S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/31/2016 - 05:47

విశాఖపట్నం, జనవరి 30: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూతో విశాఖ ఖ్యాతి పెరగాలని, ప్రపంచపటంలో విశాఖకు సుస్థిర స్థానం లభించేలా ఏర్పాట్లు చేయాలని సిఎం చంద్రబాబు అన్నారు. ఫిబ్రవరి 4నుంచి 8వరకూ విశాఖలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)కి సంబంధించిన ఏర్పాట్లపై స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం సమీక్షించారు.

01/31/2016 - 05:44

హైదరాబాద్, జనవరి 30: ప్రజా కర్తవ్యం గుర్తుంచుకుని అహోరాత్రులు కష్టపడుతున్నట్టు తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ తన మానస పుత్రికగా అభివర్ణించారు. మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా- భాజపా గెలుపు చారిత్రక అవసరమన్నారు. కేంద్రంతో తెలంగాణ కరవు గురించి తానే చెప్పానని, ఫలితంగా అధికంగా నిధులు వచ్చాయన్నారు.

01/30/2016 - 07:14

హైదరాబాద్, జనవరి 29: ఓటుకు నోటు కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిహెచ్‌ఎంసి ఎన్నికల సందర్భంగా నిర్భయంగా తిరుగుతున్నా టిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోకుండా చోద్యం చూస్తోందని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. టిఆర్‌ఎస్, టిడిపి పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని ఆయన అన్నారు.

01/30/2016 - 07:13

నార్పల, జనవరి 29: ఉపాధి పనుల కల్పనలో బండ్లపల్లి గ్రామం మరోసారి అందరి దృష్టికి ఆకర్షించనుంది. పదేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో ప్రారంభించింది. 2006 ఫిబ్రవరి 2వ తేదీ అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ చేతుల మీదుగా గ్రామంలో ఉపాధి పథకం లాంఛనంగా ప్రారంభమైంది.

01/30/2016 - 07:08

విజయవాడ (క్రైం), జనవరి 29: విజయవాడ పటమట పోలీస్టేషన్ పరిథిలోని ఓ ఐరన్ వ్యాపారి ఇంట్లో శుక్రవారం గ్యాస్ పేలుడు సంభవించింది. ప్రమాదవశాత్తు సంభవించిన ఈ పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటి యజమాని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాత్రంతా గ్యాస్ లీకై ఉండటంతో ఉదయం సిగరెట్ వెలిగించగానే ప్రమాదం చోటు చేసుకున్నట్లు విజయవాడ లా అండ్ ఆర్డర్ డిసిపి కాళిదాసు రంగారావు తెలిపారు.

01/30/2016 - 07:06

విశాఖపట్నం, జనవరి 29: హోరున శబ్దం చేసుకుంటూ తీరం వైపునకు దూసుకొచ్చే యుద్ధ విమానాలు.. శత్రువులను మట్టుపెట్టేందుకు జెమినీ బోట్లపై తరుముకొచ్చే కమాండోలు.. ఒకపక్క యుద్ధ ట్యాంకర్లు, మరోపక్క సముద్ర జలాలపై అత్యంత వేగంగా ప్రయాణిస్తూ శుత్రువులను మట్టుపెట్టేందుకు బయల్దేరిన యుద్ధ నౌకలు..

01/30/2016 - 07:03

విజయనగరం, జనవరి 29: నకిలీ నోట్లు చలామణి చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను విజయనగరం పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితుల నుంచి 6.03లక్షల రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

01/30/2016 - 07:02

విజయవాడ, జనవరి 29: విద్యా వ్యవస్థలో మతోన్మాద శక్తులు చొరబడకుండా ప్రగతిశీల పోరాటాలతో విద్యార్థి సంఘాలు అడ్డుకట్ట వేయాలని, దేశంలో లౌకిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసేందుకు పాలకపక్ష బిజెపి అనుబంధ శక్తులు కుట్ర పన్నుతున్నాయని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్‌ఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి విశ్వజిత్‌కుమార్ విరుచుకుపడ్డారు.

01/30/2016 - 05:32

నెల్లూరు, జనవరి 29: అక్రమ కేసులు బనాయిస్తే భయపడబోమని, ప్రభుత్వంపై నిరంతరం రాజీలేని పోరాటం చేసేందుకు సిద్ధమని రాజంపేట ఎంపి మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం బెయిల్‌పై విడుదలైన ఆయన చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలిసి జిల్లా కేంద్రంలోని దర్గామిట్టలో ఉన్న హరితా హోటల్‌లో శుక్రవారం విలేఖరులతో మాట్లాడారు.

01/30/2016 - 05:31

గుంటూరు, జనవరి 29: రాష్ట్రప్రభుత్వం బలవంతపు భూసమీకరణను తక్షణం నిలిపివేయాలంటూ మంగళగిరి వైస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) శుక్రవారం ఉండవల్లి సెంటర్‌లో భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత విధానాలవల్ల రాజధాని రైతులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

Pages