S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/03/2018 - 16:44

అనంతపురం: ప్రేమ వివాహం ఓ యువకుడి ప్రాణాలను బలిగొన్నది. జిల్లాలోని నల్లమాడ మండలం బడవాండ్లపల్లికి చెందిన భార్గవి, ధనుంజయ ప్రేమించుకున్నారు. ఎనిమిది నెలల క్రితం ఊరి నుంచి పారిపోయి పెళ్లిచేసుకున్నారు. జరిగిందేదో జరిగిపోయిందని కూతురు, అల్లుడ్ని ఇంటికి ఆహ్వానించారు. మంగళవారంనాడు అల్లుడ్ని మామ ఈటతో గొంతులో పొడిచి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.

04/03/2018 - 16:43

ఖమ్మం: గోదావరి జలాలతో ఖమ్మం సస్యశ్యామలం అవుతుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆయన భద్రాచలంలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కీంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..్భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌పోర్టును ఏర్పాటుచేస్తామని తెలిపారు.

04/03/2018 - 16:40

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్లమెంట్ మెట్లకు మొక్కటమేమిటని బిజెపి ఎమ్మెల్యే విఘ్ణకుమార్ రాజు ప్రశ్నించారు. పార్లమెంట్ మెట్లకు మొక్కి వెళ్లడం అంటే అత్యున్నత స్థానంలో ఉన్న ప్రధానికి మొక్కడమేనని అన్నారు. రాఫెల్ డీల్ వంటి స్కామ్‌ల గురించి మాట్లాడేంత పెద్దవాళ్లం కాదని, శ్యాండ్, లాండ్ స్కామ్‌ల గురించి మాట్లాడగలమని అన్నారు.

04/03/2018 - 05:22

హైదరాబాద్, ఏప్రిల్ 2: మానసిక ఒత్తిడి తాళలేక ఓ టివి యాంకర్ అపార్టుమెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కూకట్‌పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం- మెదక్ జిల్లా మానేపల్లికి చెందిన రాధిక (36) ముసాపేటలోని శ్రీ సువిల ఆపార్టుమెంట్‌లో ఉంటూ వి6 న్యూస్‌చానల్‌లో యాంకర్‌గా విధులు నిర్వహిస్తోంది.

04/03/2018 - 04:35

హైదరాబాద్, ఏప్రిల్ 2: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీని ప్రభుత్వం విభజించింది. ఈ కమిటీ పరిధిలో ఉన్న మద్దులపల్లి గ్రామాన్ని ప్రత్యేక వ్యవసాయ మార్కెట్ కమిటీగా ఏర్పాటు చేశారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి పేరుతో సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

04/03/2018 - 04:28

విశాఖపట్నం, ఏప్రిల్ 2: ఛత్తీస్‌గడ్ నుంచి విదర్భ, మహారాష్ట్ర మీదుగా కర్నాటక వరకూ అల్పపీడనద్రోణి కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆదివారం రాత్రి ఉత్తరాంధ్రలో పలు చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.

04/03/2018 - 04:27

నల్లమాడ/ బనగానపల్లె/ చిలమత్తూరు, ఏప్రిల్ 2: అల్పపీడన ద్రోణితో రెండు రోజులుగా కురిసిన వడగళ్లవాన ఆస్తి నష్టానే్న కాదు, పిడుగులు కురిపించి ప్రాణ నష్టాన్నీ మిగిల్చింది. మొత్తంగా గత 48 గంటల్లో పిడుగుపాటుకు ఐదుగురు మృతి చెందారు. అనంతపురం జిల్లాలో ఇద్దరు మహిళలు, కర్నూలు జిల్లాలో ఒకరు, అనంతపురం జిల్లా సరిహద్దు కర్నాటకలో ఇద్దరు రైతులు మృతి చెందారు.

04/03/2018 - 04:32

ఖమ్మం, ఏప్రిల్ 2: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపిన ప్రొఫెసర్ కోదండరాం కొత్త పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటించిన వెంటనే ఖమ్మం జిల్లా నుంచి నేతల వలసలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం జిల్లా నేతలు సైతం కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. తాజాగా కోదండరామ్‌కు కూడా ఖమ్మం జిల్లా నుంచే మద్దతు లభిస్తుండటం విశేషం.

04/03/2018 - 04:08

శ్రీశెలం టౌన్, ఏప్రిల్ 2: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైలంలో కొలువైన శ్రీ భ్రమరాంబదేవికి మంగళవారం వార్షిక కుంభోత్సవం నిర్వహించనున్నారు. అమ్మవారికి సంప్రదాయబద్ధంగా సాత్విక బలి సమర్పించేందుకు కుంభోత్సవం జరపడం ఆనవాయితీ. ఈ ఉత్సవంలో భాగంగా వేల సంఖ్యలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలను అమ్మవారికి సమర్పిస్తారు. అన్నం రాశిగా పోసి హారతి ఇస్తారు.

04/03/2018 - 03:41

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: విపక్ష సభ్యుల ఆందోళనలతో ఎటువంటి కార్యకలాపాలు జరగకుండానే రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడింది. సోమవారం రాజ్యసభ ప్రారంభం కాగానే అన్నాడీఎంకే, డీఎంకే, టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వచ్చి వివిధ అంశాలపై నిరసనలు తెలిపారు. మరోవైపు టీడీపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రత్యేక హోదాను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన నిర్వహించారు.

Pages