S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/30/2016 - 05:30

గుంటూరు, జనవరి 29: మాస్టర్‌ప్లాన్‌పై అవగాహన సదస్సు నిర్వహించేందుకు శుక్రవారం ఐనవోలు వచ్చిన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణాలకు భూములిస్తే మంచి జరుగుతుందని భావించి గ్రామంలో 100 శాతం పొలాలు ఇస్తే ప్రస్తుతం రహదారుల పేరుతో నష్టం కలిగిస్తే ఒప్పుకునేది లేదన్నారు.

01/30/2016 - 05:18

హైదరాబాద్, జనవరి 29: న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తేవడంలో భాగంగా జాతీయ లిటిగేషన్ విధానానికి కేంద్రం తుది మెరుగులు దిద్దుతోంది. ఫిబ్రవరి రెండవ వారంలో దేశంలోని అన్ని రాష్ట్రాల హోం, న్యాయ శాఖల మంత్రుల సదస్సులో లిటిగేషన్ విధానాన్ని ఖరారు చేయనున్నారు. ఈ సదస్సుకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మంత్రులను ఆహ్వానించారు.

01/30/2016 - 05:16

సికింద్రాబాద్, జనవరి 29: తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి తెలుగుదేశం ఇక్కడే పుట్టింది. ఇక్కడే ఉంటుందని ఏపీ సిఎం, తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు ఉద్ఘాటించారు. 3నాకు ఇక్కడేం పని అని కొందరు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌తో నాకు 35 ఏళ్ల అనుబంధం. నా రాజకీయ జీవితమే ఇక్కడ మొదలైంది. నా మనసుకు హైదరాబాద్ ఎప్పుడూ దగ్గరగా ఉంటుంది. మీతోనే ఉంటాను.

01/30/2016 - 02:02

హైదరాబాద్, జనవరి 29: సామరస్య సమాజంలో సంఘర్షణ వాతావరణం సృష్టించాలని కొన్ని శక్తులు బలవంతపు ప్రయత్నం చేస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పార్టీలు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా దుయ్యబట్టారు.

01/30/2016 - 01:58

హైదరాబాద్, జనవరి 29: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నారు. కొత్త చీఫ్ సెక్రటరీగా ఎస్‌పి టక్కర్ నియామకానికి సిఎం చంద్రబాబు ఆమోద ముద్ర పడటంతోపాటు ఐవైఆర్ కృష్ణారావుకు కొత్త బాధ్యతలు అప్పగించారు. దేవాదాయ శాఖ అర్చకులు, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి చైర్మన్‌గా ఐవైఆర్ కృష్ణారావును నియమించారు. ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగుతారు.

01/29/2016 - 17:03

న్యూఢిల్లీ : అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను కేంద్రం సమర్థించుకుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనార్టీలో ఉందని అఫిడవిట్‌లో పేర్కొంది.

01/29/2016 - 16:46

హైదరాబాద్ : కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ మహానగరంగా రూపుదిద్దుకుందని ఆపార్టీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. ఆయన తార్నాకలోని కార్తీకరెడ్డి తరపున ప్రచారంలో పాల్గొన్నారు. మరోసారి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లంటూ జనాన్ని మోసం చేయటానికి టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తుందని, సోనియాగాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని ఆయన తెలిపారు.

01/29/2016 - 16:46

తిరువనంతపురం : కేరళ సీఎం ఉమెన్‌చాంద్‌కు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. సౌరఫలకల కుంభకోణంలో సీఎం ఉమెన్‌చాంద్‌పై వచ్చిన ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా త్రిశూల్ కోర్టు ఆదేశించింది. దీనిపై ఆయన చాంద్ హైకోర్టును ఆశ్రయించగా, కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది.

01/29/2016 - 14:19

హైదరాబాద్ : 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ను కలిశారు. భేటీ అనంతరం రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 'మా' సమస్యలపైనే కేటీఆర్ ను కలిసినట్లు చెప్పారు.

01/29/2016 - 14:06

హైదరాబాద్ : ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆయన శుక్రవారంనాడు విలేకరులతో మాట్లాడుతూ..గ్రేటర్‌లో గెలుపుపై టీఆర్‌ఎస్‌లో సమన్వయం లేదని అన్నారు. తండ్రీ కూతుళ్లు, కుమారుడు రోజుకు ఇన్ని సీట్లు గెలుస్తామని చెబుతున్నారని, ఆ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయని అన్నారు. టీడీపీ హయాంలోనే హైదరాబాద్‌లో నిరంతర విద్యుత్ సరఫరా జరిగిందని అన్నారు.

Pages