S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/05/2018 - 02:15

వరంగల్, ఏప్రిల్ 4: ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత ద్రోహి అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. దళిత, గిరిజనులపై సీఎం కేసీఆర్ వల్లమాలిన ప్రేమ వలకబోస్తున్నాడని తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ చేపట్టిన ప్రజాచైతన్య బస్సు యాత్రలో భాగంగా బుధవారం వరంగల్‌కు వచ్చిన సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

04/05/2018 - 02:01

విజయవాడ, ఏప్రిల్ 4: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి నాలుగేళ్ల తరువాత కుదరదని చెప్పడం, విభజన చట్టంలోని హామీలు కూడా అమలుచేయని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముమ్మాటికీ రాష్ట్ర ప్రజలకు నమ్మకద్రోహం చేసినట్లేనని జననేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నాలుగేళ్లుగా హోదా సాధన కోసం కనీస ప్రయత్నం చేయకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

04/05/2018 - 02:02

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 4: జీవనదిగా పేరొందిన గోదావరి రాన్రానూ వట్టిపోతోంది. గత ఐదేళ్లలో ఎన్నడూలేని విధంగా గోదావరి నదిలో సహజ నీటి లభ్యత ఈ ఏడాది క్షీణించింది. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజి వద్ద బుధవారం నీటిమట్టం 12.29 మీటర్లకు దిగజారింది. ఏటా రబీ సీజనులో నీటి లభ్యత తగ్గడం గత కొన్ని ఒకటిన్నర దశాబ్దాలుగా నిత్యకృత్యమైనప్పటికీ, ఈ ఏడాది పరిస్థితి ఊహించనివిధంగా దిగజారింది.

04/04/2018 - 17:10

హైదరాబాద్: తెలంగాణ జన సమితిలో ఉద్యమకారులకే తొలి ప్రాధాన్యం ఇస్తామని ఆ పార్టీ వ్యవస్థాపకుడు కోదండరాం ప్రకటించారు. ఆయన బుధవారంనాడు బాగ్‌లింగంపల్లిలోని విఎస్టీ ఫంక్షన్ హాలులో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ జన సమితి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ కోసం అమరులైన వారి కోసం స్ఫూర్తివనాన్ని ఏర్పాటుచేస్తామని అన్నారు.

04/04/2018 - 17:09

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేసేలా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకునేందుకు బుధవారంనాడు సీపీఎం, సీపీఐ పార్టీల నాయకులతో సమావేశం అయిన సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో చర్చించారు. కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న నమ్మక ద్రోహానికి నిరసనగా 6న జాతీయ రహదారులపై పాదయాత్రలు చేయాలని నిర్ణయించారు.

04/04/2018 - 13:32

హైదరాబాద్‌: తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖులను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్న నటి శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు రెండు రోజుల క్రితం టాలీవుడ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వ్యవస్థాపకుడు పవన్‌ కల్యాణ్‌ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.

04/04/2018 - 13:26

గుంటూరు: వైసీపీ అధినేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ బుధవారం కలిశారు. జగన్ ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో జగన్ ను చలసానితోపాటు ఆయా పార్టీల నేతలు కలిశారు. ఈ సందర్బంగా ఢిల్లీ పరిణామాలు, ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటంపై వీరిమధ్య చర్చ జరిగింది.

04/04/2018 - 13:01

విజయవాడ: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో వామపక్ష పార్టీల నేతలు బుధవారం విజయవాడలోని జనసేన కార్యాలయంలో భేటీ అయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆమరణదీక్ష చేపట్టడంపై వామపక్ష నేతలతో పవన్‌కల్యాణ్ చర్చించారు.

04/04/2018 - 04:28

విజయవాడ: ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల 21,693 ఎకరాల్లో రూ.56 కోట్లకు పైగా విలువైన పంట నష్టం జరిగిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. బాధిత రైతులందరికీ ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలో నష్ట పరిహారం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

04/04/2018 - 03:38

విశాఖపట్నం: కోస్తా జిల్లాల్లో వచ్చే రెండు రోజుల్లో ఉరుములతో కూడిన జల్లులు అనేక ప్రాంతాల్లో కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం మంగళవారం రాత్రి తెలియచేసింది. చత్తీస్‌గడ్, ఒడిశా, జార్ఘండ్ ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావం ఉత్తర కోస్తాపై కనిపిస్తోందని అన్నారు.

Pages