S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/29/2018 - 01:46

కర్నూలు, జూలై 28: శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ 150 టీఎంసీలు దాటింది. జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నీటి నిల్వ పూర్తి స్థాయికి చేరుకుంటుందన్న అంచనాలు బలపడుతున్నాయి. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను శనివారం సాయంత్రానికి 872.40 అడుగులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు గాను 151.87 టిఎంసీల నీరు నిల్వ ఉంది.

07/29/2018 - 01:35

విజయవాడ, జూలై 28: ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ పేరిట ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు ఏర్పాటు చేసిన శ్రీమతి మాలతీ చందూర్ పురస్కారాన్ని ఈ దఫా ప్రముఖ కథా, నవలా రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవికి ప్రకటించారు.

07/29/2018 - 01:31

కడప, జూలై 28: ఇనే్నళ్లూ వరదలతో పంటలను ముంచెత్తి, కడప జిల్లా రైతులకు కన్నీళ్లు మిగిల్చి సోమశిలకు తరలిపోతున్న కుందూనదికి అడ్డుకట్ట వేసేందుకు ఉద్యమం మొదలైంది. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరి కోసం 365 రోజులు రిలే నిరాహారదీక్షలు చేసి రికార్డు సృష్టించిన రాయలసీమ కమ్యూనిస్టుపార్టీ ఈ ఉద్యమానికి తొలి అడుగు వేసింది.

07/29/2018 - 01:26

హైదరాబాద్, జూలై 28: రాయబారి, సీనియర్ సివిల్ సర్వీసు అధికారి పిఎన్ హక్సర్ అత్యంత సంక్షుభిత సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి సైద్ధాంతిక మార్గదర్శకుడిగా, నైతికి దిక్సూచిగా నిలిచారని కాంగ్రెస్ సీనియర్ నేత, ‘ ఇంటర్‌ట్విన్‌డ్ లైఫ్స్: పీఎస్ హక్సర్- ఇందిరాగాంధీ ’ పుస్తక రచయిత జైరాం రమేష్ వ్యాఖ్యానించారు.

07/29/2018 - 01:24

హైదరాబాద్, జూలై 28: మరో బృహత్తర పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో దేశం మొత్తంలో శభాష్ అనిపించుకున్న తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని కాలేజీ విద్యార్థులకు కూడా వర్తింపచేయడానికి సిద్ధమవుతోంది.

07/29/2018 - 04:16

నాగార్జునసాగర్, జూలై 28: నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి నీటి రాక ప్రారంభమైంది. కృష్ణానది యాజమాన్య బోర్డు ఉత్తర్వుల మేరకు శ్రీశైలం డ్యాం నుండి నాగార్జునసాగర్ డ్యాంకు రోజుకు 2 టీఎంసీల నీరు శనివారం నుండి విడుదల చేయాలని ఆదేశించడంతో శ్రీశైలంలో విద్యుతుత్పత్తి కేంద్రం ద్వారా నీటి విడుదల జరగుతోంది.

07/29/2018 - 01:18

హైదరాబాద్, జూలై 28: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. పార్టీ బలోపేతానికి సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవాలని నేతలకు ఆయన సూచించారు. శనివారం గాంధీభవన్‌లో శక్తి యాప్‌పై సమీక్ష నిర్వహించారు.

07/29/2018 - 01:15

హైదరాబాద్, జూలై 28: విద్యుత్ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమ్మెపై జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీనితో సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక నేతలు చెప్పారు. శనివారం రాత్రి విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డితో యూనియన్ నేతలు సాయిలు, శివశంకర్ కార్మికుల డిమాండ్‌లపై జరిగిన చర్చల్లో సయోధ్య కుదరడంతో సమ్మె విరమిస్తున్నట్లు వారు తెలిపారు.

07/29/2018 - 02:39

హైదరాబాద్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తాజాగా రూ.168 కోట్లు విడుదల చేసింది. 2017-18 చివరి మూడు నెలలకు, 2018-19 మొదటి మూడు నెలలకు కలిపి నిధులను విడుదల చేశారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.120 లక్షలు కేటాయించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వయంగా ఖర్చు చేసేందుకు నియోజకవర్గాల అభివృద్ధి నిధులను ప్రభుత్వం గతంలోనే మంజూరు చేసింది.

07/29/2018 - 00:44

జగ్గంపేట, జూలై 28: ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్ల పరిపాలనలో రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా లేరని, కేవలం ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్లు, కార్యకర్తలు మాత్రమే సంతోషంగా ఉన్నారని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర రాష్ట్రంలో 99 నియోజకవర్గాలు పూర్తి చేసుకుని 100వ నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలోకి ప్రవేశించింది.

Pages