S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/02/2018 - 17:15

విజయవాడ: విభజన చట్టం అమలు కోసం విద్యార్థులను రోడ్డెక్కమనటం దారుణమని వైకాపా నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండి ఉంటే అధికార పార్టీ ఊకదంపుడు ప్రసంగాలు వినాల్సి వచ్చేది కాదని అన్నారు.

04/02/2018 - 17:13

హైదరాబాద్: తెలంగాణ జన సమితి పేరును టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ ప్రకటించారు. 4వ తేదీన పార్టీ జెండాను ఆవిష్కరిస్తామని వెల్లడించారు. సచివాలయానికి రాని ముఖ్యమంత్రిని తాను ఇంత వరకు చూడలేదని కోదండరామ్ అన్నారు. ఏప్రిల్ 29న పార్టీ ఆవిర్భావ సభను ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించారు. అన్నీ ఆలోచించాకే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించినట్లు తెలిపారు.

04/02/2018 - 17:12

బీజేపీ కార్యాలయం ముట్టడి
అమరావతి: విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరుతూ అమరావతిలోని బీజేపీ కార్యాలయాన్ని సీపీఐ ముట్టడించింది. ఈ సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.

04/02/2018 - 16:31

హైదరాబాద్: తెలంగాణ జన సమితి పేరును టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ ప్రకటించారు. 4వ తేదీన పార్టీ జెండాను ఆవిష్కరిస్తామని వెల్లడించారు. సచివాలయానికి రాని ముఖ్యమంత్రిని తాను ఇంత వరకు చూడలేదని కోదండరామ్ అన్నారు. ఏప్రిల్ 29న పార్టీ ఆవిర్భావ సభను ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించారు. అన్నీ ఆలోచించాకే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించినట్లు తెలిపారు.

04/02/2018 - 16:30

అమరావతి: విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరుతూ అమరావతిలోని బీజేపీ కార్యాలయాన్ని సీపీఐ ముట్టడించింది. ఈ సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.

04/02/2018 - 14:05

విజయవాడ: కాంప్రహెన్సివ్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టం(సీఎఫ్‌ఎంఎస్‌)ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్రాయింగ్ డిస్పర్‌సింగ్ అధికారులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎఫ్ఎంఎస్‌ను ఏర్పాటు చేసినందుకు సీఎం అభినందనలు తెలిపారు. సీఎఫ్‌ఎంఎస్‌తో నిధుల వినియోగంలో పారదర్శకత వస్తుందని అభిప్రాయపడ్డారు.

04/02/2018 - 12:54

అమరావతి: సీఎం చంద్రబాబును మంత్రి పరిటాల సునీత సోమవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. తన కుమార్తె స్నేహలత వివాహానికి రావాల్సిందిగా ఆమె చంద్రబాబును ఆహ్వానించారు. పరిటాల సునీత వెంట ఆమె కుమారుడు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా స్నేహలత, శ్రీహర్షలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

04/02/2018 - 12:47

అమరావతి: ఢిల్లీలో మనం చేసేది లాలూచీ రాజకీయాలు కాదని, ప్రజలకు ఉపయోగపడే రాజకీయం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారంనాడు ఆయన తెలుగుదేశం ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీ పర్యటన చేపట్టినట్లు వెల్లడించారు. ఎన్నికలంటే వైకాపాకు భయమని, అందుకే పార్లమెంట్ చివరి రోజున రాజీనామాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

04/02/2018 - 04:38

హిందూపురం: శిల్ప కళలకు నిలయమైన లేపాక్షి చరిత్రను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పేలా మరింత అభివృద్ధి చేస్తామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హర్షధ్వనుల నడుమ ప్రకటించారు. అనంతపురం జిల్లా లేపాక్షిలో రెండు రోజుల పాటు లేపాక్షి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు శనివారం ఉత్సవాలను ప్రారంభించగా ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా ముగిశాయి.

04/02/2018 - 03:20

ఖమ్మం, ఏప్రిల్ 1: ఆర్‌ఎస్‌ఎస్, ఇతర మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడేవారిని సమీకరించి ఉద్యమిస్తామని, వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా కలసివచ్చే శక్తులతో కలిసి పనిచేస్తామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ చెప్పారు. టీఆర్‌ఎస్, టీడీపీ, కాంగ్రెస్‌లకు దూరంగా ఉంటామని తెలిపారు.

Pages