S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/28/2015 - 06:34

తిరుమల, డిసెంబర్ 27: తిరుమలలో లడ్డూ టోకెన్లను బ్లాక్‌లో విక్రయిస్తుండగా ఆదివారం టిటిడి విజిలెన్స్ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. శ్రీవారి భక్తులకు లడ్డూలందించే కౌంటర్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేసే బాలాజీ, మరో దళారి ప్రసాద్‌కుమార్ కలసి లడ్డూ టోకెన్లను బ్లాక్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

12/28/2015 - 06:15

అనంతపురం సిటీ, డిసెంబర్ 27: రాబోయే ఆరేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో భారీ అణు విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు బాబా ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) డైరెక్టర్ డా.శేఖర్‌బసు పేర్కొన్నారు. అనంతపురంలో ఆదివారం జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్శిటీ (జెఎన్‌టియూ) 7వ స్నాతకోత్సవం అట్టహాసంగా నిర్వహించారు.

12/28/2015 - 06:14

గుంటూరు, డిసెంబర్ 27: రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన మాస్టర్ ప్లాన్ ముసాయిదా ప్రకారం రాజధాని ప్రాంత పరిధిలోని 29 గ్రామాలను యధాతథంగా కొనసాగిస్తూనే జనసాంద్రత ప్రాంతాలుగా గుర్తించారు. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 25 రెవెన్యూ గ్రామాలు, 4 శివారు గ్రామాలు ఉన్న విషయం విదితమే.

12/28/2015 - 06:12

శ్రీకాకుళం, డిసెంబర్ 27: సముద్రతీరం వెంబడి గల గ్రామాల్లో గత మూడు రోజుల్లో రెండుసార్లు భూమి స్వల్పంగా కంపించింది. ఆదివారం మధ్యాహ్నం 1.48 గంటల సమయంలో భూమి కంపించిన తీవ్రత 3.48గా రిక్టర్ స్కేల్‌పై నమోదైనట్లు అధికారులు పేర్కొంటూ, ప్రమాదం కాదని సుస్పష్టం చేసారు.

12/28/2015 - 06:10

విజయపురిసౌత్, డిసెంబర్ 27: నాగార్జునసాగర్ జలాశయం నుండి ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా కృష్ణాడెల్టాకు విడుదల చేస్తున్న నీటిని ఆదివారం సాయంత్రం నిలుపుదల చేశారు. కృష్ణాడెల్టాలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో అధికారులు ఆరు టియంసిల నీటిని విడుదల చేయాలని జలవనరుల శాఖకు విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా కృష్ణాడెల్టాకు నీటి సరఫరా చేశారు.

12/28/2015 - 06:07

విజయవాడ, డిసెంబర్ 27: జపాన్ గవర్నర్ తకకాజు ఇషి, జపాన్ బృంద సభ్యులకు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవ నేపధ్యంలో అభివృద్ధిలో భాగస్వామ్యం ద్వారా మార్గదర్శకంగా నిలిచే దిశలో విధంగా టొయామా ప్రిఫెక్చర్ జపాన్ గవర్నర్ బృందం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రావడం జరిగింది.

12/28/2015 - 06:01

ఒంగోలు, డిసెంబర్ 27: వచ్చే జనవరి 1వ తేది నుండి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యపరమైన సంస్కరణలు తీసుకొస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు.

12/28/2015 - 06:00

విశాఖపట్నం, డిసెంబర్ 27: విశాఖలో కాల్ మనీ వ్యాపారులపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. గాజువాకలో ఇద్దరు కాల్ మనీ వ్యాపారులు ఒకరికి రుణాన్ని ఇచ్చి, అత్యంత విలువైన అతని ఆస్తిని చేజిక్కించుకునేందుకు సిద్ధపడ్డారన్న ఫిర్యాదులు అందడంతో పోలీసులు ఆదివారం అతని ఇళ్ళపై ఆకస్మిక దాడులు జరిపి, అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

12/28/2015 - 05:50

హైదరాబాద్, డిసెంబర్ 27: దేశం లో యువతకు విస్తృతంగా ఉ ద్యోగావకాశాలు కల్పించే దిశగా కొత్త ఆర్థిక రంగాన్ని సృష్టించాలని, సమీకృతాభివృద్ధిని సాధించాలంటే అధిక సంఖ్య లో ఉద్యోగాలు లభించాలని భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆర్థికవేత్తలకు పిలుపునిచ్చారు.

12/28/2015 - 05:43

హైదరాబాద్, డిసెంబర్ 27: దేశంలో తరచూ అరెస్టవుతున్న ఉగ్రవాద సానుభూతిపరులకు హైదరాబాద్‌తో సంబంధాలు ఉన్నట్టు విచారణలో తేలడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటివరకూ అరెస్టయిన ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులు, ఉగ్రవాద భావజాలం ప్రేరేపితుల్లో హైదరాబాద్‌కు చెందిన వారే ఎక్కువ.

Pages