S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/24/2016 - 01:50

హైదరాబాద్, ఏప్రిల్ 23: ఎల్‌ఇడి బల్బుల పంపిణీలో దేశంలోనే అగ్రగ్రామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ తాజాగా మరో రికార్డు నెలకొల్పబోతోంది. గృహ విద్యుదీకరణలో మే నెలాఖరు నాటికి 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేయనుంది.

04/23/2016 - 06:43

తిరుపతి, ఏప్రిల్ 22: తిరుపతిలో ఇటీవల కాలం వరకు 42 డిగ్రీల ఉష్ణతాపంతో ఉడికి పోయిన ప్రజలకు శుక్రవారం అరగంటపాటు చిరు జల్లులు కురిసి ఊరట నిచ్చాయి. అదే సమయంలో బీభత్సమైన గాలితోడుకావడంతో కొంత భయకంపితులైయ్యారు. ఎక్కడ ఏ విద్యుత్ వైర్లు తెగి నెత్తిన పడతాయో, చెట్లు, ఫ్లెక్సీలు ఎక్కడ కూలుతాయోనని పాదచారులు, వాహన చోధకులు భయభ్రాంతులకు గురైయ్యారు.

04/23/2016 - 02:52

హైదరాబాద్, ఏప్రిల్ 22: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని అంజనీ పుత్రుని శోభాయాత్ర నేత్రపర్వంగా సాగింది. గౌలిగూడ శ్రీరామ మందిరంలో శాంతి హోమంతో ప్రారంభమైన శోభాయాత్ర సికిందరాబాద్ తాడ్‌బంద్ ఆంజనేయ స్వామి దేవాలయం వరకు కొనసాగింది. ఈ శోభాయాత్రలో విహెచ్‌పి జాతీయ, అంతర్జాతీయ నాయకులు పాల్గొన్నారు. భారీ బందోబస్తు మధ్య మొత్తం 8.2 కిలోమీటర్లు సాగిన శ్రీ వీరహనుమాన్ విజయ యాత్ర ప్రశాంతంగా జరిగింది.

04/23/2016 - 02:49

హైదరాబాద్, ఏప్రిల్ 22: నిన్న నినే్న..నేడు నేడే! కాలగమనంలో ఏదీ శాశ్వతం కాదు. తెలంగాణ ఉద్యమ వేడిలో సమైకాంధ్రకు కట్టుబడ్డ సినీ పరిశ్రమ ఇప్పుడు రూటు మార్చింది. ఒకప్పుడు ఉద్యమ నాయకుడు కెసిఆర్‌ను విమర్శించిన సినీ పెద్దలు ఇప్పుడు చేరువవుతున్నారు. అప్రతిహత ఉద్యమంతో తెలంగాణ సాధించి కొత్త రాష్ట్రానికి సిఎం అయిన ఆయన్ని సినిమాల ప్రారంభోత్సవాలకు పిలవడానికి క్యూలు కడుతున్నారు.

04/23/2016 - 02:39

హైదరాబాద్, ఏప్రిల్ 22: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారనే విషయమై రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలవాలని వైకాపా అధ్యక్షుడు, జగన్ నిర్ణయించారు. శనివారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు వైకాపా ప్రకటించింది.

04/23/2016 - 02:39

హైదరాబాద్, ఏప్రిల్ 22: బిజెపి రాష్ట్ర కార్యాలయంలో లిఫ్ట్ తెగి పడింది. ఈ ప్రమాదం నుంచి కేంద్ర మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా, ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు బయటపడ్డారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నడ్డా, ప్రభాకర్, రామచందర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత వారు గ్రౌండ్ ఫ్లోర్‌కు వచ్చేందుకు లిఫ్ట్ ఎక్కారు.

04/23/2016 - 02:38

హైదరాబాద్, ఏప్రిల్ 22: హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాల మళ్ళింపు, ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషించిన పోలీసులు అత్యుత్సాహం చూపించారు. పోలీసులు నగరాన్ని అష్టదిగ్బంధనం చేయడంతో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. ముందుకుపోలేక, వెనక్కి రాలేక వాహనదారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. వడ దెబ్బతో ఓ భక్తుడు మృతి చెందాడు.

04/23/2016 - 02:33

హైదరాబాద్, ఏప్రిల్ 22: ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ప్రతిపక్షాలను కలుపుకుని పోయేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

04/23/2016 - 02:31

విశాఖపట్నం, ఏప్రిల్ 22: రాష్ట్రంలో పాలకవర్గాలు లేని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. విశాఖపట్నంలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు నగర పాలకసంస్థలతో పాటు రాష్టవ్య్రాప్తంగా పలు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగలేదన్నారు.

04/23/2016 - 02:30

హైదరాబాద్, ఏప్రిల్ 22: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం మధ్యాహ్నాం గవర్నర్‌ను నరసింహన్‌ను కలిశారు. ఇటీవల గవర్నర్ ఢిల్లీ పర్యటించి వచ్చిన తరువాత కెసిఆర్ కలవడం ఇదే మొదటి సారి. ఉభయ రాష్ట్రాలకు సంబంధించి ఇంకా పరిష్కారం కాని కొన్ని అంశాలపై గవర్నర్ ఢిల్లీలో చర్చించారు. ఈ అంశాల గురించి ఇరువురి భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది.

Pages