S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/24/2016 - 05:50

సంగారెడ్డి, ఏప్రిల్ 23:ఉరుముతున్న కరవుపై డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి సమరశంఖం పూరించారు. గ్రామస్థులను ఒకతాటిపైకి తెచ్చి, ఒకేరోజు 388 ఇంకుడు గుంతల్ని తవ్వించి, ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు. ఓవైపు మండుతున్న ఎండలు, మరోవైపు అడుగంటుతున్న భూగర్భ జలాలు డిప్యూటీ స్పీకర్‌ను ఆలోచనలో పడేశాయి.

04/24/2016 - 05:48

విజయవాడ, ఏప్రిల్ 23: రెండు తెలుగు రాష్ట్రాల్లో కన్వీనర్ కోటాలో గల 1905 మెడికల్ పీజీ సీట్ల భర్తీ ప్రక్రియ ఆరంభమైంది. ఈ సారికి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య శాస్త్ర విశ్వవిద్యాలయం రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా సీట్లభర్తీ ప్రక్రియను పూర్తి చేయనుంది. ఆంధ్రప్రదేశ్ వరకు దరఖాస్తుల పరిశీలన పూర్తయి శనివారం నుంచి తొలిసారిగా వెబ్ ఆప్షన్‌లు ప్రారంభమయ్యాయి.

04/24/2016 - 05:47

సింహాచలం, ఏప్రిల్ 23: సింహాద్రినాథుని సాక్షిగా శుక్రవారం రాత్రి సింహగిరిపై నుంచి నాలుగు వ్యాన్లలో గోవులు తరలిపోయాయి. భక్తులు మొక్కుబడుల రూపంలో సమర్పించిన గోవులను కొంతమంది వ్యక్తులు వ్యాన్లలో తరలించుకుపోవడం విలేఖరుల కంటపడింది. వారిని ఆపి ప్రశ్నించగా దేవస్థానం వారే కిందికి తీసుకురమ్మన్నారంటూ సమాధానం చెప్పి హుటాహుటిన అక్కడ నుంచి ఉడాయించారు.

04/24/2016 - 05:41

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ప్రైవేట్ ఆసుపత్రులు, వైద్యుల సేవలను వ్యవస్థీకృతం చేసి అదుపులోకి తెచ్చేందుకు ప్రైవేట్ ఆసుపత్రులను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు మహమ్మద్ అలీ ఖాన్ కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి జె.పి నడ్డాను కోరారు. ఖాన్ ఈ మేరకు నడ్డాకు లేఖ రాశారు.

04/24/2016 - 05:40

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి తనను రెండు సార్లు రాజ్యసభకు పంపించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. హనుమంతరావు శనివారం తన కుటుంబ సభ్యులతో వెళ్లి సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. హనుమంతరావు రాజ్యసభ సభ్యత్వ పదవీ కాలం జూన్‌తో ముగుస్తోంది.

04/24/2016 - 05:39

ఏలూరు, ఏప్రిల్ 23: ‘నీరు అందుబాటులో ఉంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. పరిశ్రమలు వస్తాయి. ఫలితంగా అభివృద్ధి సాధ్యమవుతుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. వాన నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోగలిగితే భవిష్యత్తు బంగారమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆ దిశగా రాష్ట్ర ప్రజలను కార్యోన్ముఖులను చేసే కార్యక్రమానికి ‘నీరు - ప్రగతి’ అని పేరు పెట్టామన్నారు.

04/24/2016 - 05:36

విజయవాడ, ఏప్రిల్ 23: ఖమ్మం జిల్లా పాలేరులో జరగనున్న ఉప ఎన్నికపై తెలుగుదేశం పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఉదయం తన నివాసగృహంలో తెలంగాణ ముఖ్య నేతలతో సమాలోచనలు జరిపారు.

04/24/2016 - 05:35

హైదరాబాద్, ఏప్రిల్ 23: హైదరాబాద్ మహానగర విస్తరణ, భవిష్యత్తు అవసరాలు, ట్రాఫిక్ జామ్‌ల నివారణ కోసం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఎస్‌ఆర్‌డిపికి ఎలాంటి ఆటంకాలు లేకుండా తక్షణం పనులు ప్రారంభించాలని తెలంగాణ మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు అధికారులను ఆదేశించారు. ఎస్‌ఆర్‌డిపి పనుల పురోగతిపై కెటిఆర్ శనివారం సమీక్షించారు.

04/24/2016 - 05:30

కర్నూలు, ఏప్రిల్ 23: రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదిపై చేపట్టిన ప్రాజెక్టులను అడ్డుకోకపోతే ఆంధ్రప్రదేశ్ అధోగతిపాలవుతుందని ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీశైలం ప్రాజెక్టుపై శనివారం ధర్నా నిర్వహించారు.

04/24/2016 - 05:27

హైదరాబాద్, ఏప్రిల్ 23: టిఆర్‌ఎస్ బలం తెలంగాణలో విపక్షాలను ఏకం చేస్తోంది. పలు ఉప ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ సాధించిన విజయాన్ని చూసిన విపక్షాలు బహుముఖ పోటీకన్నా ముఖాముఖి పోటీ ద్వారా టిఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇవ్వవచ్చునని భావిస్తున్నాయి.

Pages