S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/06/2016 - 00:52

కాకినాడ, ఫిబ్రవరి 5: కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కిర్లంపూడిలోని తన ఇంట్లో శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆమరణ దీక్ష ప్రారంభించారు. భార్య పద్మావతి సైతం ఆమరణ దీక్షకు కూర్చున్నారు. తొలిరోజు ముద్రగడ దంపతులకు మద్దతుగా కుటుంబీకులు దీక్షలో కూర్చున్నారు.

02/06/2016 - 00:52

విశాఖపట్నం, ఫిబ్రవరి 5: ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష సిఎం చంద్రబాబుని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు చంద్రబాబు రెండు రోజుల నుంచి విశాఖలోనే బస చేస్తున్నారు. మరో రెండు రోజులు ఇక్కడే ఉంటారు. ఓపక్క ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరుగుతోంది. అంతర్జాతీయంగా అందరి కళ్లూ ఆంధ్రపైనే ఉన్నాయి.

02/06/2016 - 02:22

విశాఖపట్నం, ఫిబ్రవరి 5: సముద్ర జలాల్లో విధ్వంసానికి కుట్ర పన్నుతోన్న ఉగ్రవాద ఆగడాలు అరికట్టేందుకు నౌకాదళం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని భారత నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ ఆర్‌కె ధావన్ వెల్లడించారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా శుక్రవారం జాతీయ, అంతర్జాతీయ మీడియా సమావేశంలో మాట్లాడారు.

02/05/2016 - 07:41

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 4: రాష్టవ్య్రాప్తంగా సంచలనం కలిగించిన కాల్‌మనీ సెక్స్‌రాకెట్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే సోదరుడు చెన్నుపాటి శ్రీను ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. విజయవాడలో కాల్‌మనీ మాటున మహిళల పట్ల లైంగిక చర్యలకు పాల్పడిన ఆరోపణలపై మాచవరం పోలీసులు ఏడుగురు నిందితులపై అత్యాచారం, చీటింగ్, ఇతర కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

02/05/2016 - 07:40

కర్నూలు: తనకు జరిగిన అవమానానికి ఎఐసిసి సభ్యులు వచ్చి వివరణ ఇస్తే తప్ప పార్టీ కార్యకర్తలు శాంతించబోరని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఆల్టిమేటం జారీ చేశారు. అనంతపురం జిల్లా బండ్లపల్లిలో 2వ తేదీ రాహుల్‌గాంధీ సభకు హాజరైనపుడు జరిగిన అవమానంపై కోట్ల సూర్యతో చర్చించడానికి గురువారం సాయంత్రం మాజీ మంత్రి శైలజానాథ్ ఆయన స్వగ్రామం కర్నూలు జిల్లా లద్దగిరికి వచ్చారు.

02/05/2016 - 07:33

విశాఖపట్నం: భారత్-పాక్ యుద్ధంలో మరణించిన అమరవీరులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నివాళులు అర్పించారు. 1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధంలో భారత నౌకాళదానికి చెందిన పలువురు ప్రాణాలు అర్పించారు. ఇందుకు చిహ్నంగా విశాఖ బీచ్ రోడ్డులో విక్టరీ ఎట్ సీ పేరుతో స్మారక స్థూపాన్ని నిర్మించారు.

02/04/2016 - 06:32

విజయవాడ: కాపులను బీసీల్లో చేర్చేందుకు ఆరుగురు మంత్రులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఇందులో ఉప ముఖ్యమంత్రులు కెఇ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్పతో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, పి నారాయణ, కొల్లు రవీంద్ర ఉంటారు. ఇదిలావుంటే, మంజునాథ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాథ గురువారం నగరానికి చేరుకుని ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు.

02/04/2016 - 06:30

హైదరాబాద్: దోమవల్ల వ్యాప్తిచెందే ప్రమాదకర జికా వైరస్ నిరోధించేందుకు వ్యాక్సిన్ కనుగొన్నట్టు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సిఎండి ఎల్లా కృష్ణ తెలిపారు. జికా వైరస్ ప్రపంచవ్యాప్తంగా భయభ్రాంతులను సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. శిశువుల వైకల్యానికి ఈ వైరస్ కారణమయ్యే ప్రమాదం ఉంది. ఏడాది క్రితంనుంచి వ్యాక్సిన్ తయారు చేసేందుకు తమ సంస్థలోని శాస్తవ్రేత్తలు పరిశోధనలు చేశారన్నారు.

02/04/2016 - 06:24

విశాఖపట్నం: వందకుపైగా యుద్ధ నౌకలు. 90కి పైగా యుద్ధ విమానాలు. ఏ దేశ నౌకాదళమైనా సగర్వంగా చెప్పుకునే పండుగ అంతర్జాతీయ సముద్ర సమీక్ష. ఏ దేశంలోనైనా అత్యంత అరుదుగా జరిగే కార్యక్రమమిది. అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్షకు సన్నాహాలు పూర్తయ్యాయి. భౌగోళికంగా సరిహద్దు తగాదాలుండొచ్చు. వర్తక, వాణిజ్య విషయాల్లో భేదాభిప్రాయాలు ఉండచ్చు. షరతులు, నిబంధనల విషయంలో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు.

02/04/2016 - 06:20

విజయవాడ: పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ సమీపంలోని భాస్కరరావుపేటలో బుధవారం ఉదయం 11 గంటలకు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు 150 పూరి గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయ. ప్రమాదంలో వృద్ధురాలు సజీవదహనమైంది. వందలాది పేదలు నిరాశ్రయులై వీధినపడ్డారు. అగ్నికీలలు చెలరేగి మంటలు దావానంలా ఎగిసిపడ్డాయి. ఇళ్లలోని వస్తువులు, మంచాలు, వంటసామగ్రి, చివరకు భద్రంగా దాచుకున్న నగదు, వెండి, బంగారు ఆభరణాలు బూడిదపాలయ్యాయి.

Pages