S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/04/2018 - 02:26

హైదరాబాద్, ఏప్రిల్ 3: దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ర్యాంకులను ప్రకటించింది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక విద్యాసంస్థలు ఉన్నత ర్యాంకులను సాధించి అగ్రస్థానంలో నిలిచాయి. 20కి పైగా అంశాలను ప్రామాణికంగా ఉంచుకుని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ దేశంలోని 3954 విద్యాసంస్థలను పరిశీలించి ర్యాంకులను ఇచ్చింది.

04/04/2018 - 02:23

హైదరాబాద్, ఏప్రిల్ 3: 2022 నాటికి దేశంలో 60 జిడబ్ల్యు (గిగావాట్స్) పవన విద్యుత్‌ను సరఫరా చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం సాకారమవుతుందని భారత పవన టర్బైన్ మ్యానుఫ్యాక్చరర్స్ సంఘం చైర్మన్ తులసి తాంతి పేర్కొన్నారు. పరిశుభ్రమైన ఇంధనానికి డిమాండ్ పెరుగుతోందన్నారు. ప్రస్తుతం ఈ ఏడాది 10 నుంచి 12 జిడబ్ల్యు పవన విద్యుత్ అందుబాటులో వచ్చే అవకాశం ఉందన్నారు.

04/04/2018 - 01:37

ఒంటిమిట్ట, ఏప్రిల్ 3: కడప జిల్లా ఒంటిమిట్ట లో జరుగుతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవా ల్లో భాగంగా మంగళవారం శ్రీ కోదండరాముడి కి పుష్పయాగం నిర్వహించారు. ఉదయం ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. హారతులు ఇచ్చిన అనంతరం ప్రత్యేక వేదికపై ఆశీనులను చేయించి రకరకాల పుష్పాలతో పూజలు చేశారు. ఇందుకోసం బెంగళూరు నుంచి రకరకాల పుష్పాలు తెప్పించారు.

04/04/2018 - 01:35

శ్రీశైలం, ఏప్రిల్ 3: అష్టాదశ శక్తిపీఠ స్వరూపిణి శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారికి మంగళవారం వార్షిక కుంభోత్సవ వేడుక సంప్రదాయబద్ధంగా జరిగింది. పౌర్ణమి తరువాత వచ్చే మొద టి మంగళవారం ఆలయంలో వార్షిక కుంభోత్స వం నిర్వహిస్తారు. అందులో భాగంగా ఉద యం 120 కిలోల కుంకుమ, 120 కిలోల పసు పు, 2వేల గుమ్మడికాయలు, 3వేల కొబ్బరికాయ లు, 80 వేల నిమ్మకాయలు, 200 కిలోల అన్నం కుంభరాశిని అమ్మవారికి సమర్పించారు.

04/04/2018 - 01:23

ఖాజీపేట, ఏప్రిల్ 3: కడప జిల్లా ఖాజీపేట మండలం మిడుతూరు గ్రామం సమీపంలో మంగళవారం పిడుగుపడి తల్లీకూతురు మృతి చెందారు. చాపాడు మండలం వెదురూరు గ్రామానికి చెందిన చవటపల్లె ఖాసీంబీ (38), ఆమె కూతురు అయిషా(18) ఖాజీపేట మండలం మిడుతూరు వ్యవసాయ పొలాల్లో కూలీ పనులు ముగింపుకుని ఇంటికి వెళ్తుండగా మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

04/04/2018 - 04:16

హైదరాబాద్: తెలంగాణలో దళితుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది బడ్జెట్‌లో సర్కారు భారీగా నిధులు కేటాయించింది. స్పెషల్ డెవలప్‌ఫంట్ (ప్రత్యేక అభివృద్ధి నిధి) కింద రూ. 16,453 కోట్లతో వివిధ అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టనుంది. ఇందులో ఎస్సీ అభివృద్ధి శాఖకు రూ.12709 కోట్లను కేటాయించారు. రాష్ట్ర జనాభాలో ఎస్సీ కులాలు 15.45 శాతం ఉన్నారు.

04/04/2018 - 01:11

హైదరాబాద్, ఏప్రిల్ 3: అకాల వర్షాలు, పెనుగాలులు, వడగళ్లవాన తెలంగాణలోని 20 జిల్లాల్లో ప్రభావం చూపగా, ఆరు జిల్లాల్లో పంటలకు విపరీతమైన నష్టం వాటిల్లింది. మంగళవారం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ అంశం వెల్లడైంది.

04/04/2018 - 01:04

కాకినాడ సాగర తీరంలో కన్నీరు కారుస్తున్న భారత మాత ‘ప్లీజ్ సేవ్ మై చైల్డ్ (ఏపీ).. మోదీజీ’ అన్న ప్లకార్డు చూపుతున్నట్టు సైకత శిల్పాన్ని రూపొందించి ప్రజల మన్ననలు పొందారు సైకత శిల్పి డి శ్రీనివాస్.

04/04/2018 - 04:15

విజయవాడ: జీతాలు, పెన్షన్లు, ఇతరత్రా బిల్లుల చెల్లింపుల్లో సంస్కరణలు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ప్రాంభించిన సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం (కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజింగ్ సిస్టం-సీఎఫ్‌ఎంఎస్)లో కొన్ని గంటల్లోనే సాంకేతికపరమైన లోపాలు నెలకొనటంతో మంగళవారం అన్ని రకాల చెల్లింపులు పూర్తిగా నిలిచాయి.

04/03/2018 - 18:22

హైదరాబాద్: కాంగ్రెస్ చిన్న సైజు ప్రాంతీయ పార్టీగా మారిందని మంత్రి తలసాని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఒక దొంగల ముఠా పార్టీ అని అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి తలసాని.. 2019లో కాంగ్రెస్, బీజేపీకి ఇప్పుడున్న సీట్లు కూడా రావని, పీసీసీ ప్రెసిడెంట్ కూడా ఓడిపోతారని చెప్పారు.

Pages