S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/04/2018 - 00:30

ఏలూరు, జూన్ 3: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించటమే తన లక్ష్యమని, అందుకే తమ పార్టీ ఎంపీలు ఏనాడో రాజీనామా చేశారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

06/04/2018 - 00:22

కర్నూలు, జూన్ 3: నవ్యాంధ్రప్రదేశ్‌ను కరవురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా రెండవ రోజు ఆదివారం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో గ్రామసభ నిర్వహించి ‘నీరు-ప్రగతి, కరవు రహిత రాష్ట్రం’ అంశంపై గ్రామస్థులతో చర్చించారు. అలాగే గ్రామంలోని బీసీ, ఎస్సీ కాలనీల్లో ప్రజల ఇళ్లకు వెళ్లి వారితో కొద్దిసేపు మాట్లాడారు.

06/03/2018 - 04:34

విజయవాడ: అమరావతిలో అవయవ మార్పిడి (ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్) ఆసుపత్రి నిర్మాణానికి ప్రపంచ ప్రఖ్యాత వైద్యులు మహమద్ రేలా ముందుకు వచ్చారు. ప్రపంచంలో మేటి అవయవ మార్పిడి నిపుణుడు, భారత్ యూనివర్సిటీ చాన్స్‌లర్ మహమద్ రేలా శనివారం సాయంత్రం ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలిశారు.

06/03/2018 - 03:24

హైదరాబాద్, జూన్ 2: ఎమ్సె ట్ సర్ట్ఫికెట్ల పరిశీలనకు శనివారం నాడు 8715 మంది హాజరయ్యారు. 1వ ర్యాంకు నుండి 68,000 ర్యాంకు వరకూ 43,354 మంది హాజరుకాగా, 68001 నుండి 82వేల ర్యాంకు వరకూ 8715 మంది హాజరయ్యారు. దీంతో శనివారం రాత్రి వరకూ సర్ట్ఫికెట్ల పరిశీలనకు 52,069 మంది హాజరయ్యారని అడ్మిషన్ల కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.

06/03/2018 - 02:13

పాల్వంచ, జూన్ 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నిర్మాణంలో ఉన్న కేటీపీఎస్ 7వ దశ కర్మాగారం స్విచ్ యార్డ్‌లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లో శనివారం రాత్రి ఒక్కసారిగా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. అధిక ఉష్ణోగ్రత కారణంగా ట్రాన్స్‌ఫార్మర్‌లో ఉన్న ఆయిల్ బయటికి రావడంతో ఈ ప్రమాదం జరిగింది. సుమారు రూ.5 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని సీఈ సమ్మయ్య విలేఖరులకు తెలిపారు.

06/03/2018 - 02:11

విశాఖపట్నం, జూన్ 2: మరో కొత్త రైలు పట్టాలెక్కబోతోంది. సంత్రగచ్చి- చెన్నై సెంట్రల్ స్టేషన్ల మధ్య అంత్యోదయ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఈనెల 4న హౌరాలో ప్రారంభం కానుంది. 02841 నెంబర్‌తో ప్రతి సోమవారం సంత్రగచ్చి నుంచి, ప్రతి బుధవారం చెన్నై సెంట్రల్ నుంచి ఈ రైలు బయలుదేరుతుంది.

06/03/2018 - 01:29

శ్రీశైలం ప్రాజెక్టు, జూన్ 2: ఈగలపెంట భూగర్భ పవర్ హౌస్ సమీపంలోని రోడ్డు మలుపువద్ద శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి కొండ చరియలు విరిగిపడి హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై నాలుగు గంటలకుపైగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శనివారం అర్ధరాత్రి నుంచి ప్రాజెక్టు పరిసర ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది.

06/03/2018 - 01:26

యాదగిరిగుట్ట, జూన్ 2: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం ఉదయం అర్చనలు, అష్టోత్తరాలు, నిత్య కల్యాణోత్సవాలు, వెండి జోడి సేవలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి. స్వామి వారి దర్శనాలు, వివిధ పూజల్లో పాల్గొనేందుకు వచ్చిన భక్తులతో కొండ కిటకిటలాడింది. దేవస్థానం ఒక్కరోజు ఆదాయం రూ.16లక్షల 41,941 సమకూరింది. వేకువ జామున సుప్రభాతంతో స్వామి అమ్మవార్లను మేల్కొలిపి హారతులు నిర్వహించారు.

06/03/2018 - 01:19

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టిన నాలుగేళ్లలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు కుటుంబ సభ్యులు మాత్రమే బాగుపడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా శనివారం గాంధీ భవన్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

06/03/2018 - 01:13

హైదరాబాద్, జూన్ 2: సాంప్రదాయ పద్ధతిలో సాగుతున్న వ్యవసాయాన్ని యాంత్రీకరణ విధానంలోకి తేవాలని సీఎం కే.చంద్రశేఖర్ రావు సూచించారు. శనివారం ప్రగతి భవన్‌లో వ్యవసాయ అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.

Pages