S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/28/2015 - 13:50

హైదరాబాద్ : హైదరాబాద్‌లో హెల్మెట్‌ను ధరించటం తప్పనిసరి చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. చైన్ స్నాచింగ్‌ల నేపథ్యంలో హెల్మెట్ ధారణ తప్పనిసరి చేయలేకపోతున్నామని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వ్యాఖ్యలపై హైకోర్టు అభ్యంతరం చెప్పింది. హెల్మెట్ ఖరీదు కంటే జరిమానా విధించాలని ఆదేశించింది.

12/28/2015 - 13:50

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ కేసు విచారణ హైకోర్టులో సోమవారంనాడు జరిగింది. ఆస్తుల వేలానికి సంబంధించి మూడు సంస్థల అర్హతను సంస్థ ఖారారు చేసినట్లు కమిటీకి కోర్టుకు తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 31వ తేదీకి వాయిదా వేసింది.

12/28/2015 - 08:05

సంగారెడ్డి, డిసెంబర్ 27: తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎబివిపి పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ అన్నారు. 33వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆదివారం గౌరీశంకర్ స్మారక అవార్డు ప్రదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

12/28/2015 - 07:11

వరదయ్యపాళెం, డిసెంబర్ 27: ‘నువ్వు నాకు నచ్చావ్’ అంటూ ఓ చైనా యువతి తెలుగబ్బాయిపై మనసు పారేసుకుంది. ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడానికి చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని కల్కి ఆశ్రమానికి జింగ్ జుంగ్ జాంగ్ (28) చైనాను నుంచి వచ్చింది.

12/28/2015 - 07:05

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి)లో ఖాళీగా ఉన్న ముగ్గురు కమిషనర్ల నియామకం విషయమై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత చేపట్టడం జరుగుతుందని ప్రభుత్వం తెలియజేసింది.

12/28/2015 - 06:42

విజయవాడ, డిసెంబర్ 27: అభ్యుదయ భావాలను దేశ వ్యాప్తంగా ప్రచారం చేయడం, సమాజం పట్ల, వ్యవస్థ పట్ల వ్యతిరేక ధోరణితో ఉన్న ప్రజల ఆలోచనా విధానంలో మార్పు కోసం అభ్యుదయ వేదిక తన వంతు ప్రయత్నం చేస్తోందని వేదిక జాతీయ మహాసభ తర్వాత ప్రొ.కెఎస్ చలం, అనిల్ రాజింవాలే, మర్ల విజయకుమార్ వెల్లడించారు. అఖిల భారత అభ్యుదయ వేదిక జాతీయ మహాసభ తర్వాత జాతీయస్థాయి వర్క్‌షాప్‌లు విజయవాడ ఐఎంఎ హాలులో మూడురోజులపాటు నిర్వహించారు.

12/28/2015 - 06:41

హైదరాబాద్, డిసెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జనవరి, జూలైలో ఇవ్వాల్సిన రెండు డిఏలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టియు) ఎపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

12/28/2015 - 06:40

ముంచంగిపుట్టు, డిసెంబర్ 27: ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలకు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో మళ్లీ జనరేటర్లు మొరాయించాయి. దీంతో ప్రాజెక్టులోని విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. గత కొద్ది రోజులుగా ఆరో నెంబరు జనరేటర్ మూలకు చేరగా ఆదివారం నాలుగో నెంబర్ జనరేటర్లో సాంకేతిక సమస్యలు తలెత్తి నిలిచిపోయింది.

12/28/2015 - 06:36

హైదరాబాద్, డిసెంబర్ 27: ఉగ్రవాదం విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని, హైదరాబాద్ విశ్వ నగరంగా ఎదగాలంటే శాంతి నెలకొనాల్సి ఉందని, ఉగ్రవాదాన్ని తుదముట్టించాల్సి ఉందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం ఆయన బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు.

12/28/2015 - 06:35

నరసాపురం, డిసెంబర్ 27: రాష్ట్రంలోని ఆరు నగరాలు, పట్టణాల్లో మంచినీటి వనరులను ప్రపంచ బ్యాంకు నిధులతో అభివృద్ధిచేయనున్నట్టు రాష్ట్ర పురపరిపాలన సంచాలకులు (డిఎంఎ) కె.కన్నబాబు తెలిపారు. రూ.1200 కోట్లతో ఈ అభివృద్ధి పనులు చేపడతామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

Pages