S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/10/2019 - 02:53

హైదరాబాద్, జూలై 9: రాష్ట్రంలో అటవీ సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలని, రెవెన్యూ, పోలీస్ శాఖల సహకారం తీసుకోవాలని పలువురు రిటైర్డ్ అటవీ అధికారులు సూచించారు. అడవుల అభివృద్ధి కోసం రిటైర్డ్ అటవీ అధికారుల సలహాలు, సూచనలు తీసుకునేందుకు హైదరాబాద్‌లోని ‘అరణ్యభవన్’లో మంగళవారం ఒకరోజు సెమినార్ ఏర్పాటు చేశారు.

07/09/2019 - 23:45

ఉగ్ర మాతగా
భద్రకాళి అమ్మవారు
వైభవంగా సాగుతున్న శాకంబరి ఉత్సవాలు
ఆంధ్రభూమి బ్యూరో

07/09/2019 - 23:43

నల్లగొండ, జూలై 9: సామాజిక మార్పుకు, దేశ భవిష్యత్‌కు యువతరం ముందుండాలని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం నిర్వహించే ప్రజాపక్ష ఉద్యమాల్లో యువత కలిసిరావాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు.

07/09/2019 - 23:42

గోదావరిఖని, జూలై 9: రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నట్టు గతంలోనే సంచలన ప్రకటనలు చేసి... ఆ తరువాత మళ్లీ పార్టీలో కొనసాగుతూ వచ్చిన ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఎట్టకేలకు టీఆర్‌ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఉద్యమాలతో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితిలో క్రమశిక్షణ కరవైపోయిందని...

07/09/2019 - 23:40

చింతపల్లి, జూలై 9: తలగడ కింద పెట్టిన మొబైల్ ఫొన్ పెద్ద శబ్దంతో పేలిన సంఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. చింతపల్లి మండల కేంద్రానికి చెందిన విగ్రహాల దైవచారి తాను పడుకున్న సమయంలో తలగడ కింద ఒక ప్రముఖ కంపెనీకి చెందిన మొబైల్ పెట్టుకుని నిద్రించాడు. అర్థరాత్రి సమయంలో తలగడ నుంచి మరో వైపునకు తిరిగి పడుకున్న సమయంలో మొబైల్ ఫోన్ పెద్ద శబ్దంతో పేలిపోవడంతో తలగడకు పెద్ద రంధ్రం ఏర్పడింది.

07/09/2019 - 23:38

సిరిసిల్ల, జూలై 9: సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మండలం చిన్నబోనాల మున్సిపల్ విలీన గ్రామంలో బర్రె కడుపులో పంది జన్మించింది. ఈ వింతపై గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. గ్రామానికి చెందిన గోసుకుల మల్లయ్య అనే రైతు పశువుల అంగడిలో తంగళ్ళపల్లి మండలం కస్బెకట్కూర్ గ్రామానికి చెందిన బిజిగ బాలమల్లు వద్ద నుంచి రూ.33 వేలకు ఈ బర్రెను కొనుగోలు చేశాడు.

07/09/2019 - 23:35

భువనగిరి, జూలై 9: రాహుల్‌గాంధీ హయాంలో కాంగ్రెస్‌పార్టీ భవిష్యత్తు అంధకారంగా మారిందని ఆ ప్రభావంతోనే కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం మునిగిపోతున్న నావలా మారిందని భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రం భువనగిరిలో ఏర్పాటుచేసిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

07/09/2019 - 17:17

హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం వైభవంగా జరిగింది. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ ఉత్సవంలో సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు, మేయర్ రామ్మోహన్ ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని తిలకించారు.

07/09/2019 - 13:15

హైదరాబాద్: నీలోఫర్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నా చేశారు. రెండు నెలలుగా జీతాలు చెల్లించటం లేదని ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తేనే జీతాలు చెల్లిస్తానని కాంట్రాక్టర్ అంటున్నారని ఉద్యోగులు తెలిపారు. తమకు వెంటనే జీతాలు చెల్లించకపోతే నిరవధికి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

07/09/2019 - 13:14

హైథరాబాద్: టీఆర్‌ఎస్‌కు ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ రాజీనామా చేశారు. ఆయనతో పాటు పలువురు కార్పోరేటర్లు కూడా రాజీనామాలు సమర్పించారు. గత ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. తన ఓటమికి మాజీ ఎంపీ, ముఖ్యనాయకులే కారణమని తెలిపారు. తనకు కనీసం పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాలు సైతం ఇవ్వలేదని అన్నారు. పార్టీలో క్రమశిక్షణ లోపించిందని అన్నారు.

Pages