, హిందీ నేర్చుకోవాలని అదేం తప్పు కాదని, అంత మాత్రాన మాతృ భాషను నిర్లక్ష్యం చేయరాదని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తాజ్ డక్కన్ హోటల్‌లో గురువారం నాడు నిర్వహించిన హిందీ సలహా మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

04/22/2016 - 08:19

తిరుమల, ఏప్రిల్ 21: గత మూడు రోజులుగా తిరుమలలోని వసంతోత్సవ మండపంలో నిర్వహిస్తున్న వార్షిక సాలకట్ల వసంతోత్సవాలు గురువారం కన్నుల పండువగా ముగిశాయి. తొలిరోజు, రెండోరోజు మలయప్పస్వామి తన ఉభయదేవేరులతో కూడి వసంతోత్సవంలో పాల్గొనగా చివరి రోజున మలయప్పతో పాటుగా శ్రీ సీతాలక్ష్మణాంజనేయ సమేత శ్రీరాములవారు, శ్రీ రుక్మిణిదేవి సమేత శ్రీ కృష్ణ స్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు.

Pages