S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/09/2018 - 13:33

విజయవాడ: మల్టీప్లెక్స్‌లలో అధిక ధరలకు తినుబండారాలు, శీతలపానియాల విక్రయంపై జిల్లా వినియోగదారుల ఫోరం సంచలన తీర్పునిచ్చింది. ఆయా థియేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎమ్మార్పీ రేట్లను పెంచి భారీగా అక్రమ లాభాలను ఆర్జించారని నమ్ముతూ.. వినియోగదారులకు నష్టం కలిగించినందుకు రూ. 5 లక్షల జరిమానా విధించింది.

08/09/2018 - 13:39

హైదరాబాద్: నగరంలో హైటెక్ సిటీ సమీపంలో దేశంలోనే మొట్టమొదటి ఐకియ షోరూమ్‌ను గురువారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు. దాదాపు 2వేల మందికి ప్రత్యక్షంగా, 3వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు.

08/09/2018 - 12:53

అమరావతి: మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి తనయుడు, బీజేపీ నేత నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డిపై బహిష్కరణ వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ రాంకుమార్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ నిర్ణయం తీసుకున్నారు.

08/09/2018 - 12:35

విజయవాడ: నగరంలోని కొత్తపేటలో ఎంబీబీఎస్ విద్యార్థిని హిమాజ పరీక్షలు సరిగా రాయలేదనే మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సిద్దార్థ మెడికల్ కాలేజీలో హిమజ ఎంబీబీఎస్ థర్డ్‌ ఇయర్‌ చదువుతోంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

08/09/2018 - 06:35

హైదరాబాద్, ఆగస్టు 8: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 15 న ప్రారంభిస్తున్న ‘కంటి వెలుగు’ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా పాల్గొనాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి పిలుపు ఇచ్చారు. పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల అధ్యక్షులు తప్పని సరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రజాప్రతినిధులందరికీ బహిరంగ లేఖ రాశారు.

08/09/2018 - 01:57

రౌతులపూడి, ఆగస్టు 8: రానున్న రోజుల్లో ప్రజాసమస్యలన్నీ పూర్తిగా పరిష్కరిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర సాగిస్తున్న జగన్ బుధవారం రౌతులపూడి మండలంలో పాదయాత్ర కొనసాగించారు. వర్షం కారణంగా మధ్యాహ్నం 1.30 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు.

08/09/2018 - 05:08

విజయవాడ, ఆగస్టు 8: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా, ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. రాష్ట్రంలో సగటు వర్షపాతం కన్నా దాదాపు 16 శాతం తక్కువగా నమోదు కావడంతో ఆరు జిల్లాల్లో కరవుఛాయలు నెలకొన్నాయి. వర్షాలు లేక వివిధ పంట సాగు విస్తీర్ణం కూడా 42 శాతానికే పరిమితమయింది. రాష్ట్రంలో ఈ ఏడాది గతం కన్నా ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి.

08/09/2018 - 01:53

విశాఖపట్నం, ఆగస్టు 8: విశాఖ ఏజెన్సీలోని బాక్సైట్ తవ్వకాలు జరిపి, నాల్కో కంపెనీకి ఇవ్వాలన్న ఆలోచన ఉన్నట్టు కేంద్రం ప్రకటించడం విశాఖ ఏజెన్సీలో కలకలం రేపుతోంది. చాలాకాలంగా బాక్సైట్ తవ్వకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనం పాటించి, ఇప్పుడు మళ్లీ బాక్సైట్ వైపు దృష్టి మరల్చడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

08/09/2018 - 01:51

అమరావతి, ఆగస్టు 8: సంతోషమే సగం బలమని, సంతోషానికి మన రాష్ట్రం చిరునామా కావాలని, గ్రామదర్శిని ఓ పవిత్ర కార్యక్రమంగా భావించి అధికారులు అంకితభావంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. మంగళగిరి సికె కనె్వన్షన్‌లో బుధవారం రాష్టస్థ్రాయి గ్రామదర్శిని నోడల్ అధికారుల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సీఎంగా పనిచేసే అవకాశం నాకు వచ్చిం ది..

08/09/2018 - 05:11

అమరావతి, ఆగస్టు 8: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పెట్టుబడులకు జపాన్ ముందుకొచ్చింది. ఇందు లో భాగంగా జపాన్ రాయబారి బుధవారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సీఎం నివాసంలో భేటీ అయ్యారు. జపాన్ రాయబారి కెంజి హిరమట్సు, ప్రతినిధుల బృందం అమరావతిలో అపారమైన అవకాశాల గురించి చర్చించారు.

Pages