S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/26/2018 - 00:44

విశాఖపట్నం, ఆగస్టు 25: వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ను ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరం కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

08/26/2018 - 04:54

కడప, ఆగస్టు 25: ‘రాష్ట్రంలోని ఐదు నదులను అనుసంధానం చేస్తాం, ఒక్క గోదావరి నుంచే 15 లక్షల క్యూసెక్కులు అంటే 150 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. భవిష్యత్‌లో ఈ నీటినంతా వినియోగిస్తాం. పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశాం. గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేయబోతున్నాం.

08/26/2018 - 00:41

అమరావతి, ఆగస్టు 25: వర్గశత్రు నిర్మూలన దృక్పథంతో మార్క్సిజం, లెనినిజం, మావోయిజం సైద్ధాంతిక పునాదిపై నక్సల్బరీ పోరాట స్ఫూర్తితో ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఆత్మరక్షణలో పడింది. భూ స్వామ్య..పెత్తందారీ..పెట్టుబడిదారీ వ్యతిరేక ఉద్యమాలతో పీడిత ప్రజలను జాగృతం చేసి ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు నడిపే దశకు చేరుకున్న ఉద్యమం ఇప్పుడు చుక్కాని లేని నావలా పయనిస్తోంది.

08/26/2018 - 00:39

రాజమహేంద్రవరం, ఆగస్టు 25: గోదావరి నదికి వరదలు కొత్తకాదు..గోదావరి వరద చరిత్రలో ఎన్నో అనుభవాలు లంక గ్రామాల వాసులు తరతరాలుగా చవిచూశారు. 1986లో వచ్చిన వరదలే ప్రామాణికంగా ఏటిగట్లను పటిష్టపర్చారు. అయితే సక్రమ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఏటిగట్లు అక్కడకక్కడా బలహీనపడ్డాయి. ఫలితంగా, ఏటిగట్ల పరీవాహ లంక గ్రామాలు వరదల సమయంలో వణికిపోతున్నాయి. ప్రజలు ప్రాణాలరచేత పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి పోతున్నారు.

08/26/2018 - 04:52

హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో ఓ స్వచ్చంద సంస్థ చేపట్టిన సర్వే ఉద్రిక్తతకు దారితీసింది. అధికార పార్టీకి చెందినదిగా భావిస్తున్న స్పార్క్ సంస్థ ప్రతినిధులు గత మూడు రోజులుగా హిందూపురంలో ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నారు. కొంతమంది ఎంపిక చేసిన యువకులకు ఓ ప్రశ్నావళిని ఇచ్చి ప్రజల అభిప్రాయాలు సేకరిస్తున్నారు.

08/26/2018 - 00:31

కర్నూలు, ఆగస్టు 25: రాష్ట్రాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చి నాలుగేళ్లు వారి వెంట తిప్పుకుని చివరకు నమ్మించి మోసం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలులో శనివారం నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో మాట్లాడిన ఆయన తమను నమ్మించి నట్టేట ముంచిన కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీపై ధర్మపోరాటం చేయడాన్ని సమర్ధించుకున్నారు.

08/25/2018 - 04:45

అమరావతి: తెలుగు భాషకు ప్రపంచ గుర్తింపు తీసుకువచ్చేందుకు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటుచేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తెలుగు భాషాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, కార్యదర్శి ఎంకె మీనా, డైరెక్టర్ విజయభాస్కర్‌తో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

08/25/2018 - 04:03

రేణిగుంట, ఆగస్టు 24: దక్షిణ మధ్య రైల్వే మొదటిసారిగా రేణిగుంట నుంచి పార్శిల్ కార్గో ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను శుక్రవారం నుండి ప్రారంభించింది. ఈ సందర్భంగా రైల్వే కమర్షియల్ ఇన్స్‌పెక్టర్ సాధిక్‌బాషా మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వేస్‌లో మొదటిసారిగా రేణిగుంట నుంచి అసోం రాష్ట్రంలోని గౌహతి వరకు కార్గో ఎక్స్‌ప్రెస్ సర్వీసును ప్రారంభించినట్లు తెలిపారు.

08/25/2018 - 04:02

విజయవాడ, ఆగస్టు 24: విశాఖ రైల్వేజంక్షన్‌లో పెరుగుతున్న రైళ్ల రాకపోకల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణమధ్య రైల్వే అధికారులు కాచిగూడ-టాటానగర్ మధ్య వారానికోసారి నడిచే ప్రత్యేక రైళ్లకు సింహాచలం నార్త్ స్టేషన్‌లో ‘హాల్ట్’ సౌకర్యం కల్పిస్తున్నారు. కాచిగూడ నుంచి బయలుదేరే రైలు నెం.07438 ఇక సింహాచలం నార్త్ స్టేషన్‌కు తెల్లవారుజామున 1.30కు చేరుకుని తిరిగి 1.31 నిమిషాలకు బయలుదేరుతుంది.

08/25/2018 - 03:47

హైదరాబాద్, ఆగస్టు 24: సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల్లో 27 బోనస్) శాతాన్ని ఈనెల 29న రూ.327 కోట్ల రూపాయలను కార్మిక, ఉద్యోగులకు చెల్లిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు సంస్థ సిఎండి శ్రీ్ధర్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల సింగరేణి ఉద్యోగ, కార్మికులు తమకు రావాల్సిన లాభాల్లో వాటా గురించి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు వినతి పత్రాన్ని అందజేశారు.

Pages