S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/28/2018 - 04:55

విజయవాడ, ఆగస్టు 27: అవినీతికి అస్కారం లేకుండా నిస్వార్థంగా పని చేసే వారు ఎవరైనా ఉన్నారా అంటే అది ఉపాధ్యాయులేనని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించి కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. గురువులతో ఎవరు పెట్టుకున్నా వారు తక్షణం తగు ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు.

08/28/2018 - 04:57

* బాంబే స్టాక్ ఎక్స్ఛేంజిలో అమరావతి బాండ్ల లిస్టింగ్ ప్రారంభం

08/28/2018 - 02:40

కాకినాడ, ఆగస్టు 27: జాతీయ రహదారుల విస్తరణ ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున జరగడం, కొత్తగా రహదారుల నిర్మాణాలకు ప్రభుత్వ యంత్రాంగం సన్నాహాలు చేస్తుండంతో తూర్పు గోదావరి జిల్లాలో ఆయా ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. మూడు, నాలుగు సంవత్సరాల క్రితం ఎకరం రూ.10నుండి 15 లక్షల రూపాయల ధర పలికిన భూములు ఇపుడు కోట్లు పలుకుతున్నాయి.

08/28/2018 - 05:24

అచ్యుతాపురం, ఆగస్టు 27: వైసీపీ అధికారంలోకి వస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల గురించి, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మాట్లాడిన ఆయన రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి పట్టం కడితే అన్ని సమస్యలు తీరిపోతాయని, ప్రజల కన్న కలలను నెరవేరుస్తామని చెప్పారు.

08/28/2018 - 04:58

హైదరాబాద్, ఆగస్టు 27: రాష్ట్ర శాసనసభకు ముందస్తు ఎన్నికల సైరన్ మోగే అవకాశం ఉన్నందున ఎదుర్కోవడానికి రాష్ట్ర కాంగ్రెస్ సిద్ధమవుతోంది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగే పార్టీ ముఖ్యనేతల సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సీ కుంతియా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

08/28/2018 - 05:22

చార్మినార్, ఆగస్టు 27: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలన్నీ కాగితాలకే పరిమితం చేస్తూ, వారి వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు.

08/28/2018 - 02:17

* త్వరలో మంత్రి మండలి కీలక భేటీ * కార్యదర్శులకు సర్క్యులర్ జారీ

08/28/2018 - 01:41

మధురై, ఆగస్టు 27: తమిళనాడులో కరుణానిధి మృతితో ఏర్పడ్డ డిఎంకె అధ్యక్ష స్థానాన్ని ఆయన చిన్నకుమారుడు స్టాలిన్ అధిరోహించడం అంతా లాంఛనమే అని అనుకుంటున్న తరుణంలో కరుణానిధి పెద్దకుమారుడు అళగిరి వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పార్టీ నుంచి వెళ్లగొట్టిన తనను తిరిగి చేర్చుకోవాలని, లేకపోతే తాను సెప్టెంబర్ ఐదున బహిరంగ సభను తప్పకుండా నిర్వహించి తీరుతానని అళగిరి హెచ్చరించాడు.

08/27/2018 - 22:43

హైదరాబాద్: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఇప్పటికే పనిచేస్తున్న 898 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను 2018-19 విద్యాసంవత్సరంలో కూడా కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు సోమవారం జీఓ (ఆర్‌టీ నెంబర్ 208) జారీ చేశారు. అలాగే డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న 323 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను కూడా మరో ఏడాది పాటు కొనసాగించేందుకు అనుమతిచ్చారు. ఇందుకు సంబంధించి మరో జీఓ (ఆర్‌టి నెంబర్ 206) జారీ చేశారు.

08/28/2018 - 03:17

హైదరాబాద్: ముప్పవరపు వెంకయ్య నాయుడు భారత ఉపరాష్టప్రతిగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది గడిచిన సందర్భంగా హైదరాబాద్‌లో ‘ఆత్మీయ సమావేశం’ మంగళవారం జరుగుతోంది. ‘ఉపరాష్టప్రతితో ఉపాహారం’ పేరుతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. కొండాపూర్ (హైదరాబాద్) లోని హైటెక్స్ రోడ్డులో ఉన్న సైబర్ కనె్వన్షన్స్‌లో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

Pages