S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/09/2018 - 23:44

సిరిసిల్ల, ఆగస్టు 9: అంతగిరి రిజర్వాయర్ ద్వారా ఈ ఏడాది నీళ్ళు ఇచ్చే దిశగా పనులు వేగవంతం చేయాలని అధికారులను నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశించారు.

08/09/2018 - 23:17

హైదరాబాద్, ఆగస్టు 9: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కోసం జరిగిన ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్ధికి ఓట్లు వేయడం ద్వారా టీఆర్‌ఎస్, బీజేపీల చీకటి ఒప్పందం బహిర్గతం అయిందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపువిభజన హామీలను అమలు చేయడం లేదని కేంద్రంపై ఆరోపణలు గుప్పిస్తూనే ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ అంటకాగుతున్నారని రేవంత్ దుయ్యబట్టారు.

08/09/2018 - 23:16

హైదరాబాద్, ఆగస్టు 9: కేంద్రప్రభుత్వం యూజీసీని రద్దు చేసే ఆలోచనను విరమించుకోవాలని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రీ పేర్కొన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య దేశవ్యాప్త నిరసనల కార్యక్రమంలో భాగంగా ఉస్మానియా యూనివర్శిటీలో హెచ్‌ఈసిఐ ముసాయిదా బిల్లు ప్రతులను ఏఐఎస్‌ఎఫ్ నేతలు దహనం చేశారు.

08/09/2018 - 23:15

హైదరాబాద్, ఆగస్టు 9: ఉగ్రవాదుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పాతబస్తీకి చెందిన యువకుల నుంచి ముఖ్యమైన సమాచారంతో పాటు విలువైన పత్రాలను ఎన్‌ఐఏ చేజిక్కించుకుంది. దీంతో ఉగ్రవాదుల సమాచారం కోసం మరింత లోతుగా దర్యాప్తును కొనసాగిస్తోంది. గత సోమవారం హైదరాబాద్ పాతబస్తీలో ఐసిస్ అనుమానితులుగా పట్టుకున్న హన్నన్ ఖురేషే,ఖాదిర్, ఖుర్దూస్‌లను జాతీయ దర్యాప్తు సంస్థ పలు కోణాల్లో విచారణ చేపట్టింది.

08/09/2018 - 23:15

హైదరాబాద్, ఆగస్టు 9: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పనితీరుపైనా, వైస్ ఛాన్సలర్ల పనితీరుపైనా గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయని, ఏం చూసి గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారో రాజ్‌భవన్ వర్గాలు చెప్పాలని బీజేపీ శాసనసభాపక్ష నేత జీ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ గవర్నర్ ఏ అంశాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు.

08/09/2018 - 23:14

హైదరాబాద్, ఆగస్టు 9: కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ చట్టానికి మరింత పదను పెట్టడం ద్వారా అట్టడుగు అణగారిన వర్గాలకు కేంద్రప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టమైందని ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు పేర్కొన్నారు.

08/09/2018 - 23:13

హైదరాబాద్, ఆగస్టు 9: కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసులను రెగ్యులరైజ్ చేసేంత వరకూ ఏటా 12 నెలల వేతనాన్ని ఇవ్వాలని, అలాగే రెగ్యులరైజేషన్‌కు సంబంధించి న్యాయస్థానాల్లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు లెకర్చరర్ల సంఘం నేతలు కొప్పిశెట్టి సురేష్, సయ్యద్ జబీఉల్ల డిమాండ్ చేశారు.

08/09/2018 - 23:13

హైదరాబాద్, ఆగస్టు 9: హరితహరంలో భాగంగా గురువారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ఇంచార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యవరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం హరితహారం అని అన్నారు.

08/09/2018 - 23:12

హైదరాబాద్, ఆగస్టు 9: ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపిచంద్ ప్రధాన మంత్రి మోదీకి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. హైదరాబాద్‌లోని తన అకాడమిలో గురువారం గోపిచంద్ మొక్కలు నాటి ఫోటోలను ట్విట్ చేశారు.

08/09/2018 - 23:11

హైదరాబాద్, ఆగస్టు 9: స్వామి పరిపూర్ణానందపై విధించిన నగర బహిష్కరణ ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కలెక్టరేట్లను ముట్టడించనున్నట్టు వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి పేర్కొన్నారు. స్వామిపై ఆంక్షలు విధించడం అంటే హిందూ ధర్మాన్ని కించపరచడమేనని చెప్పారు.

Pages