S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/10/2018 - 01:42

హైదరాబాద్, డిసెంబర్ 9: బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేంత వరకూ పోరాటం చేయాలని బీసీ విద్యుత్తు ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈ నెల 27న పశ్చిమ గోదావరి జిల్లా, ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి)లో విద్యుత్తు బీసీ ఉద్యోగుల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జికే వీర భద్రయ్య, ప్రధాన కార్యదర్శి జెడ్‌వి జ్ఞానేశ్వర రావు తెలిపారు.

12/10/2018 - 01:40

హైదరాబాద్, డిసెంబర్ 9: ముందస్తు ఎన్నికల పోలింగ్‌లో అన్ని సర్వేలూ టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఇచ్చాయని ఆ పార్టీ ఎన్‌ఆర్‌ఐ సెల్ నాయకుడు మహేష్ బిగాల తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు.

12/10/2018 - 01:40

హైదరాబాద్, డిసెంబర్ 9: టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని, కే. చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని దేవ, దేవున్ని కోరుతూ కుత్బుల్లాపూర్‌కు చెందిన ఇద్దిరు కార్పొరేటర్ల సారథ్యంలో 40 మంది కార్యకర్తలు శ్రీశైలం దేవస్థానానికి పాద యాత్ర చేపట్టారు.

12/10/2018 - 01:39

హైదరాబాద్, డిసెంబర్ 9: పంచాయతీరాజ్ రిజర్వేషన్లపై పార్లమెంటులో బిల్లు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి, 36 రాజకీయ పార్టీలకూ బీసీ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ నెల 11 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం కల్పించడానికి వీలుగా రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.

12/10/2018 - 01:39

హైదరాబాద్, డిసెంబర్ 9: సంతానోత్పత్తి, ప్రసవాలు, స్ర్తి సంబంధిత, చిన్నారులు, నవజాత శిశువులకు సంబంధించి ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య పద్ధతుల ద్వారా తల్లి, బిడ్డలకు అత్యున్నత వైద్య ఫలితాలను అందించవచ్చని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన డాక్టర్లు అభిప్రాయపడ్డారు.

12/09/2018 - 04:35

చిత్రం..ఎల్‌బీ స్టేడియం వద్ద స్ట్రాంగ్ రూమ్‌లకు భారీ భద్రత

12/09/2018 - 04:29

అచ్చంపేట, డిసెంబర్ 8: శాసన సభ ఎన్నికల సందర్బంగా శుక్రవారం అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో జరిగిన పోలీసుల లాఠీచార్జీలో గాయపడ్డ టీఆర్‌ఎస్ కార్యకర్త నేనవత్ చంద్రు(35) శనివారం ఉదయం అచ్చంపేట సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించగా అడిషనల్ ఎస్పీ జోగులచెన్నయ్య, డీఎస్పీ నర్సింహులు అక్కడికి చేరుకొని వారిని సముదాయించారు.

12/09/2018 - 04:25

కరీంనగర్ టౌన్, డిసెంబర్ 8: రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో వార్ వన్ సైడే అన్నట్లుగా పోలింగ్ జరిగిందని, మరోసారి అధికారంలోనే సారు..కారు ఉండబోతున్నాయని మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ అన్నారు. శనివారం నగరంలోనిర్వహించిన విలేఖరుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఈనెల 11న ఓట్ల లెక్కింపు అనంతరం ముఖ్యమంత్రిగా రెండోసారి కేసీ ఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

12/09/2018 - 04:24

భువనగిరి, డిసెంబర్ 8: యాదాద్రి భువనగిరి జిల్ల పగిడిపల్లి రైల్వేస్టేషన్‌ ఫరిదిలో సికింద్రాబాద్ ఖాజిపేట, సికింద్రాబాద్ గూంటూరు లైన్లలో సిగ్నల్‌వ్యవస్థలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు పగిడిపల్లి రైల్వే అధికారులు తెలిపారు. సిగ్నలింగ్‌వ్యవస్థలో లోపం కారణంగా శాతవాహన, షిర్డిసాయి ఎక్స్‌ప్రెస్‌లను భువనగిరి రైల్వే స్టేషన్లో మూడుగంటలపాటు నిలిపివేసారు.

12/09/2018 - 04:23

ఆసిఫాబాద్ రూరల్, డిసెంబర్ 8: ఎవరి ఇంట్లో పాము కనిపించినా వెళ్లి ఇట్టే పట్టే బోయిరె చందు అనే వ్యక్తి అదే పాము కాటుకు బలి కావడం పట్ల పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కుమ్రం భీం ఆసిఫాబాద్ పట్టణంలోని బెస్తవాడకు చెందిన బోయిరె చెందు ఎంతటి పామునైనా ఇట్టే పట్టి అడవుల్లో వదిలి వేస్తాడు.

Pages