S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/28/2018 - 01:29

హైదరాబాద్, జూలై 27: ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు వరాలు ప్రకటించడం అనవాయితీ. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాజకీయ పార్టీలకు కూడా వరాలు ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ప్రతి జిల్లా కేంద్రంలో వంద రూపాయలకు గజం చొప్పున ఎకరం భూమి కేటాయిస్తూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. అలాగే రాజకీయ పార్టీల కార్యాలయాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది.

07/28/2018 - 01:43

తిరుపతి, జూలై 27: చంద్రగ్రహణం కారణంగా శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. శుక్రవారం రాత్రి 11.54 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై శనివారం తెల్లవారు జామున 3.49 గంటలకు ముగుస్తుంది. గ్రహణం సందర్భంగా సాయంత్రం ఆలయాన్ని మూసివేసిన టీటీడీ అధికారులు శనివారం ఉ. 4.15 గంటలకు సుప్రభాత సేవ, నిత్యార్చన, శుద్ధి కార్యక్రమాల అనంతరం ఆలయ మహాద్వారం తలుపులు తెరుస్తారు.

07/28/2018 - 00:46

భీమవరం, జూలై 27: ప్రశ్నించే స్థాయి నుండి తమ పార్టీ పాలించే స్థాయికి ఎదుగుతోందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల నుండి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో పవన్ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు.

07/28/2018 - 00:42

అమరావతి, జూలై 27: విభజన చట్టప్రకారం రాష్ట్రానికి రావాల్సినవి కేటాయించకుండా, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా విస్మరించడం యూటర్న్ తీసుకోవటం కాదా అని కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్దఎత్తున కేటాయింపులు జరుపుతూ మరోవైపు విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునే విషయంలో వివక్ష ప్రదర్శించటమే ఇందుకు నిదర్శనమన్నారు.

07/28/2018 - 00:53

కర్నూలు: విభజన కారణంగా ప్రజాగ్రహానికి గురైన కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఊపిరిపోసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ కథ కంచికే అన్న భావన ఏర్పడిన తరుణంలో ప్రత్యేక హోదాపై రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి చూపడంతో దీన్ని అవకాశంగా తీసుకుని బలపడేందుకు కసరత్తు ముమ్మరం చేసింది.

07/28/2018 - 00:54

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల మంచినీటి అవసరాలకు కృష్ణానది నీటి విడుదలకు యాజమాన్య బోర్డు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు 30 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 25 టీఎంసీల నీటిని కేటాయించినట్టు బోర్డు జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొంది. అలాగే శ్రీశైలం జలాశయం నుంచి శనివారం నుంచి (జూలై 28) ఆగస్టు 22 వరకు 26 రోజుల పాటు రోజుకు 2 టీఎంసీల నీరు విడుదలకు బోర్డు అనుమతించింది.

07/28/2018 - 01:02

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నాలుగేళ్లు కావస్తున్నా పలు శాఖలు చట్టాలు మార్చుకోకపోవడంతో రానున్న రోజుల్లో న్యాయవివాదాలు చెలరేగే పరిస్థితి ఉందని న్యాయశాఖ ఆదేశించింది. తక్షణమే తమ తమ శాఖల పరిధిలోని చట్టాలను మార్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా విద్యాశాఖ ఆధీనంలోని పలు సొసైటీలు, యూనివర్శిటీలు వేర్వేరు చట్టాలను రూపొందించుకోవల్సి ఉంది.

07/28/2018 - 00:52

అమరావతి: ఎట్టకేలకు లారీ ఓనర్స్ అసోసియేషన్ యజమానులు సమ్మె విరమిచారు. కేంద్రప్రభుత్వంతో లారీ యజమానుల అసోసియేషన్ జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించాలని నిర్ణయించినట్లు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వర్‌రావు తెలిపారు. తమ సమస్యల కోసం దేశవ్యాప్తంగా లారీ యజమానులు గత వారంరోజులుగా సమ్మె చేపట్టిన విషయం విదితమే.

07/28/2018 - 00:56

హైదరాబాద్: బీజేపీతో జత కట్టి ఏమి సాధించారని ఆంధ్ర ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ఇంత కాలం చంద్రబాబు నాయుడు, జత కట్టగా, ఇప్పుడు వైఎస్ జగన్ జత కట్టారని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. వీరిరువురూ ఏమి సాధించారని ఆయన ప్రశ్నించారు.

07/27/2018 - 04:57

బాసర: సంపూర్ణ చంద్రగ్రహణంను పురస్కరించుకుని 27వ తేదీ శుక్రవారం రోజు మధ్యాహ్నం 12.50 గంటలకు శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంతోపాటు పలు ఉప ఆలయాలను సైతం మూసివేయనున్నట్లు ఆలయ ప్రత్యేకాధికారి ఏ.సుధాకర్‌రెడ్డి తెలిపారు.

Pages