S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/03/2018 - 01:10

హైదరాబాద్, జూన్ 2: మహాత్మాగాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పేరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, గ్రామ స్వరాజ్యం స్థాపించడంలో భాగంగా కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకువచ్చామన్నారు. గ్రామ పంచాయతీలకు పూర్తిస్థాయి అధికారాలను ఇచ్చామన్నారు.

06/03/2018 - 01:10

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణలో 2886 పోస్టల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా గ్రూప్-4 సహా పలు నోటిఫికేషన్లను పబ్లిక్ సర్వీసు కమిషన్ విడుదల చేసింది. 1521 పోస్టులకు గ్రూప్-4 నోటిఫికేషన్ సహా 700 పోస్టులకు వీఆర్వో, ఆర్టీసీలో 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు, 19 సీనియర్ స్టెనో ఉద్యోగాలకు, 474 మండల ప్లానింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్లను జారీ చేసింది.

06/03/2018 - 01:09

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణను దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు (కేసీఆర్) ప్రకటించారు. రాష్ట్ర నాలుగో అవతరణ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్‌గ్రౌండ్స్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ బంగారు తెలంగాణ దిశగా గత నాలుగేళ్ల నుండి బలమైన అడుగులు వేశామన్నారు. సమైక్యరాష్ట్రంలో తెలంగాణ తీవ్రమైన అణచివేత, దోపిడీకి గురైందని గుర్తు చేశారు.

06/03/2018 - 00:59

చీపురుపల్లి, జూన్ 2: నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో అవినీతికి చట్టబద్ధత కల్పించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే సాధ్యమైందని జనసేన నేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని మూడురోడ్ల జంక్షన్ వద్ద శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

06/03/2018 - 00:57

ఏలూరు, జూన్ 2: పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర శనివారం నల్ల కండువాలతో సాగింది. రాష్ట్ర విభజన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన నవనిర్మాణ దీక్షకు వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ వంచనపై గర్జన దీక్ష చేపట్టింది.

06/03/2018 - 00:54

విజయవాడ, జూన్ 2: ప్రధాని నరేంద్ర మోదీ అంతటి నమ్మకద్రోహి, పచ్చి అబద్ధాలకోరు ఈ దేశంలో ఎవరూ ఉండబోరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. నిత్యం దేవుళ్లను ఆరాధించే బీజేపీకి ప్రాతినిధ్యం వహించే మోదీ తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను సైతం ఉల్లంఘిస్తూ పచ్చి అబద్ధాలు ఆడుతున్నందుకు వచ్చే జన్మలో కాకుండా, ఈ జన్మలోనే తగిన శిక్ష అనుభవిస్తారని పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు.

06/02/2018 - 17:58

నాగర్ కర్నూల్ : నల్లమల అటవీ ప్రాంతంలో ఇవాళ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. శ్రీశైలం ఘాట్ రోడ్డులో పాతాళ గంగా వద్ద వర్షానికి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వర్షాల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు.

06/02/2018 - 16:58

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ తమ అధికార నివాసాలను శనివారంనాడు ఖాళీ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అధికార నివాసాలను ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రుల నివాసాలను ఖాళీ చేయమనడాన్ని తండ్రీకొడుకులిద్దరూ సుప్రీం కోర్టులో సవాల్ చేసిన విషయం విదితమే.

06/02/2018 - 16:58

కొమరంభీం: రెబ్బన మండలం సోనాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. కల్వర్ట్‌పై నుంచి వాహనం బోల్తాపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. వాహనం సింగరేణ ఓపెన్‌కాస్ట్ పనులు నిర్వహించేదిగా అధికారులు గుర్తించారు.

06/02/2018 - 16:57

విజయనగరం: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం రావాలి. వలసలు ఆగాల్సిన అవసరం ఏర్పడిందని జనసేన నేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన విజయనగరం జిల్లా భోగాపురంలో శనివారంనాడు ప్రజాపోరాట యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పరివారం అవినీతికి పాల్పడుతుందని విమర్శించారు. నలభై ఏళ్ల అనుభవం ఇసుక అవినీతితో బయటపడిందని ఎద్దేవాచేశారు.

Pages