S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పాట్ లైట్

05/16/2017 - 21:27

రష్యాకు ఇప్పుడు సమస్యల మీద సమస్యలు.. సవాళ్ల మీద సవాళ్లు... ఓ పక్క కోల్పోయన అంతర్జాతీయ ప్రాబల్యాన్ని పునరుద్ధరించుకోవాలన్న ఆరాటం.. మరో పక్క ఉత్తర కొరియా, సిరియా సమస్యల్లో తలదూర్చి అమెరికాతో నెగ్గుకురావాలన్న ఆరాటం... అన్నింటికీ మిం అంతర్జాతీయ వేదికలపై బలంగా ఉనికిని చాటుకుంటున్న చైనాతో సామరస్యమా... సమరమా అనే మీమాంస...

05/16/2017 - 21:25

అర్థబలంతోపాటు అపారమైన ప్రాబల్యం కూడా ఒక దేశ ప్రతిష్టను, దాని ప్రభావశీలతను ఎంతగానో పెంచుతుంది. వర్ధమాన ప్రపంచంలో చైనా ఇదే వ్యూహంతో ముందుకు దూసుకుపోతోంది. ఒకదాని తర్వాత ఒకటిగా తనకు ప్రయోజనం కలిగించే, తనకు ఆర్థికంగా రాజకీయంగా లబ్ధిని చేకూర్చే ప్రాజెక్టులకు సంబంధించి రాజీలేని రీతిలోనే పావులు కదుపుతోంది.

05/16/2017 - 21:23

ప్రపంచ దేశాలు ఎంతగా ఒత్తిడి తెస్తున్నా, ఆంక్షలను విధిస్తూ కొరడా ఝళిపిస్తున్నా ఉత్తర కొరియా నాయకత్వం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఒకదాని తర్వాత ఒకటిగా క్షిపణులను పరీక్షించుకుంటూ ఇప్పుడు ఏకంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులే లక్ష్యంగా పావులు కదుపుతోంది. తాజాగా ఉత్తర కొరియా చేసిన క్షిపణి పరీక్ష విజయవంతం కావడం అమెరికా సహా పలు దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.

05/16/2017 - 21:21

ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన బ్రిటన్ ప్రధాని ధెరీసామే ముందు అనేక సవాళ్లు పొంచి ఉన్నాయి. అసలు ఎంత మంది బ్రెగ్జిట్‌కు ఆనుకూలంగా ఉన్నారో తెలియాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఒక్కటే మార్గమని భావించిన ధెరీసా అందుకు అన్ని విధాలుగా సిద్ధమవుతున్నారు. బ్రెగ్జిట్ నుంచి బ్రిటన్ నిష్క్రమణకు అధికారికంగా నాంది పలికిన ఆమెకు ఇప్పుడు ఎన్నికల్లో నెగ్గడం ఓ పెద్ద సమస్యగా మారింది.

05/16/2017 - 21:18

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా అట్టుడుకుతున్న నిరసనలు, ఆగ్రహావేశాలు పరాకాష్టకు చేరుకున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రజలు ముసుగులు ధరించి ప్రభుత్వ విధానాల పట్ల, అధ్యక్షుడి తీరుపట్ట తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా అన్ని విధాలుగానూ వెనిజులా చితికిపోవడం, నిరుద్యోగం పెరిగిపోవడం, ప్రజల ఆదాయం అడుగంటి పోవడంతో సంక్షోభం తారస్థాయికి చేరుకుంది.

05/10/2017 - 00:31

ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య ఘర్షణ ఈనాటిది కాదు. దశాబ్దాలుగా అంతూ పొంతూ లేకుండా సాగుతున్న ఈ ఇరు దేశాల ఘర్షణలు తాజాగా మరింత తీవ్రమయ్యాయి. పాలస్తీనాలోని ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్, గాజా ప్రాంతాల విషయంలో ఇజ్రాయెల్ తాజాగా చేపట్టిన నిర్ణయాలకు నిరసనగా పాలస్తీనీయులు వీధికెక్కారు. నిరసనలు, ఘర్షణలతో పరిస్థితి హోరెత్తిపోతోంది. మండుతున్న ఓ టైరును బలంగా తన్నుతూ తన ఆగ్రహాన్ని చాటుతున్న ఓ పాలస్తీనా నిరసనకారుడు.

05/10/2017 - 00:28

అనుకున్నట్టే ఫ్రాన్స్‌లో సరికొత్త రాజకీయ శకం ఆవిష్కృతమైంది. ప్రధాన రాజకీయ పార్టీలను తిప్పికొట్టిన ప్రజలు ఐరోపా యూనియన్ అనుకూల ఇమాన్యుయెల్ మాక్రన్‌కు పట్టం కట్టడం ఊరట కలిగించే అంశం. ఇమిగ్రేషన్ వ్యతిరేక లీపెన్‌ను ఎన్నుకుని ఉంటే రాజకీయంగా గందరగోళ పరిస్థితి తలెత్తి ఉండేది. ఇప్పటికే సభ్య దేశాల నిష్క్రమణ హెచ్చరికలతో అట్టుకుతున్న ఐరోపా యూనియన్ మరింత ఇరకాటంలో పడి ఉండేది.

05/10/2017 - 00:25

బ్రెగ్జిట్ వ్యవహారంలో బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే రోజుకో కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. ఇందుకు సంబంధించిన తతంగాన్ని అధికారికంగా ప్రారంభించినప్పటికీ దేశానికి ప్రయోజనాన్ని కలిగించే రీతిలో ఏవిధంగా ముందుకు వెళ్లాలన్నది అంతుబట్టని వ్యవహారంగా మారింది.

05/10/2017 - 00:14

దీర్ఘకాలం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టనున్న శ్రీలంక పర్యటనకు అనేక విధాలుగా వ్యూహాత్మక ప్రాధాన్యత ఉంది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే అత్యంత ప్రాధాన్యతతో, విస్తృత లక్ష్యాలతోనే మోదీ 12న లంకకు వెళుతున్నారన్నది స్పష్టం. ఎల్‌టిటిఇ సమస్య లంకలో అంతమైనప్పటి నుంచీ అక్కడ మైనార్టీ తమిళుల ఇబ్బందులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉన్నాయన్నది వాస్తవం.

05/10/2017 - 00:12

అంటార్కిటికా ఈ భూమిపై వెలసిన ఏకైక హిమఖండం. పర్యావరణ ప్రతికూల ప్రభావం అంటార్కిటికా మంచునూ కరిగించి తరిగిస్తోంది. ఫలితంగా ఒకే మంచుఖండంగా ఉన్న ఈ ప్రాంతం ముక్కలు ముక్కలుగా మారి కొండలుగా గుట్టలుగా రూపాంతరం చెందుతోంది. ఇలా కరిగి కరిగి ఓ హిమ ప్రాంతం కొండలా మారిన దృశ్యమిది. ఇలాంటి చల్లని వాతావరణంలోనే మనుగడ సాగించే పెంగ్విన్‌లకు ఈ హిమమే క్రీడాకేంద్రమైంది.

Pages