S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/22/2016 - 01:48

హైదరాబాద్, ఏప్రిల్ 21:తెలంగాణలో రాష్టవ్య్రాప్తంగా అన్ని మండలాల్లో భూగర్భ జల మట్టాలు ప్రమాదకరస్థాయిలో పడిపోయాయి. రాష్ట్రంలో గత సీజన్‌లో 25 శాతం తక్కువగా వర్షపాతం తక్కువగా నమోదుకావడంవల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. సాధారణ వర్షపాతం 862 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా 212 మిల్లీమీటర్లు తక్కువగా అంటే 650 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది.

04/22/2016 - 01:46

హైదరాబాద్, ఏప్రిల్ 21: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం లో విడుదల చేయనున్నారు. ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేమారు విడుదల చేయడం ఇదే ప్రథమం. ఫలితాలను ప్రభుత్వ, ప్రైవేటు వెబ్ పోర్టల్స్‌లోనూ, ఇ సేవలోనూ అందుబాటులో ఉంచుతామని బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్ తెలిపారు.

04/22/2016 - 01:46

న్యూఢిల్లీ,ఏప్రిల్ 21: రాష్ట్ర హైకోర్టు విభజన అంశంపై సుప్రీం కోర్టుకు వెళ్లాలనుకుంటున్నట్లు టిఆర్‌ఎస్ లోక్‌సభ సభ్యుడు, సీనియర్ నాయకుడు బి.వినోద్‌కుమార్ తెలిపారు. వినోద్‌కుమార్ గురువారం కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానందగౌడను కలిసి హైకోర్టు విభజన, రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల సీట్లను పెంచటం గురించి చర్చించారు.

04/22/2016 - 01:45

హైదరాబాద్, ఏప్రిల్ 21:ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వర్తిస్తున్న కల్యాణలక్ష్మి పథకం ఇకపై బిసిలకూ వర్తిస్తుంది. వివాహ సమయంలో బిసి అమ్మాయికి కల్యాణలక్ష్మి పథకం కింద 51వేల రూపాయలు చెల్లించే విధంగా ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బిసిలతోపాటు ఆర్థికంగా వెనుకబడిన వారికీ ఈ పథకం వర్తిస్తుందని జీవోలో పేర్కొన్నారు. 18 ఏళ్ల వయసు నిండిన బిసి/ ఇబిసిలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.

04/22/2016 - 01:44

కరవు గ్రామాలను ఆదుకుంటామంటారు..వెనుకబడిన వాటిని దత్తత తీసుకుంటామంటూ సభ్య సమాజం సాక్షిగా చెబుతారు. ఇంకేముంది..తమ చేతుల్లో పడితే దత్తత గ్రామాల భవితే మారిపోతుందన్న ఆశల పందిళ్లు కట్టిస్తారు.

04/22/2016 - 01:28

అనంతపురం, ఏప్రిల్ 21: భూగర్భ జలాల సంరక్షణతోనే కరవును శాశ్వతంగా పారదోలవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అనంతపురంలోని కెటిఆర్ ఫంక్షన్ హాలులో గురువారం నీరు-ప్రగతి కార్యక్రమంపై జరిగిన సమీక్షలో మాట్లాడిన ఆయన గత 19 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు సాధారణం కన్నా అతి తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. రాబోయే రోజుల్లో కురిసే ప్రతి వర్షపునీటిని ఒక్క చుక్క కూడా వదలకుండా భూగర్భ జలంగా మార్చాలన్నారు.

04/22/2016 - 01:26

కడప, ఏప్రిల్ 21: రాజకీయ స్వలాభం కోసం అడ్డదిడ్డంగా రాష్ట్ర విభజన చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను నాటి కాంగ్రెస్ పాలకులు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బిజెపి నేడు అధికారంలోకి వచ్చినందున విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

04/22/2016 - 01:23

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ కేసులో సుప్రీంకోర్టు రాజీ మార్గం సూచించింది. విభజనతో ఎన్నో సవాళ్లు రాష్ట్రం ముందుండగా. అహంకారంతో చిన్న, చిన్న విషయాలను పెద్దవిగా చేసుకోవద్దని ధర్మాసనం సలహా ఇచ్చింది. రోజా సస్పెన్షన్‌పై సామరస్య పూర్వకంగా పరిష్కారించుకునేందుకు ఇరుపక్షాలు ముందుకు రావాలని ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షాన్ని కోరింది.

04/22/2016 - 01:21

అమరావతి, ఏప్రిల్ 21: గుంటూరు జిల్లా అమరావతి మండలం మునగోడు గ్రామంలో కల్తీ మద్యం ఇద్దరి ప్రాణాలు తీసింది. గ్రామంలో బెల్టుషాపు నిర్వాహకుడైన మేకల కాటంరాజు (60), గండు నీలయ్య (38) కలిసి గురువారం ఉదయం 7 గంటల సమయంలో కల్తీ అయిన మెక్డోల్ బ్రాందీ తాగారు. అరగంటలోపే ఇద్దరూ అపస్మారక స్థితికి చేరారు. ఇది గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా వీరిని అమరావతి 30 పడకల ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.

04/22/2016 - 01:18

హైదరాబాద్, ఏప్రిల్ 21: అగ్రిగోల్డ్ కేసులో ఆంధ్ర రాజధాని అమరావతి ప్రాంత సిఆర్‌డిఏ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలోని భూములను వేలం వేసి డిపాజిటర్లకు ఇవ్వాలని హైకోర్టు గత ఏడాది డిసెంబర్‌లో ఆదేశాలు జారీ చేసింది. కాని అగ్రి గోల్డ్ భూముల వేలం విషయంలో సిఆర్‌డిఏ సహకరించకపోవడంపై గురువారం కేసు విచారణ సందర్భంగా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

Pages