S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/27/2018 - 22:21

హైదరాబాద్, ఆగస్టు 27: పామాయిల్‌కు గిట్టుబాటు ధర కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి కేంద్రప్రభుత్వాన్ని కోరారు. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్ (సీఏసీపీ) కార్యదర్శి శైలజ శర్మతో సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పామ్ ఆయిల్ పంటకు అయ్యే పెట్టుబడిపై మరో 30 శాతం కలిపి పామాయిల్ ధరను నిర్ణయించాలని సూచించారు.

08/27/2018 - 22:17

హైదరాబాద్, ఆగస్టు 27: మెడికల్ కౌన్సిలింగ్‌పై సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కృష్ణయ్య సోమవారం ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు. మెడికల్ కౌన్సిలింగ్‌లో జివో 550ను యధాతథంగా అమలు చేయాలని సుప్రీం తీర్పు ఇవ్వడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

08/27/2018 - 12:53

హైదరాబాద్: 11 ఏళ్ల క్రీతం నగరంలో జరిగిన జంట పేలుళ్ల కేసు తీర్పును నాంపల్లి ఎన్ఐఏ కోర్టు వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది. గోకుల్ చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ల నిందితుల్లో ఐదుగురిని భద్రతా కారణాల దృష్ట్యా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టారు. అయితే తుది తీర్పు వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.

08/27/2018 - 02:36

జడ్చర్ల, ఆగస్టు 26: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

08/27/2018 - 02:36

సిద్దిపేట, ఆగస్టు 26 : తెలంగాణ సర్కార్ రైతులను ధీమాగా ఉంచేందుకు రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. సీఎం కేసీఆర్ స్వయంగా రైతుబిడ్డ అని.. రైతుల కష్ట, నష్టాలు తెలుసన్నారు. తెలంగాణ సర్కార్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రతి అడుగు రైతు సంక్షేమం కోసమేనని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.

08/27/2018 - 02:35

సూర్యాపేట, ఆగస్టు 26: కేసీఆర్ ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల పాలన కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిక హామీలతో పాటు, ప్రజల అవసరాలకు అనుగుణంగా పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు.

08/27/2018 - 01:26

తిరుపతి, ఆగస్టు 26: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు టీటీడీ ఘనంగా నిర్వహించింది. సెప్టెంబర్ 13 నుంచి 21వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 10 నుంచి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

08/27/2018 - 01:20

తిరుపతి, ఆగస్టు 26: తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 13 నుంచి 21వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోర్ 10 నుంచి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఏడాది అధికమాసం ఉన్న కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల సమయంలో టీటీడీ స్వల్ప మార్పులు చేపట్టింది.

08/27/2018 - 01:05

హైదరాబాద్, ఆగస్టు 26: ముందస్తు ఎన్నికలున్నా, లేకపోయినా వచ్చే ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను సెప్టెంబర్‌లో ప్రకటించనున్నట్టు టీఆర్‌ఎస్ హడావుడి చేస్తున్నది. అయితే, తొలి విడతగా కేవలం పాతిక మంది అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తుందంటే ఆశ్చర్యం కలిగించే వాస్తవం.

08/27/2018 - 01:07

హైదరాబాద్: ముందస్తు ఎన్నికలపై వారం రోజుల్లో స్పష్టత వస్తుందని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ముందస్తుకు వెళ్లడం ద్వారా తాము అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటే ప్రతిపక్ష పార్టీలు సంతోషించాలి కానీ ఎందుకు భయపడుతున్నాయని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని చెప్పే ఆ పార్టీలు ఎన్నికలంటే ఎందుకు వెనుకంజ వేస్తున్నాయని నిలదీశారు.

Pages