S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఈ వారం స్పెషల్
పంచపాదం పితరం ద్వాదశాకృతం
దివ ఆహుః పరే అర్థే పురీషిణం
అధౌమే అన్య ఉపరే విచక్షణం
సప్తచక్రీ షకోర ఆహురర్పితమితి
- ఋగ్వేదం
ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్‌లలో ‘నావల్ కరోనా వైరస్’ (ఎన్‌సీఓవీ) లేదా ‘కోవిడ్-19’ ను ప్రధానంగా పేర్కొనవచ్చు. ఈ వైరస్ అతిస్వల్ప కాలంలో ఒక రికార్డు నెలకొల్పిందంటే అతిశయోక్తికాదు. నావల్ కరోనా వైరస్ సరికొత్తదని తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రపంచంలోని అన్ని దేశాలు జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యుహెచ్‌ఓ హెచ్చరించింది.
జీవితంలో అనేక రూపాల్లో ప్రధాన భూమికను నిర్వహిస్తున్నారు మహిళలు. తల్లి, చెల్లి, భార్య, కుమార్తె ఇలా అనేక పాత్రల్లో స్ర్తిలు తమ కుటుంబంతో పాటు సమాజంతో మమేకమై జీవనం సాగిస్తున్నారు. మరో ప్రాణికి జన్మనిచ్చే అవకాశం కేవలం ఆడ వారికి మాత్రమే ఉంది. మాతృత్వం కారణంగా స్ర్తిలను దైవ సమానంగా కొలుస్తున్నారు. సహనానికి మారుపేరైన స్ర్తిని ‘్భమాత’తో పోల్చారు.
ఎవరైనా ఎదురైతే చాలు మనం అడిగే తొలి ప్రశ్న మీరేం చేస్తున్నారు? అంటాం.. లేదా ఏం చదువుతున్నారు? అనడం సహజం. ఇక పిల్లలు ఎదురైతే చెప్పనక్కర్లేదు.. ఏం చదువుతున్నావు అనే ప్రశ్నతో మొదలు పెట్టి ఏం చదవబోతున్నావు? ఏ కోర్సులో చేరుతావు? పర్సంటేజీలు, ప్రిపరేషన్లు, ఇష్టాయష్టాలూ, ప్రణాళికలూ అన్నీ అడిగేస్తుంటాం..
మాతృభాష అంటే అమ్మ భాష.. తల్లి ఉగ్గుపాలతో రంగరించి తాను మాట్లాడుతూ, బిడ్డలకు నేర్పించే భాషనే మాతృభాష అంటారు. ప్రపంచంలో అనేక భాషలు ఉన్నాయి. ప్రతి మనిషి పుట్టగానే తల్లి పొత్తిళ్లలోనే మాతృభాషను నేర్చుకుంటాడు. మనిషి పుట్టగానే నేర్చుకునే ప్రథమ భాష కాబట్టే దీన్ని మాతృభాష అని పిలుస్తున్నారు. ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని ఫిబ్రవరి 21న జరుపుకోవడానికి ఒక కారణం ఉంది.
ప్రపంచానికి ఆధ్యాత్మిక, దైవకాంతి పరిమళ వైభవాన్ని మహోజ్వలంగా, మహోన్నతంగా అందించిన భరతభూమి పుణ్యభూమి, కర్మభూమి. అందుకే భారతదేశం ప్రపంచ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంగా విరాజిల్లుతోంది. దేవతలు వివిధ అవతారాల రూపంతో స్వయంగా వసించినది వ్యధరణి మన భారతదేశం. ముల్లోకాల్లోని (కైలాసం, వైకుంఠం, బ్రహ్మ లోకం) దేవుళ్లకూ, భూలోకంలోని మానవులకు ప్రత్యక్ష సంబంధ బాంధవ్యాలను కలిగినది భారతదేశం.
రెండు అక్షరాల ప్రేమ.. ఆ రెండు అక్షరాలే రెండు గుండెలనూ ఊపేస్తాయి. పగలే వెనె్నల కురిసినట్లు.. ప్రపంచమంతా పూలు విరిసినట్లు.. ఆకాశమంతా వేనవేల రంగులు అద్దుకున్నట్లు.. ఏదో తియ్యని భావన నిలువనీయదు.. నిద్దుర రానీయదు.. మెలకువగా ఉన్నా స్వప్నాలే.. నిద్దురలో ఉన్నా కలల కలవరాలే.. ఆకలి వేయదు.. దాహం తీరదు.. ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనే.. ఇవన్నీ ప్రేమ ఉదయించేటప్పుడు కనిపించే లక్షణాలే..
ప్రపంచంలో ఏ రాజ్యాంగానికీ లేని విశిష్టత భారత రాజ్యాంగానిదే.. అందర్నీ కలుపుకుపోయే శక్తిని రాజ్యాంగమే ప్రసాదించింది. దేశ ప్రజల అఖండతను పరిరక్షిస్తూ, భారతీయులు సవాళ్లను ఎదురొడ్డి నిలిచేటట్టు తీర్చిదిద్దింది కూడా మన రాజ్యాంగమే. జనవరి 26 నాటికి రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 ఏళ్లుకాబోతోంది. ఈ సందర్భంగా మరోమారు రాజ్యాంగం గురించి విస్తృతమైన చర్చ మొదలైంది.
హోరుమనే అరేబియా సముద్రం ఒకవైపు..
ఎగసిపడే సౌపర్ణికా నది మరొక వైపు..
ఇక్కడి సంగమ స్థలంలో సోయగాల సముద్రం..
ఒంపు సొంపుల నది..
రెండూ కొంత దూరం అలా సాగిపోతాయి..
అలలు జోరుమీదున్నపుడు సాగరం అలా దూసుకొచ్చి నదీ జలాలను ముద్దాడుతున్న దృశ్యం అత్యంత మనోహరం..
పోటెత్తిన నదీ జలాలు సముద్రాన్ని సంతోషపెడతాయి..