S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం స్పెషల్

03/10/2019 - 00:00

స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుండి భారత్-పాకిస్తాన్ సరిహద్దులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. అదను చూసి పాక్ సేనలు మన భూభాగాలపై వికృత చర్యలకు పాల్పడుతూనే ఉన్నాయి, తరచూ యుద్ధాలకు కాలు దువ్వుతూనే ఉన్నాయ. చావు దెబ్బలు తప్పక పోతూ ఉండడంతో ప్రత్యక్ష పోరుకు స్వస్తి పలికి, ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ ప్రచ్ఛన్న యుద్ధానికి పాక్ పాలకులు దిగుతూనే ఉన్నారు.

03/03/2019 - 00:08

ప్రతి మాసంలోనూ, అమావాస్య ముందటి రోజు చతుర్దశిని మాస శివరాత్రి అని పేర్కొంటారు. అనగా సంవత్సరంలో పనె్నండు శివరాత్రులు వస్తాయి. అయితే, మాఘ మాసంలో వచ్చే మాస శివరాత్రిని, రాత్రి అంతా ఉండే చతుర్దశి తిథి గల రాత్రిని, మహాశివరాత్రి అని పిలుస్తారు. ‘శివ’ అంటే మంగళప్రదమైన, రాత్రి అనగా అజ్ఞానాంధకారం - చీకటి. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి మంగళప్రదమైన జ్ఞాన వెలుగును ప్రసాదించే రాత్రి - శివరాత్రి.

02/23/2019 - 20:07

భారతదేశం పుణ్యభూమి. ప్రపంచానికి ఆధ్యాత్మిక సంపదను సమకూర్చిన కర్మభూమి. భక్తి, ప్రేమ, దయ, నీతి, న్యాయం, సత్యం, సత్ప్రవర్తన, సహనం ఈ ధర్మభూమిపై అనాదిగా వికసిస్తున్నాయి. మన దేశంలో జన్మించిన మహానుభావులు, గురువులు తమదైన శైలిలో మానవాళికి ఆధ్యాత్మిక విలువలతో కూడిన జీవనానికి ముక్తిమార్గం చూపిస్తున్నారు. అలాంటి వారిలో సద్గురు జగ్గీ వాసుదేవ్‌ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు.

02/17/2019 - 00:04

ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం... ఈ వరుస క్రమంలో ఏటా రుతువులు వస్తాయన్నది ఒకప్పుడు మనం స్కూల్‌లో నేర్చుకొన్న పాఠం.. రుతువులు గతి తప్పడం, మితిమీరిన ప్రభావం చూపడం ఇప్పుడు మనకు అనుభవం నేర్పుతున్న పాఠం.. రుతువులు మనం రమ్మంటే వచ్చేవి, పొమ్మంటే పోయేవి కావు.. వాటి కాలమానం ప్రకారం అవి వచ్చేస్తాయి... రుతుధర్మం సజావుగా సాగితే సమస్యే లేదు.. మూడు కాలాలూ భరించలేనివిగా పరిణమించడం సమకాలీన ప్రాకృతిక వైపరీత్యం..

02/10/2019 - 00:07

ప్రేమ.. రెండు హృదయాల కలయిక..
ఇద్దరు మనుషులు ఏకం కావటం..
ఇద్దరి ఆలోచనలు ఒక్కటి కావటం..
ఒకరి ఆలోచనల్ని మరొకరు గౌరవించటం..
ఆదరించటం.. మన్నించటం..
*

02/03/2019 - 00:00

రెండు బీరువాల సైజులో ఉండే కంప్యూటర్ కాస్తా మన చేతిలో పట్టే సెల్‌ఫోన్ సైజులో ‘ట్యాబ్’ రూపాన ప్రత్యక్షమైనపుడు పెద్ద ఆశ్చర్యం కలగలేదు. ఒక చిన్న పనికి బ్యాంకుకు వెళ్లి లైన్‌లో గంటల తరబడి నిలబడిన రోజులు మరిచిపోయి కేవలం- సెకన్ల వ్యవధిలో డబ్బు పంపడం, ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం, మన బ్యాంకు అకౌంట్లలో నిల్వలు తెలుసుకోవడం వంటివి ఇట్టే చేసేస్తుంటే విస్మయం కలగలేదు.

01/27/2019 - 00:00

ప్రపంచం నలుమూలల నుంచి తండోపతండాలుగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించే మహాక్రతువే ‘కుంభమేళా’. కుంభమేళా అనేది దేవనాగరి లిపి నుండి వచ్చింది. వేదకాలం నుంచీ ఈ మహాక్రతువును నిర్వహిస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అలాంటి కుంభమేళా ప్రయాగ వద్ద సంగమ తీరంలో ఇపుడు మళ్లీ మొదలైంది. ఇది అర్ధ కుంభమేళానే అయినా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ‘కుంభ్’ అనాలని ప్రకటించింది.

01/20/2019 - 00:02

ఎన్నికలు భారతీయులకు అలవాటే.. కళ్లుమూసి తెరిచేలోగా ఏదో ఒక రకమైన ఎన్నికలు వస్తూనే ఉంటాయి.. బరిలో నిలిచిన అభ్యర్థులు తమ అనుకూలతలు, ప్రత్యర్థి ప్రతికూలతలను విస్తృతంగా ప్రచారం చేయడం, ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు చిట్కాలు ప్రయోగించడం ఇంత వరకూ చూశాం. పోలింగ్‌కు ముందు ఇచ్చే తాయిలాల కంటే నిరంతరం వాగ్దానాలు ఇచ్చి ఆకట్టుకునేందుకు సంక్షేమ పథకాల రూపంలో అనేక కార్యక్రమాలు ఉండనే ఉన్నాయి.

01/13/2019 - 00:01

పంచపాదం పితరం ద్వాదశాకృతిం
దివ ఆహుః పరే అర్థే పురీషిణం
అధేమే అన్యఉపరే విచక్షణం
సప్త చక్రౌషడర ఆహురర్పితమితి
-ఋగ్వేదం
*

01/05/2019 - 23:57

కొత్త సంవత్సరం వచ్చేసింది..
ఇంకా కోలాహలం తగ్గలేదు..

Pages