S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/29/2017 - 01:56

హైదరాబాద్, ఆగస్టు 28: నిరుద్యోగులు మరణిస్తున్నా డిఎస్‌సి ప్రకటించరా? అని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ప్రశ్నించారు. ఉపాధ్యాయ ఖాళీల్లో మొత్తం 40 వేల ఖాళీలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు కృష్ణయ్య సోమవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేఖ రాశారు.

08/29/2017 - 01:56

హైదరాబాద్, ఆగస్టు 28: శాసనసభా నియోజకవర్గాల అభివృద్ధి కోసం 225 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల పరిధిలో శాసనసభా నియోజవర్గాల్లో అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్న విషయం ఈ సందర్భంగా గమనార్హం.

08/29/2017 - 01:55

హైదరాబాద్, ఆగస్టు 28: భూ సర్వేపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి సలహాలు, సూచనలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కేవలం టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో మాట్లాడితే సరిపోదని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో అన్నారు.

08/29/2017 - 01:55

హైదరాబాద్, ఆగస్టు 28: నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ తెలుగు దేశం పార్టీలోనూ నూతనోత్సాహం కలిగించింది. ఫలితం వెలువడిన వెంటనే హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం (ఎన్టీఆర్ భవన్)లో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం. అమర్‌నాథ్ బాబు, కార్యక్రమాల కమిటీ నాయకుడు జి. బుచ్చిలింగం అధ్వర్యంలో కార్యకర్తలు టపాకాయలు కాల్చారు, మిఠాయిలు పంచుకున్నారు.

08/29/2017 - 01:54

హైదరాబాద్, ఆగస్టు 28: కాలేయ మార్పిడి చేయాల్సిన అవసరం ఉన్న పేద బాలుడికి సిఎం కెసిఆర్ రూ.25 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేశారు. ఇందుకు సంబంధించి సిఎం కార్యాలయం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గజ్వేల్ పట్టణానికి చెందిన హనుమాన్‌దాస్ కుమారుడు దేవసాని శ్రీమాన్‌కి 11 నెలల వయస్సు. పుట్టినప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

08/28/2017 - 23:41

హైదరాబాద్, ఆగస్టు 28: భారత్‌తో చైనా డోక్లాం విషయంలో దోబూచులాడుతోందని తెలంగాణ రాష్ట్ర భజరంగ్‌దళ్ కన్వీనర్ భానుప్రకాష్ ఆరోపించారు. చైనా వ్యవహారాలు చూస్తుంటే భారత్‌కు భవిష్యత్ శత్రువులా కనిపిస్తోందని, టెర్రర్ కార్యకలాపాల్లో చైనా పాక్‌కు సహకరిస్తున్నట్టు ఆ దేశ చేష్టలు చూస్తుంటే అర్ధమవుతోందని పేర్కొన్నారు.

08/28/2017 - 23:39

హైదరాబాద్, ఆగస్టు 28:బిసి కులాను పునర్ వర్గీకరించాలని రాష్ట్ర బిసి కమీషన్ నిర్ణయించింది. దీని కోసం మేధావులు, సామాజిక పరిశోధనా సంస్థలతో సమావేశం నిర్వహించింది. బిసి కులాల జాబితా వర్గీకరణ, సంచార కులాలు, ఎంబిసిల గుర్తింపు, నొమాడిక్, సెమి నొమాడిక్ విముక్తి జాతులపై సమగ్ర అధ్యయనంలో భాగంగా బిసి కమీషన్ సోమవారం సమావేశం నిర్వహించింది.

08/28/2017 - 23:38

హైదరాబాద్, ఆగస్టు 28: రాష్ట్ర పరిశ్రమలు, ఐటి మంత్రి కె. తారకరామరావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని మూడు గ్రామపంచాయితీలకు నిర్మించే భవనాలను ఆదర్శ (మాడల్) భవనాలుగా రూపుదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట గ్రామాల్లో మాడల్ గ్రామపంచాయితీ భవనాలను నిర్మించాలని నిర్ణయించారు.

08/28/2017 - 23:37

హైదరాబాద్, ఆగస్టు 28: పోలీస్ శాఖ ఆధునీకరణకు తెలంగాణ ప్రభుత్వం రూ. 150 కోట్లు మంజూరు చేసింది. జిల్లా పోలీస్ కమిషనరేట్లలో నూతన టెక్నాలజీ పరిచయానికి ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు.

08/28/2017 - 23:36

హైదరాబాద్, ఆగస్టు 28: మత్స్యకారుల ఆర్థిక స్థితిగతులు మెరుగు పరిచి వారిని సామాజికంగా, ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈనెల 30 నుండి చేప పిల్లల విడుదల ప్రారంభించనున్నట్టు చెప్పారు. సింగూర్ జలాశయం నుంచి ప్రారంభిస్తారు.

Pages