S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/19/2019 - 03:47

హైదరాబాద్, సెప్టెంబర్ 18: కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించి మంత్రుల స్థాయి కమిటీ, సీనియర్ అధికారులతో కూడిన సాంకేతిక కమిటీల నివేదికలు అందాయని రవాణా, రోడ్లు భవనాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం నాడు శాసనసభలో చెప్పారు. మహ్మద్ మోజాం ఖాన్ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ కొత్త సచివాలయ నిర్మాణం విషయమై మంత్రిమండలి ఉపసంఘం నివేదికను ప్రభుత్వం పరిశీలిస్తోందని అన్నారు.

09/19/2019 - 03:46

హైదరాబాద్, సెప్టెంబర్ 18: సహకార రంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు పశుసంవర్థక శాఖ, పాడి పరిశ్రమల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల సందర్భంగా బుధవారం నాడు ప్రశోత్తర కార్యక్రమంలో నల్లమోతు భాస్కరరావు, చల్లా ధర్మారెడ్డి, రవిశంకర్ సుంకెలు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పూర్తి తోడ్పాటునిస్తుందని అన్నారు.

09/19/2019 - 03:45

హైదరాబాద్, సెప్టెంబర్ 18: గ్రామ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, నిధుల కొరత లేదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. పంచాయతీ సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇవ్వడాన్ని ప్రజా ప్రతినిధులు వ్యతిరేకించడం సరికాదన్నారు. సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు కూడా ప్రజా ప్రతినిధులనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

09/19/2019 - 03:44

హైదరాబాద్, సెప్టెంబర్ 18: మిషన్ కాకతీయ పథకానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని ఆర్ధిక మంత్రి హరీష్‌రావు తెలిపారు. శాసనసభలో పలువురు సభ్యులు ప్రశ్నోత్తర కార్యక్రమంలో అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ మిషన్ కాకతీయ పథకంలో పునరుద్ధరించిన చెరువులతో 14 లక్షల ఎకరాలకు ఆయకట్టు లభిస్తుందని అన్నారు. మిషన్ కాకతీయపే నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ డాక్యుమెంటరీని రూపొందించిందని అన్నారు.

09/19/2019 - 03:42

హైదరాబాద్, సెప్టెంబర్ 18: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనాలని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు.

09/19/2019 - 03:42

హైదరాబాద్, సెప్టెంబర్ 18: హిందీ భాషను దేశంలోని అన్ని రాష్ట్రాలపై రుద్దరాదని, దీని వల్ల భిన్నత్వంలో ఏకత్వం అనే భావానికి విఘాతం కలుగుతుందని టీపీసీసీ సీనియర్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, నిరంజన్ అన్నారు. హిందీని దేశంలో సాధారణ భాషగా చేయాలని కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షా అనడం బాధ్యతా రాహిత్యమన్నారు. ఇప్పటికే దక్షిణ భారతదేశంలో ఈ విషయమై ఆందోళన మొదలైందన్నారు.

09/19/2019 - 01:35

హైదరాబాద్, సెప్టెంబర్ 18: గవర్నర్‌ను కలుస్తున్నట్టు తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి పార్టీ సీనియర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎల్పీ సభ్యుడినైన తనకు కూడా గవర్నర్‌ను కలిసే సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

09/19/2019 - 03:38

హైదరాబాద్ : గ్రామాల ప్రత్యేక కార్యాచరణతో గ్రామాల స్వరూపం మారాలని కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి దిశా నిర్దేశం చేశారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పనులు చేపట్టాలన్నారు. బుధవారం బీఆర్‌కే భవన్ నుంచి సీఎస్ జోషి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 6 నుంచి ప్రారంభమైన గ్రామాల ప్రత్యేక ప్రణాళికపై జిల్లాల్లో జరుగుతోన్న పనులను సీఎస్ సమీక్షించారు.

09/19/2019 - 01:43

హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ బుధవారం శాసనసభలో వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత మహబూబ్‌నగర్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండలో నాలుగు కొత్త కాలేజీలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

09/19/2019 - 01:24

హైదరాబాద్: రాష్ట్రంలో ఏళ్ల తరబడి భూమిని అనుభవిస్తున్న వారి పేరు మీద పట్టాదార్ పాస్ పుస్తకాల్లో ఎంట్రీలు చేయకుండా భూములు వదిలివెళ్లిన వారు, గతంలో సాదాబైనమా కింద భూములు ఇచ్చేసిన యాజమానుల పేర్లను నమోదు చేస్తున్నారని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యల పట్ల అధికారపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సీఎల్‌పీ నేతకు మాట్లాడేందుకు ఇచ్చిన సమయం పూర్తయిందని స్పీకర్ మైక్‌ను ఆఫ్ చేశారు.

Pages