S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/22/2016 - 05:01

ఖమ్మం, ఏప్రిల్ 21: నాడు తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలు ఇప్పుడు పాలేరు ఉప ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారనున్నారు. టిడిపిలో ఉన్న సమయంలో అంతర్గతంగానే బద్ధశత్రువులుగా ఉన్న నామా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు వేర్వేరు పార్టీల తరపున అసెంబ్లీ బరిలోకి దిగనున్నారు.

04/22/2016 - 05:00

పోలవరం, ఏప్రిల్ 21: దేశంలో పోలవరం సహా 89 సాగునీటి ప్రాజెక్టులను నాలుగేళ్లలో పూర్తిచేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సిఇఒ అమర్‌జిత్ సింగ్ తెలిపారు. 2019 డిసెంబరు నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందన్నారు.

04/22/2016 - 04:57

హైదరాబాద్, ఏప్రిల్ 21: ఎంఐఎం పార్టీకి చెందిన చాంద్రాయణగుట్ట శాసనసభ్యుడు, శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గం ఎంఐఎం అధ్యక్షుడు అజీమ్ బిన్ యాహ్యాలను ప్రాసిక్యూట్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. నిర్మల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2013లో జరిగిన బహిరంగ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

04/22/2016 - 04:56

హైదరాబాద్, ఏప్రిల్ 21: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించి తీరుతుందని ఇందులో ఎలాంటి సంశయం లేదని టిఆర్‌ఎస్ పాలేరు ఎన్నికల ఇన్‌చార్జి, తెలంగాణ మంత్రి కె తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. పాలేరు అభ్యర్థిగా ఎంపికైన మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో గురువారం మంత్రి కెటిఆర్ భేటీ అయ్యారు.

04/22/2016 - 04:55

హైదరాబాద్, ఏప్రిల్ 21: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు కాలిఫోర్నియా గవర్నర్ ఎడ్మండ్ జి బ్రౌన్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. వాతావరణాన్ని పరిరక్షించేందుకు కాలిఫోర్నియాలో జరిగే అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావాలని కెసిఆర్‌ను ఆహ్వానించారు. వాతావరణ మార్పు సమస్యకు ముఖ్యమంత్రి అమలు చేస్తున్న పరిష్కార మార్గాలను గవర్నర్ అభినందించారు.

04/22/2016 - 04:54

హైదరాబాద్, ఏప్రిల్ 21: తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖకు ప్రతిష్టాకరమైన ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్ అవార్డు లభించింది. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిర్వహణ విభాగంలో ఢిల్లీలోని ఫిక్కీ ఈ అవార్డును తెలంగాణ పోలీసు శాఖకు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను డిజిపి కార్యాలయం గురువారం వెల్లడించింది.

04/22/2016 - 02:07

ఒంటిమిట్ట, ఏప్రిల్ 21: ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం కన్నుల పండువగా సాగింది. అంతకుముందు శ్రీసీతారాములకు కల్యాణం నిర్వహించగా, అనంతరం స్వామివారు గజ వాహనంపై దర్శనమిచ్చారు. ఉదయం 8.55 గంటలకు శుభ ఘడియల్లో స్వామివారి రథోత్సవం ప్రారంభమైంది. రథోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు.

04/22/2016 - 02:05

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ఉత్తరాఖండ్ వ్యవహారం పార్లమెంట్ బడ్జెట్ రెండోదఫా సమావేశాలలో మోదీ సర్కారుపై విరుచుకుపడటానికి కాంగ్రెస్‌కు ప్రధానాస్త్రంగా మారింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని అస్థిరపరచిన మోదీ సర్కారు తీరును ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి గురువారం నోటీసు ఇచ్చింది.

04/22/2016 - 02:05

హైదరాబాద్, ఏప్రిల్ 21: విద్యుత్ శాఖలోని ఆస్తులు, ఉద్యోగుల పంపకంపై గురువారం ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సిఎండిల మధ్య జరిగిన సమావేశంలో ఆశించిన పురోగతి కనపడలేదు. ఇరు రాష్ట్రాల విద్యుత్ శాఖాధికారులు ఈ నెల 30న సమావేశం కావాలని నిర్ణయించారు. వరుసగా నాలు గు సంవత్సరాలు ఎక్కడ చదివిన అంశాన్ని స్థానికతగా పరిగణించాలని ఏపి అధికారులు కోరారు.

04/22/2016 - 01:50

హైదరాబాద్, ఏప్రిల్ 21: జిల్లాలవారీగా ప్రభుత్వ భూముల ఆక్రమణలపై జాబితాలు సిద్ధమవుతున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారమే కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణల్లో ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి. వీటికి సంబంధించి ఏళ్ల తరబడి కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి కూడా.

Pages